Electric Vehicles : ఎలక్ట్రిక్ వాహనాలతో కలిగే ప్రయోజనాలు, నష్టాలు.. ఓ లుక్కేయండి-advantages and disadvantages of electric vehicles check good and bad about electric cars and ev scooters ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Electric Vehicles : ఎలక్ట్రిక్ వాహనాలతో కలిగే ప్రయోజనాలు, నష్టాలు.. ఓ లుక్కేయండి

Electric Vehicles : ఎలక్ట్రిక్ వాహనాలతో కలిగే ప్రయోజనాలు, నష్టాలు.. ఓ లుక్కేయండి

Anand Sai HT Telugu
Dec 11, 2024 12:30 PM IST

Electric Vehicles : ఎలక్ట్రిక్ వాహనాలకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతుంది. ఎలక్ట్రిక్ వాహనాలతో కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. దానితోపాటుగా ఇతర నష్టాలు కూడా ఉన్నాయి.

ఎలక్ట్రిక్ వాహనాలు
ఎలక్ట్రిక్ వాహనాలు (istockphoto)

భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాలదే హవా కొనసాగనుంది. ప్రపంచంలోని చాలా దేశాలు ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు మళ్లుతున్నాయి. భారత్ కూడా ఈ దిశగా నెమ్మదిగానే ముందుకు సాగుతోంది. ఇప్పటికే మార్కెట్లో చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లు, బైకులను విడుదల చేస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల ప్రయోజనాలు, కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. అవేంటో చూద్దాం..

ఎలక్ట్రిక్ వాహనాల ప్రయోజనాలు

తక్కువ కాలుష్యం ఎలక్ట్రిక్ వాహనాల అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే అవి సాంప్రదాయ వాహనాల కంటే చాలా తక్కువ కాలుష్యాన్ని ఉత్పత్తి చేస్తాయి. వీటిలో దాదాపు ఎటువంటి ఉద్గారాలను ఉత్పత్తి చేయని మోటారు ఉంటుంది. దీంతో కాలుష్యం సమస్య ఉండదు.

ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించడం ద్వారా రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్ లేదా డీజిల్ ధరలను వదిలించుకోవచ్చు. ఇంధనం నింపుకోవడానికి మళ్లీ మళ్లీ పెట్రోల్‌ పంప్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లో సైతం ఛార్జింగ్ పెట్టేందుకు అవకాశం ఉంటుంది.

ఇతర వాహనాలతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాల నిర్వహణలో తక్కువ ఖర్చు అవుతుంది. దీనికి పెద్దగా సర్వీసింగ్ అవసరం లేదు. దీన్ని ఇంట్లో కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. మీకు డబ్బులు ఎక్కువగా ఖర్చు అవ్వదు.

ఎలక్ట్రిక్ వాహనాలు కచ్చితంగా సంప్రదాయ వాహనాల కంటే చాలా తక్కువ శబ్దం చేస్తాయి. అవి ఎక్కువ వైబ్రేట్ చేయవు. ఎలక్ట్రిక్ వాహనం ప్రయాణం చాలా మృదువైనది. ప్రయాణికులకు ఇబ్బంది అనిపించదు.

ఎలక్ట్రిక్ వాహనాల నష్టాలు

ఎలక్ట్రిక్ వాహనాల అతిపెద్ద ప్రయోజనం ఏంటంటే దానికి ఎటువంటి ఇంధనం అవసరం లేదు. ఛార్జ్ చేస్తే సరిపోతుంది. అయితే ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకునే అవకాశం లేకుంటే.. ఛార్జింగ్ స్టేషన్లు తగినంత సంఖ్యలో లేకపోవడం అతిపెద్ద సమస్యగా మారుతుంది. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు ఇప్పుడే ప్రారంభమయ్యాయి. దేశంలో ఛార్జింగ్ స్టేషన్లు నామమాత్రంగా ఉన్నాయి.

సాధారణంగా డీజిల్ లేదా పెట్రోల్ కార్ల కంటే ఎలక్ట్రిక్ కార్లు చాలా ఖరీదైనవి. అదే ధరలో మరొక మంచి కారును కొనుగోలు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో వస్తున్న ఎలక్ట్రిక్ కార్లు లేదా స్కూటర్లు అంత పవర్ ఫుల్ గా లేవని కొందరు అంటారు.

ఎలక్ట్రిక్ వాహనాలు సంప్రదాయ డీజిల్ లేదా పెట్రోల్ వాహనాల కంటే తక్కువ శక్తివంతమైనవి. వాటిలో ఇప్పుడు మోటార్లు వాడుతున్నారు. వాటి ధర కూడా ఎక్కువ. మరోవైపు ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల్లో మంటలు రావడం కనిపిస్తుంది.

ఇతర సాంప్రదాయ వాహనాల కంటే ఈవీ చాలా తక్కువ కాలుష్యాన్ని కలిగిస్తాయి. ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉపయోగించే బ్యాటరీలు, వాటిని ఛార్జ్ చేయడానికి ఉపయోగించే శక్తితో కాస్త ఇబ్బందులు ఉంటాయి.

Whats_app_banner