Eat Healthy at Restaurants: బయట ఫుడ్ ఎక్కువగా తింటున్నారా..? బరువు పెరగకుండా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి
Eat Healthy at Restaurants: వీకెండ్స్‌లో, ఏదైనా ప్రత్యేక సందర్భాల్లో రెస్టారెంట్లకు వెళుతుంటాం. కళ్ల ముందు అన్ని వెరైటీలను టేస్ట్ చేయాలని తపనతో బాగా తినేసి బరువు పెరిగిపోతుంటాం. ఇలా పదే పదే వెళ్లి బయట తిండి తింటూ ఉన్నా బరువు పెరగకుండా ఉండాలంటే ఇలా చేయండి.
ఇంట్లో నుంచి రిఫ్రెష్మెంట్ కోసం బయటకు వెళ్లి భోజనం చేయడం అంటే అందరికీ సరదాగానే ఉంటుంది. కానీ ఆ సంబరంలో అతిగా తినేసి, బరువు పెరగడానికి కూడా కారణమవుతుంది. పోషకాహార నిపుణులు ఇస్తున్న సూచనల ప్రకారం, బయట తినేటప్పుడు ఆరోగ్యంగా ఉండటానికి ఈ స్మార్ట్ చిట్కాను ఉపయోగించవచ్చు. ఇలా చేయడం వల్ల మీరు మీ సోషల్ లైఫ్‌ని వదులుకోకుండా ఇంకా ఆరోగ్యంగానూ ఉండేందుకు ఈ పనులు చేస్తే చాలు.
భోజనానికి ముందు నిమ్మరసం తాగడం
ఇంట్లో తిన్నట్టుగానే రెస్టారెంట్లో కూడా ఏ తింటున్నామో, ఎంత తింటున్నామో అనే విషయాన్ని జ్ఞప్తికి ఉంచుకోవాలి. ఈ చిట్కా పాటించడం వల్ల బరువు పెరగకుండా కాపాడటమే కాకుండా షుగర్ వంటి సమస్యలు రాకుండా కూడా కాపాడుతుంది. నిమ్మకాయ బాడీలో షుగర్ శాతాన్ని30 శాతం తగ్గిస్తుంది. భోజనానికి ముందు నీరు తాగడం కూడా ఓ రకంగా మంచిదే. ఇది మిమ్మల్ని అతిగా తినకుండా అడ్డుకుంటుంది. మీరు తీసుకున్న ఆహారం కొద్దిగానైనా మీకు కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. ఫలితంగా ఎక్కువ ఆహారం తీసుకోలేరు.
తాగే నీటిలో నిమ్మకాయ ముక్కలు
మీరు తాగే నీటిలో కొన్ని నిమ్మకాయ ముక్కలను ఉంచండి. ఇలా ఉంచిన నీటిని మీరు తినడానికి ముందు లేదా మీ భోజనానికి ముందు తాగండి. అలా చేయడం వల్ల నిమ్మకాయలోని అధిక గ్లైసెమిక్ ఆహారాలలో ఉండే పిండి పదార్ధాన్ని చక్కెరగా మార్చడాన్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా మీరు బయట తినేటప్పుడు, ఇది మీ రక్తంలో చక్కెరను నెమ్మదిగా పెంచుతుంది. అందువల్ల మీకు కలిగే నష్టం తీవ్రత తగ్గుతుంది. కాబట్టి, రెస్టారెంట్లో భోజనం చేసే ముందు నిమ్మకాయ ముక్కలు వేసిన నీటిని తాగాలి.
ఎంతవరకూ పనిచేస్తుంది?
భోజనానికి ముందు నీరు తాగడమనేది మంచి ఛాయీస్. ప్రత్యేకించి చక్కెర కలిపిన తియ్యటి పానీయాలకు బదులు నిమ్మకాయ నీరు ఉత్తమం. చక్కెర వల్ల యాడ్ అదనపు కేలరీలకు బదులు నీరు తాగడం వల్ల శరీరంలోకి చేరే కేలరీల శాతం తగ్గుతుంది.
నిమ్మరసం ఏరోజైనా తీసుకోవచ్చు: వాస్తవానికి బయట తినేటప్పుడే కాదు. ఇంట్లో తినే సమయంలో కూడా భోజనానికి ముందు నిమ్మరసం తీసుకోవడం ఉత్తమమైన నిర్ణయమే. ఎందుకంటే నిమ్మరసంలోని సిట్రిక్ ఆమ్లం కడుపులో ఆమ్ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఇది మీ శరీరంలో ఆహారాన్ని మరింత సమర్థవంతంగా విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతుంది. ఈ నిమ్మరసాన్ని కూడా మితంగానే తీసుకోవాలి. ఎక్కువగా తీసుకుంటే కడుపులో ఎసిడిక్ ఫీలింగ్ మరింత పెరిగిపోతుంది.
మెడికల్ జర్నల్ స్ప్రింగ్లో ప్రచురించిన 2022 అధ్యయనం ప్రకారం, భోజనానికి ముందు నిమ్మకాయ నీరు త్రాగటం జీర్ణక్రియను ప్రోత్సహించడానికి, మెరుగుపరచడంలో సహాయపడుతుంది. నిమ్మరసంలోని సిట్రిక్ యాసిడ్ గ్యాస్ట్రిక్ యాసిడ్ స్రావాన్ని పెంచడానికి సహాయపడుతుందని పరిశోధకులు కనుగొన్నారు. ఇది కడుపులో ఉత్పత్తి అయ్యే జీర్ణ ద్రవం, ఇది మీ శరీరంలో ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడానికి, జీర్ణం కావడానికి సహాయపడుతుంది.
అధ్యయనంలో తేలింది ఇదే:
అంతేకాకుండా, మెడికల్ జర్నల్ పబ్మెడ్ సెంట్రల్లో ప్రచురించిన 2018 అధ్యయనంలో, భోజనానికి ముందు నీరు తాగిన వారు ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకోలేదట. పైగా ముందుగా నీరు తాగడం వల్ల కడుపు నిండిన ఫీలింగ్ కలిగి సంతృప్తికరంగా కొద్దిపాటి ఆహారంతోనే ముగించారట. ఫలితంగా భోజనానికి ముందు నీటి వినియోగం ప్రభావవంతమైన ఫలితం ఇచ్చిందని, ఇది బరువు తగ్గడానికి చక్కటి వ్యూహం అని అధ్యయనంలో పేర్కొన్నారు.
సంబంధిత కథనం