తెలుగు న్యూస్ / ఫోటో /
IRCTC Andaman Tour 2025 : న్యూ ఇయర్ వేళ 'అండమాన్' ట్రిప్..! తగ్గిన టికెట్ ధరలు, హైదరాబాద్ నుంచి కొత్త టూర్ ప్యాకేజీ ఇదే
- IRCTC Hyderabad Andaman Tour 2025 : రాబోయే న్యూ ఇయర్ లో అండమాన్ ట్రిప్ వెళ్లే ప్లాన్ ఉందా..? అయితే మీకోసంIRCTC టూరిజం హైదరాబాద్ నుంచి టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేయనుంది. ఫిబ్రవరి 12, 2025వ తేదీన జర్నీ ఉంటుంది. ఆరు రోజులపాటు అక్కడే ఉండి అండమాన్ లోని టూరిస్ట్ ప్లేసులన్నీ చూసి రావొచ్చు….
- IRCTC Hyderabad Andaman Tour 2025 : రాబోయే న్యూ ఇయర్ లో అండమాన్ ట్రిప్ వెళ్లే ప్లాన్ ఉందా..? అయితే మీకోసంIRCTC టూరిజం హైదరాబాద్ నుంచి టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేయనుంది. ఫిబ్రవరి 12, 2025వ తేదీన జర్నీ ఉంటుంది. ఆరు రోజులపాటు అక్కడే ఉండి అండమాన్ లోని టూరిస్ట్ ప్లేసులన్నీ చూసి రావొచ్చు….
(1 / 8)
మరికొద్దిరోజుల్లోనే కొత్త సంవత్సం రాబోతుంది. అయితే న్యూ ఇయర్ వేళ IRCTC టూరిజం అండమాన్ టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేయనుంది. మొత్తం 6 రోజులు ఉంటుంది. (image source unsplash.com)
(2 / 8)
"AMAZING ANDAMAN EX HYDERABAD (SHA18)" పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తుంది. హైదరాబాద్ నుంచి ఫ్లైట్ జర్నీ ఉంటుంది. IRCTC టూరిజం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. ఈ ప్యాకేజీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 12వ తేదీన అందుబాటులో ఉంది.(image source unsplash.com)
(3 / 8)
హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఉదయం 06:35 గంటలకు ఫ్లైట్ బయల్దేరుతుంది.09.15 గంటలకు పోర్ట్ బ్లెయిర్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. హోటల్ లోకి చెకిన్ అయిన తర్వాత.. సెల్యూలర్ జైల్ మ్యూజియంను సందర్శిస్తారు. ఆ తర్వాత Corbyns Cove Beachకు వెళ్తారు. ఆ తర్వాత సెల్యూలర్ జైలు వద్ద లైడ్ అండ్ సౌండ్ షోను వీక్షిస్తారు. రాత్రికి పోర్ట్ బ్లెయిర్ లోనే ఉంటారు.(image source unsplash.com)
(4 / 8)
ఇక రెండో రోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత Havelock కు వెళ్తారు. రాధానగర్ బీచ్ వద్ద లంచ్ ఉంటుంది. రాత్రికి Havelock లోనే బస చేస్తారు. ఇక మూడో రోజు Kala Pathar బీచ్ కు వెళ్తారు. ఆ తర్వాత సీతపుర్ బీచ్, లక్ష్మణ్ పుర్ బీచ్ సందర్శిస్తారు. నాల్గోరోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత….భరత్ నగర్ బీచ్ కు వెళ్తారు. ఇక్కడ స్విమ్మింగ్ ఉంటుంది. అంతేకాదు పలు స్పోర్ట్స్ ఈవెంట్స్ ఉంటాయి. ఆ తర్వాత ఫోర్ట్ బ్లెయిర్ కు వెళ్తారు. రాత్రి కూడా ఇక్కడే ఉంటారు.(image source unsplash.com)
(5 / 8)
ఐదో రోజు రోస్ ఐల్యాండ్ కు చేరుకుంటారు. నార్త్ బే ఐల్యాండ్ ను సందర్శిస్తారు. ఇక్కడ కూడా స్పోర్ట్ ఈవెంట్స్ ఉంటారు. తిరిగి పోర్ట్ బ్లెయిర్ కు చేరుకుంటారు, ఆ తర్వాత Samudrika మెరైన్ మ్యూజియం వెళ్తారు. సాయంత్రం షాపింగ్ చేయవచ్చు. రాత్రి పోర్ట్ బ్లెయిర్ లోనే ఉంటారు. (image source unsplash.com)
(6 / 8)
ఇక చివరి రోజు పోర్ట్ బ్లెయిర్ నుంచి ఉదయం 07. 30 గంటలకు ఎయిర్ పోర్ట్ చేరుకుంటారు. ఉదయం 09. 30 గంటలకు ప్లైట్ ఉంటుంది. అక్కడ్నుంచి హైదరాబాద్ కు చేరుకోవటంతో టూర్ ముగుస్తుంది.(image source unsplash.com)
(7 / 8)
హైదరాబాద్ - అండమాన్ టూర్ ప్యాకేజీ ధరలు : సింగిల్ ఆక్యూపెన్సీ కోసం ధర రూ.68,320గా ఉంది. డబూల్ ఆక్యుపెన్సీకి రూ.51,600 కాగా, ట్రిపుల్ ఆక్యూపెన్సీకి రూ.49,960గా నిర్ణయించారు. హోటల్, ఫుడ్, ట్రావెల్ ఇన్సూరెన్స్ లాంటివి ఈ ప్యాకేజీలో కవర్ అవుతాయి. 5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు వేర్వురు ధరలు ఉన్నాయి. https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి బుకింగ్ తో పాటు మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.(image source unsplash.com)
ఇతర గ్యాలరీలు