Weightloss tips: భోజనానికి ముందు ఈ చిన్న పని నెల రోజులు చేయండి చాలు, నెలలో మూడు కిలోలపై పైగా తగ్గిపోవచ్చు-just do this small task for a month before meals you can lose weight more than three kilos in a month ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Weightloss Tips: భోజనానికి ముందు ఈ చిన్న పని నెల రోజులు చేయండి చాలు, నెలలో మూడు కిలోలపై పైగా తగ్గిపోవచ్చు

Weightloss tips: భోజనానికి ముందు ఈ చిన్న పని నెల రోజులు చేయండి చాలు, నెలలో మూడు కిలోలపై పైగా తగ్గిపోవచ్చు

Haritha Chappa HT Telugu
Oct 15, 2024 10:29 AM IST

Weightloss tips: భోజనానికి ముందు నీరు త్రాగటం వల్ల మీరు నిజంగా బరువు తగ్గుతారా? ఎంత బరువు ఎలా తగ్గే అవకాశం ఉందో పోషకాహార నిపుణులు చెబుతున్నారు. రెండు గ్లాసులు ఆకలిని నియంత్రించి బరువును ఎలా తగ్గిస్తుందో తెలుసుకోండి.

బరువు తగ్గించే సులువైన చిట్కా
బరువు తగ్గించే సులువైన చిట్కా

బరువు తగ్గడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, కానీ మంచి ఫలితాలను పొందలేరు. పోషకాహార నిపుణుడు అలాన్ అరగాన్ భోజనానికి ముందు రెండు గ్లాసుల నీరు త్రాగటం వల్ల బరువు తగ్గవచ్చని చెబుతున్నారు. అలాన్ భోజనానికి ముందు తాను రెండు గ్లాసుల నీటిని తాగుతానని ఇది పొట్ట నిండేలా చేసి ఆహారం తక్కువగా తినేలా చేస్తుందని అతను చెబుతున్నారు.

'వాటర్ ట్రిక్' పనిచేస్తుందా?

మన ఆరోగ్యానికి, శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడానికి నీళ్లు తాగడం చాలా అవసరం. అలన్ అరగాన్ చెప్పిన 'వాటర్ ట్రిక్' ఆకలిని నియంత్రించడానికి ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే మన శరీరం తీసుకునే కేలరీలను కూడా తగ్గిస్తుంది. అందుకే భోజనానికి ముందు రెండు గ్లాసుల నీరు త్రాగటం చాలా ముఖ్యం.

అలన్ మాట్లాడుతూ పొట్ట నిండేలా ఉంటే ఆహారం తక్కువగా తింటామని, వాటర్ ట్రిక్ ను ప్రతిరోజూ పాటించడం చాలా అవసరం. ఒక నెలలోనే మూడు కిలోల వరకు బరువు తగ్గాలనుకుంటే ప్రతి భోజనానికి ముందు రెండు గ్లాసుల నీరు తాగేందుకు ప్రయత్నించండి. వాటర్ ప్రీలోడింగ్ తరువాత కచ్చితంగా ఆహారం తక్కువగానే తింటరు. ముఖ్యంగా డిన్నర్ తినడానికి బయటకు వెళ్లినప్పుడు ఇలా చేయడం మంచిది.

భోజనానికి ముందు ఇలా నీరు అధికంగా తాగడం వల్ల ఆరోగ్యమే కానీ ఎలాంటి నష్టాలు లేవు.  నీరు అధికంగా  త్రాగటం వల్ల జీర్ణ ఎంజైమ్ లు  పలుచన అవుతాయన్న భయం పెట్టుకోకూడదు. భోజనానికి ముందే నీరు తాగుతారు కాబట్టి ఆరోగ్యానికి వచ్చే సమస్యలు కూడా ఏమీ లేవు.  బరువు తగ్గేందుకు ‘వాటర్ ట్రిక్’ పాటించడం అన్ని విధాలా మంచిదని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.

భోజనానికి ముందు నీటి ట్రిక్ పనిచేస్తుందా?

ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్స్ ఇంటర్నల్ మెడిసిన్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ రాకేష్ గుప్తా చెబుతున్న ప్రకారం, భోజనానికి ముందు నీటి ట్రిక్ 'బరువు నిర్వహణకే కాదు మొత్తం ఆరోగ్యానికి మద్దతు ఇవ్వడానికి కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది. భోజనానికి ముందు నీరు త్రాగటం మీకు అన్నివిధాలా మంచే చేస్తుంది. ఇది అధిక కేలరీలను తీసుకోవడాన్ని తగ్గిస్తుంది.

డాక్టర్ రాకేష్ గుప్తా మాట్లాడుతూ భోజనానికి ముందు నీరు త్రాగటం నిజంగా బరువు నియంత్రణకు సహాయపడుతుందని అనేక అధ్యయనాలు నిర్ధారించాయని చెబుతున్నారు. నీరులో కేలరీలు ఉండవు. కానీ పొట్ట నిండిన ఫీలింగ్ అందిస్తుంది.   ఇది భోజనం సమయంలో తక్కువ తినేలా చేస్తుంది. ఒబేసిటీలో ప్రచురించిన ఒక అధ్యయనంలో, ప్రతి భోజనానికి ముందు 500 మి.లీ నీరు తాగినవారు మూడు నెలల్లోనే అధికంగా బరువు తగ్గినట్టు తెలిసింది. 

అంతేకాక, నీరు జీర్ణక్రియకు సహాయపడుతుంది. శరీరం సహజ విధులను నిర్వహించడానికి సహాయపడుతుంది. ఇది మొత్తం ఆరోగ్యానికి ముఖ్యమైనది. భోజనానికి ముందు నీరు త్రాగటం అనేది ఆకలిని తగ్గిస్తుంది. శరీరం డీ హైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతుంది.  

అయితే, భోజనానికి ముందు నీరు త్రాగటం మాత్రమే బరువు తగ్గడానికి సొల్యూషన్ అనుకోవద్దు.  ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో పాటూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా అవసరం.

 

Whats_app_banner