The Rana Daggubati Show: ఓటీటీలోకి మరో తెలుగు సిరీస్.. నాగ చైతన్య, రాజమౌళి, దుల్కర్‌లతో రానా సందడి-the rana daggubati show on prime video streaming from 23rd november naga chaitanya ss rajamouli dulquer salman ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  The Rana Daggubati Show: ఓటీటీలోకి మరో తెలుగు సిరీస్.. నాగ చైతన్య, రాజమౌళి, దుల్కర్‌లతో రానా సందడి

The Rana Daggubati Show: ఓటీటీలోకి మరో తెలుగు సిరీస్.. నాగ చైతన్య, రాజమౌళి, దుల్కర్‌లతో రానా సందడి

Hari Prasad S HT Telugu
Nov 13, 2024 03:04 PM IST

The Rana Daggubati Show: ఓటీటీలోకి మరో తెలుగు సిరీస్ రాబోతోంది. ఈ షో పేరు ది రానా దగ్గుబాటి షో. మీకు తెలిసిన స్టార్స్.. తెలియని స్టోరీస్ అంటూ ప్రైమ్ వీడియో ఈ సరికొత్త టాక్ షో కమ్ సిరీస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది.

ఓటీటీలోకి మరో తెలుగు సిరీస్.. నాగ చైతన్య, రాజమౌళి, దుల్కర్‌లతో రానా సందడి
ఓటీటీలోకి మరో తెలుగు సిరీస్.. నాగ చైతన్య, రాజమౌళి, దుల్కర్‌లతో రానా సందడి

The Rana Daggubati Show: ఓటీటీలో ఇప్పటికే ఆహా వీడియోలో అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే అనే సెలబ్రిటీ టాక్ షో వస్తున్న విషయం తెలుసు కదా. ఇప్పుడు ప్రైమ్ వీడియోలోనూ ఓ టాక్ షో కమ్ తెలుగు ఒరిజినల్ సిరీస్ వస్తోంది. ఎనిమిది ఎపిసోడ్ల ఈ సిరీస్ లో తెలుగు సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖులు నాగ చైతన్య, ఎస్ఎస్ రాజమౌళి, దుల్కర్ సల్మాన్ లాంటి వాళ్లతో రానా దగ్గుబాటి ముచ్చటించనున్నాడు.

ది రానా దగ్గుబాటి షో

ది రానా దగ్గుబాటి షో పేరుతో అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సరికొత్త తెలుగు ఒరిజినల్ సిరీస్ ను తీసుకొస్తోంది. ఈ కొత్త సిరీస్ నవంబర్ 23న స్ట్రీమింగ్ కానున్నట్లు తాజాగా ప్రైమ్ వీడియో వెల్లడించింది. "మీకు తెలిసిన స్టార్లు.. మీకు తెలియని స్టోరీలు.. ది రానా దగ్గుబాటి షో చూడటానికి సిద్ధంగా ఉండండి. నవంబర్ 23న ప్రీమియర్ కానుంది" అనే క్యాప్షన్ తో సదరు ఓటీటీ ఈ విషయాన్ని ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.

మొత్తంగా ఎనిమిది ఎపిసోడ్లు ఈ సిరీస్ లో ఉండనున్నాయి. ఇందులో సెలబ్రిటీలు తమ మనసు విప్పి మాట్లాడనున్నారు. ఇప్పటి వరకూ వాళ్ల గురించి తెలియని ఎన్నో విషయాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. నవంబర్ 23 నుంచి ప్రతి శనివారం ఒక ఎపిసోడ్ ప్రైమ్ వీడియోలోకి రాబోతోంది. ఈ షోని క్రియేట్ చేయడంతోపాటు స్పిరిట్ మీడియా పేరుతో రానా దగ్గుబాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఉన్నాడు.

ఏంటీ రానా దగ్గుబాటి షో?

ఇప్పటి వరకూ ఎన్నో సెలబ్రిటీ టాక్ షోలు వచ్చినా కూడా ఇది మాత్రం వాటికి పూర్తి భిన్నంగా ఉండబోతోందని ప్రైమ్ వీడియో చెబుతోంది. రానాతో కలిసి సెలబ్రిటీలు తమ వ్యక్తిగత జీవితాల గురించి ఇప్పటి వరకూ తెలియని విశేషాలను పంచుకోబోతున్నట్లు తెలిపింది. అంతేకాదు కొన్ని యాక్టివిటీస్ లోనూ పాల్గొననున్నారు. సిల్వర్ స్క్రీన్ జీవితం కాకుండా తమ వ్యక్తిగత హాబీల గురించి కూడా ఈ షోలో చూపించబోతున్నారు.

రానా షోకి వచ్చే గెస్టులు వీళ్లే..

ది రానా దగ్గుబాటి షోకి టాలీవుడ్ లోని ప్రముఖులు ఎంతో మంది రాబోతున్నారు. అందులో దుల్కర్ సల్మాన్, నాగ చైతన్య, సిద్దూ జొన్నలగడ్డ, నాని, రాజమౌళి, శ్రీలీల, రామ్ గోపాల్ వర్మలాంటి వాళ్లు ఉండటం విశేషం. ఈ గెస్టుల లిస్టుతోనే ప్రైమ్ వీడియో ఈ టాక్ షోపై ఆసక్తి రేపుతోంది. గతంలోనూ రానా ఇలాంటి ఓ సెలబ్రిటీ టాక్ షో చేసినా.. ఇది మాత్రం భిన్నంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

మీరు ఊహించని ఎన్నో విషయాలు ఈ షో ద్వారా తెలుస్తాయని రానా చెప్పడం విశేషం. ఈ షో గురించి తాను చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు చెప్పాడు. తొలి వారం వచ్చే గెస్టు ఎవరన్న సస్పెన్స్ తోపాటు ప్రతి వారం ఏ గెస్ట్ వస్తాడన్న ఆసక్తి కూడా ప్రేక్షకుల్లో నెలకొంది. నవంబర్ 23 నుంచి ప్రతి శనివారం ఒక ఎపిసోడ్ ప్రైమ్ వీడియోలోకి వస్తుంది.

Whats_app_banner