OTT: రానా ద‌గ్గుబాటి టాక్ షోకు అటెండ్ కానున్నగెస్ట్‌లు వీళ్లే - శోభిత‌తో పెళ్లిపై నాగ‌చైత‌న్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌!-rajamouli to naga chaitanya these tollywood celebrities to attend the rana daggubati show amazon prime video ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott: రానా ద‌గ్గుబాటి టాక్ షోకు అటెండ్ కానున్నగెస్ట్‌లు వీళ్లే - శోభిత‌తో పెళ్లిపై నాగ‌చైత‌న్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌!

OTT: రానా ద‌గ్గుబాటి టాక్ షోకు అటెండ్ కానున్నగెస్ట్‌లు వీళ్లే - శోభిత‌తో పెళ్లిపై నాగ‌చైత‌న్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌!

Nelki Naresh Kumar HT Telugu
Nov 15, 2024 01:49 PM IST

OTT: రానా ద‌గ్గుబాటి త్వ‌ర‌లో ఓ టాక్ షోతో ఓటీటీ ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. ది రానా ద‌గ్గుబాటి షో టైటిల్‌తో రాబోతున్న ఈ షో న‌వంబ‌ర్ 23 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ టాక్ షో ప్రోమోను శుక్ర‌వారం రిలీజ్ చేశారు.

ఓటీటీ
ఓటీటీ

OTT: టాలీవుడ్ హీరో రానా ద‌గ్గుబాటి ఓటీటీ కోసం ఓ టాక్ షో చేయ‌బోతున్నాడు. అమెజాన్ ప్రైమ్‌లో ఈ టాక్ షో స్ట్రీమింగ్ కానుంది. ఈ టాక్‌షోకు ది రానా ద‌గ్గుబాటిషో అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. న‌వంబ‌ర్ 23 నుంచి టాక్ షో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది.

ప్రోమో రిలీజ్‌...

ఈ టాక్ షోకు సంబంధించిన ప్రోమోను అమెజాన్ ప్రైమ్ శుక్ర‌వారం రిలీజ్ చేసింది. ఈ టాక్ షో ప్రోమోలో టాలీవుడ్ హీరోలు నాగ‌చైత‌న్య‌, నాని, సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌, తేజ స‌జ్జాతో పాటు క‌న్న‌డ హీరో రిష‌బ్ శెట్టి, మ‌ల‌యాళం హీరో దుల్క‌ర్ స‌ల్మాన్ క‌నిపించారు. హీరోయిన్లు శ్రీలీల‌, ప్రియాంక మోహ‌న్, మీనాక్షి చౌద‌రి కూడా టాక్ షోలో సంద‌డి చేసిన‌ట్లుగా చూపించారు దిగ్గ‌జ ద‌ర్శ‌కులు రాజ‌మౌళితో పాటు రామ్ గోపాల్ వ‌ర్మ ద‌ర్శ‌న‌మిచ్చారు.

రానా ప్ర‌శ్న‌లు...

ఈ ప్రోమోలో సెలిబ్రిటీల‌ను రానా అడిగిన ప్ర‌శ్న‌ల‌కు వారు చెప్పిన స‌మాధానాలు ఆస‌క్తిని పంచుతోన్నాయి. వాళ్ల ఫ్యాన్స్ న‌న్ను తిట్ట‌డం, నా ఫ్యాన్స్ వాడిని తిట్టేయ‌డం ఏంటో అని రానా అన‌గా...మ‌న కాంట్ర‌వ‌ర్సీని దాటి కాంట్ర‌వ‌ర్సీ చేయ‌గ‌ల‌రా మీరిద్ద‌రు అని రానాను నాని అడ‌గ‌టం ఇంట్రెస్టింగ్‌గా ఉంది.

డ‌బ్బులు లేవు...

బాహుబ‌లి చేసేట‌ప్పుడు ఇలాంటి మంచి ఆఫీస్ ఎందుకు తీసుకోలేద‌ని రాజ‌మౌళిని రానా అడ‌గ్గా...అప్పుడు నా ద‌గ్గ‌ర డ‌బ్బులు లేవు అంటూ రాజ‌మౌళి స‌మాధానం చెప్ప‌డం న‌వ్వుల‌ను పంచుతోంది.

పెళ్లిపై నాగ‌చైత‌న్య ఏమ‌న్నాడంటే?

నాగ‌చైత‌న్య ఇంట‌ర్వ్యూలో ఎక్కువ‌గా ప‌ర్స‌న‌ల్ టాపిక్స్‌పై రానా ఫోక‌స్ పెట్టిన‌ట్లు తెలుస్తోంది. నీ ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉండాల‌ని ఊహించుకుంటున్నావ‌ని రానా అడిగిన ప్ర‌శ్న‌కు పిల్ల‌ల‌తో మ్యారేజ్ లైఫ్ ఆనందంగా సాగిపోవాల‌ని కోరుకుంటున్న‌ట్లు నాగ‌చైత‌న్య బ‌దులిచ్చాడు.

పిల్ల‌లు అంటే ఎంత మంది వెంకీమామ మాదిరిగా న‌లుగురు ఉండాలా అని రానా మ‌రో ప్ర‌శ్న‌వేశాడు. వెంకీమామ‌లా కాదు అంటూ నాగ‌చైత‌న్య...రానాకు బ‌దులిచ్చాడు. నాగ‌చైత‌న్య‌కు కారులో ఉన్న వ‌స్తువుల్ని రానా చూపించ‌గానే అరేయ్ ఎంట్రా ఇది నాగ‌చైత‌న్య ఆన్స‌ర్ ఇచ్చాడు. అవేమిట‌న్న‌ది మాత్రం చూపించ‌లేదు. ఈ టాక్ షోకు నాగ‌చైత‌న్య‌తో పాటు శోభిత దూళిపాళ్ల కూడా అటెండ్ కాబోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఫ‌న్నీ గేమ్స్‌...

కాంట్ర‌వ‌ర్సీ క్వ‌శ్చ‌న్స్‌తో పాటు సెల‌బ్రిటీల‌తో ఫ‌న్నీ గేమ్స్‌ను ఈ షోలో రానా ఆడించ‌బోతున్న‌ట్లు చూపించారు. ఇప్ప‌టికే చాలా మంది సెల‌బ్రిటీస్ ఇంట‌ర్వ్యూలు ప్రోమో చూస్తుంటే తెలుస్తోంది.

ఇటీవ‌ల రిలీజైన ర‌జ‌నీకాంత్ వేట్ట‌య‌న్‌లో రానా విల‌న్‌గా న‌టించాడు. జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞాన‌వేళ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ మూవీ 200 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది.

దుల్క‌ర్ స‌ల్మాన్ కాంత‌...

ప్ర‌స్తుతం తెలుగులో దుల్క‌ర్ స‌ల్మాన్‌, రానా క‌లిసి కాంత పేరుతో పీరియాడిక‌ల్ యాక్ష‌న్ మూవీ చేస్తోన్నారు. ఈ సినిమాను రానా స్వ‌యంగా ప్రొడ్యూస్ చేస్తోన్నాడు. ఈ మూవీలో భాగ్య‌శ్రీ బోర్సే హీరోయిన్‌గా న‌టిస్తోంది.

Whats_app_banner