IND vs AUS 1st Test: సెంచరీకి చేరువలో జైస్వాల్ - రాణించిన రాహుల్ - పెర్త్ టెస్ట్‌లో భారీ ఆధిక్యం దిశగా భారత్
IND vs AUS 1st Test:పెర్త్ టెస్ట్‌లో రెండో రోజు ఆస్ట్రేలియాపై టీమిండియా ఆధిపత్యం కనబరిచింది. రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీలతో మెరవడంలో ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 172 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆస్ట్రేలియాపై 218 పరుగుల ఆధిక్యంలో భారత్ ఉంది.
ఆస్ట్రేలియాతో జరుగుతోన్న తొలి టెస్ట్‌లో యశస్వి జైస్వాల్ అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన అతడు రెండో ఇన్నింగ్స్‌లో భారీ ఇన్నింగ్స్‌తో రాణించాడు. యశస్వి జైస్వాల్‌తో పాటు కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీలతో రాణించడంలో పెర్త్ టెస్ట్‌లో టీమిండియా భారీ స్కోరు దిశగా సాగుతోంది. రెండో రోజు ముగిసే సరికి టీమిండియా ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 57 ఓవర్లలో 172 పరుగులు చేసింది.
ప్రస్తుతం యశస్వి జైస్వాల్ (90 రన్స్) సెంచరీకి చేరువలో ఉండగా.... కేఎల్ రాహుల్ 62 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇప్పటివరకు ఆస్ట్రేలియాపై టీమిండియా 218 పరుగుల ఆధిక్యంలో ఉంది.
యశస్వి జైస్వాల్ రికార్డులు...
పెర్త్ టెస్ట్‌లో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ పలు రికార్డులు నెలకొల్పాడు. ఒకే క్యాలెండర్ ఇయర్‌లో టెస్టుల్లో అత్యధిక సిక్స్‌లు (34) కొట్టిన క్రికెటర్‌గా నిలిచాడు. ఓ క్యాలెండర్ ఇయర్‌లో టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన టీమిండియా క్రికెటర్‌గా గంభీర్ రికార్డును యశస్వి జైస్వాల్ బ్రేక్ చేశాడు.
బుమ్రా ఐదు వికెట్లు...
అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా జోరుతో ఆస్ట్రేలియా 104 పరుగులకే ఆలౌటైంది. తొమ్మిదో నంబర్ బ్యాట్స్‌మెన్ మిచెల్ స్టార్క్ 26 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అలెక్స్ క్యారీ 21, స్వీనే 10 పరుగులు మినహా ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్స్ మొత్తం సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్ చేరుకున్నారు.
టీమిండియా కెప్టెన్ కమ్ పేసర్ బుమ్రా ధాటికి ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్స్ కుదేలైపోయారు. 30 పరుగులు ఇచ్చి బుమ్రా ఐదు వికెట్లు తీసుకోగా...హర్షిత్ రాణా మూడు, సిరాజ్ రెండు వికెట్లు తీసుకున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు నలభై ఆరు పరుగులు ఆధిక్యం లభించింది.
నితీష్ రెడ్డి...
పెర్త్ టెస్ట్‌లో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 150 పరుగులకే ఆలౌటైంది. అరంగేట్రం ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి 41 పరుగులతో రాణించాడు. పంత్ 37, రాహుల్ 26 రన్స్ చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో హెజిల్‌వుడ్ 4, స్టార్క్, కమిన్స్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు.