GST Council: యూజ్డ్ కార్లపై జీఎస్టీ పెంపు!; ఈ ప్రొడక్ట్స్ పై పన్నుల్లో మార్పులు; జీఎస్టీ కౌన్సిల్ భేటీ హైలైట్స్ ఇవే..-gst council meeting highlights nirmala sitharaman defers decision on insurance ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gst Council: యూజ్డ్ కార్లపై జీఎస్టీ పెంపు!; ఈ ప్రొడక్ట్స్ పై పన్నుల్లో మార్పులు; జీఎస్టీ కౌన్సిల్ భేటీ హైలైట్స్ ఇవే..

GST Council: యూజ్డ్ కార్లపై జీఎస్టీ పెంపు!; ఈ ప్రొడక్ట్స్ పై పన్నుల్లో మార్పులు; జీఎస్టీ కౌన్సిల్ భేటీ హైలైట్స్ ఇవే..

Sudarshan V HT Telugu
Dec 21, 2024 04:51 PM IST

GST Council Meeting Highlights: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 55వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశం రాజస్తాన్ లోని జైసల్మేర్ లో జరుగుతోంది. బీమా పన్నుపై నిర్ణయాన్ని ఈ భేటీలో తీసుకోవడం లేదు. పాప్ కార్న్ కు సంబంధించి జీఎస్టీలో మార్పులు చేశారు.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (PTI Photo / Manvender Vashist Lav)

GST Council Meeting Highlights: రాజస్థాన్ లోని జైసల్మేర్ లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన 55వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో బీమా ఉత్పత్తులకు జీఎస్టీ కి సంబంధించిన నిర్ణయంపై చర్చను వాయిదా వేశారు. అనంతరం పన్నుల ఫ్రేమ్ వర్క్ కు పలు అప్ డేట్స్ ను ప్రవేశపెట్టారు.

55వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం విశేషాలు

55వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో వివిధ రంగాలలో పన్ను రేట్లను సర్దుబాటు చేశారు. ఆ వివరాలు..

పాప్ కార్న్ టాక్సేషన్: ఉప్పు, మసాలాలతో కూడిన పాప్ కార్న్ (అన్ ప్యాకేజ్డ్ అయితే) 5% జీఎస్టీని, ప్రీ-ప్యాకేజ్డ్ పాప్ కార్న్ పై 12% జీఎస్టీ, క్యారమెల్-కోటెడ్ పాప్ కార్న్ పై 18% పన్ను విధించాలని నిర్ణయించారు.

ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్: తుది వినియోగంతో సంబంధం లేకుండా జీఎస్టీ రేటును మునుపటి 18% నుండి 5% కు తగ్గించారు.

ఆటోక్లేవ్డ్ ఏరేటెడ్ కాంక్రీట్ (ఎసిసి) బ్లాక్స్: 50% కంటే ఎక్కువ ఫ్లై యాష్ ఉన్న ఏసీసీ బ్లాకులపై ఇప్పుడు జీఎస్టీ (GST) ని 18% నుండి 12 శాతానికి తగ్గించారు.

యూజ్డ్ కార్లు, ఎలక్ట్రిక్ వాహనాలు: చిన్న పెట్రోల్/డీజిల్ వాహనాలు, ఎలక్ట్రిక్ వాహనాలతో (electric vehicles) సహా పాత, ఉపయోగించిన కార్ల అమ్మకాలపై జీఎస్టీని 12 శాతం నుంచి 18 శాతానికి పెంచడానికి కౌన్సిల్ ఆమోదం తెలిపింది.

మంత్రులు, సీఎంలు హాజరు

కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరితో పాటు పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రులు, కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (CBIC) అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మంత్రుల బృందం మధ్య చర్చల తరువాత మరింత సమీక్ష అవసరమని పేర్కొంటూ బీమా (insurance) సంబంధిత జిఎస్టి మార్పులకు సంబంధించిన నిర్ణయాలను వాయిదా వేయాలని కౌన్సిల్ నిర్ణయించినట్లు వివిధ మీడియా నివేదికలు తెలిపాయి. దీనిపై మరింత చర్చ జరగాల్సిన అవసరం ఉందని కొందరు సభ్యులు చెప్పారు. మేము (GoM) జనవరిలో మళ్లీ సమావేశమవుతాము" అని బీమాపై జివోఎంకు నేతృత్వం వహిస్తున్న బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి చెప్పారు.

మంత్రుల బృందం అధ్యయనం

శనివారం జరిగిన 55వ సమావేశంలో జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియంలపై పన్ను రేట్లను తగ్గించే నిర్ణయాన్ని జీఎస్టీ కౌన్సిల్ వాయిదా వేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మరిన్ని సాంకేతిక చర్చలు అవసరమని కౌన్సిల్ సభ్యులు అంగీకరించారు. దీనిపై అదనపు చర్చల కోసం మంత్రుల బృందం ను నియమించింది.

Whats_app_banner