తెలుగు న్యూస్ / ఫోటో /
Janhvi Kapoor: హాలీవుడ్ పిచ్చితో మన సినిమాల్ని తక్కువ చేయద్దు - పుష్ప 2 ట్రోలర్స్‌కు జాన్వీ కపూర్ ఘాటు రిప్లై
అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కిన పుష్ప 2 మూవీ బాక్సాఫీస్ వద్ద కుమ్మేస్తోంది. తొలిరోజే 294 కోట్ల కలెక్షన్స్ రాబట్టి రికార్డులను కొల్లగొట్టింది. కలెక్షన్స్ బాగున్నా సినిమా కాన్సెప్ట్‌పై మాత్రం సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ వస్తోన్నాయి. పుష్ప 2లో కథే లేదంటూ కామెంట్స్ చేస్తోన్నారు.
(1 / 6)
హాలీవుడ్ మూవీ ఇంటర్‌స్టెల్లార్ రీ రిలీజ్ కోసం కేటాయించిన పలు ఐమాక్స్ థియేటర్లను పుష్ప 2కు ఇచ్చేశారు. పుష్ప 2 కంటే ఇంటర్‌స్టెల్లర్‌ను రిలీజ్ చేస్తేనే బాగుండేదంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తోన్నారు.
(2 / 6)
ఈ నెగెటివ్ కామెంట్స్ చేసిన వారిపై దేవర హీరోయిన్ జాన్వీకపూర్ ఫైర్ అయ్యింది. హాలీవుడ్ సినిమాల వ్యామోహంలో మన సినిమాల్ని తక్కువ చేయద్దు అంటూ కామెంట్స్ చేసింది.
(3 / 6)
లార్జర్ దేన్ లైఫ్ కాన్సెప్ట్‌లతో కూడిన రూటేడ్ సినిమాలను ఇతర దేశాల వారు మెచ్చుకుంటుంటే, మన వాళ్లు మాత్రం పుష్ప 2 లాంటి సినిమాలపై నెగెటివ్ కామెంట్స్ చేయడం సిగ్గుచేటుగా ఉందని జాన్వీకపూర్ అన్నది.
(5 / 6)
దేవర మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీకపూర్. ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఐదు వందల కోట్ల కలెక్షన్స్ సాధించింది.
ఇతర గ్యాలరీలు