Ashwin: ఇంటర్నేషనల్ క్రికెట్‌లో టెస్టులు, వన్డేలతో పాటు టీ20ల్లో అశ్విన్ చివరగా ఔట్ చేసింది ఎవరినంటే?
Ashwin: ఇటీవలే ఇంటర్నేషన్ క్రికెట్‌కు అనూహ్యంగా రిటైర్‌మెంట్ ప్రకటించి అభిమానులకు షాకిచ్చాడు అశ్విన్. పధ్నాలుగేళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో అశ్విన్ మొత్తంగా 765 వికెట్లు తీసుకున్నాడు. టెస్టులు, వన్డేలతో పాటు టీ20ల్లో అశ్విన్ తీసిన చివరి వికెట్ ఏ క్రికెటర్‌ది అంటే?
Ashwin: టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. అశ్విన్ రిటైర్‌మెంట్ క్రికెట్ వర్గాలతో పాటు అభిమానులను షాక్‌కు గురిచేసింది. ఆస్ట్రేలియా గడ్డపై ... టెస్ట్ సిరీస్ మధ్యలోనే కెరీర్‌కు అశ్విన్ గుడ్‌బై చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది. అశ్విన్ రిటైర్‌మెంట్‌వెనుక ఏదో పెద్ద కారణమే ఉండి ఉంటుందని పుకార్లు షికారు చేస్తోన్నాయి. అశ్విన్ రిటైర్‌మెంట్ ప్రకటించేలా టీమ్ మేనేజ్‌మెంట్ చేసిందని ఫ్యాన్స్ విమర్శలు గుప్పిస్తోన్నారు.
అశ్విన్ రిటైర్‌మెంట్ వెనుక అవమానాలు ఉండొచ్చు అంటూ అతడి తండ్రి చేసిన కామెంట్స్ క్రికెట్ వర్గాల్లో కలకలాన్ని రేపుతోన్నాయి. అశ్విన్ రిటైర్‌మెంట్‌పై అతడి భార్య ప్రీతి ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. అశ్విన్ రిటైర్‌మెంట్ గురించి కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు కోచ్ గంభీర్‌కు మాత్రమే తెలుసునని, కోహ్లితో పాటు మిగిలిన క్రికెటర్లు కూడా అశ్విన్ రిటైర్‌మెంట్ ప్రకటనతో షాక్ అయ్యారని తెలుస్తోంది.
106 టెస్ట్‌లు...
కాగా పధ్నాలుగేళ్ల సుదీర్ఘ కెరీర్‌లో అశ్విన్ 106 టెస్ట్‌లు, 116 వన్డేలు, 56 టీ20 మ్యాచ్‌లు ఆడాడు అశ్విన్. టెస్టుల్లో 537 , వన్డేల్లో 156, టీ20లో 72 వికెట్లు తీశాడు అశ్విన్. బౌలర్‌గానే కాకుండా బ్యాట్‌తో అశ్విన్ సత్తా చాటాడు. టెస్టుల్లో 3503 రన్స్ చేశాడు. ఆరు సెంచరీలు, పధ్నాలుగు హాఫ్ సెంచరీలు సాధించాడు. వన్డేల్లో 707 రన్స్ మాత్రమే సాధించాడు.
టెస్టుల్లో అశ్విన్ తీసిన చివరి వికెట్ ఎవరిదంటే?
టెస్టుల్లో చివరగా మిచెల్ మార్ష్‌ను ఔట్ చేశాడు అశ్విన్. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కేవలం పింక్ బాల్ టెస్ట్‌లో మాత్రమే స్థానం దక్కించుకున్న అశ్విన్ పద్దెనిమిది ఓవర్లు వేసి 53 పరుగులు ఇచ్చి కేవలం ఒక్క వికెట్ సాధించాడు. ఆ వికెట్ మిచెల్ మార్ష్‌ది కావడం గమనార్హం.
వన్డేల్లో లాస్ట్ వికెట్...
వన్డేల్లో అశ్విన్ తీసిన లాస్ట్ వికెట్ కూడా ఆస్ట్రేలియన్ క్రికెటర్‌దే కావడం గమనార్హం. 2023 వన్డే వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో కామెరూన్ గ్రీన్‌ను అశ్విన్ ఔట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో కూడా అతడు ఒకే వికెట్ తీశాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది.
జింబాబ్వే క్రికెటర్...
టీ20ల్లో టీమిండియా తరఫున అశ్విన్ బరిలో దిగి రెండేళ్లు దాటిపోయింది. చివరగా 2022లో టీ20 వరల్డ్ కప్ ఆడాడు అశ్విన్. టీ20ల్లో అశ్విన్‌కు దక్కిన చివరి వికెట్ జింబాబ్వే క్రికెటర్ రిచర్డ్ నగరవది కావడం గమనార్హం.