చలికాలంలో ఈ జ్యూస్‍తో మెండుగా రోగ నిరోధక శక్తి.. రోజూ తాగండి!
Photo: Pexels
By Chatakonda Krishna Prakash Dec 21, 2024
Hindustan Times Telugu
ఉసిరికాయలు, అల్లంలో చాలా పోషకాలతో పాటు ఔషద గుణాలు ఉంటాయి. ఈ రెండింటిని కలిపి చేసుకునే డ్రింక్ వల్ల రోగ నిరోధక శక్తి పెరగడం సహా చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఈ డ్రింక్ ఎలా చేసుకోవాలో.. లాభాలు ఏవో ఇక్కడ చూడండి.
Photo: Pexels
నాలుగు ఉసిరికాయలను విత్తనాలను తీసుకొని కట్ చేసుకోవాలి. ఇంచు అల్లాన్ని కాస్త దంచుకోవాలి. ఈ రెండింటినీ మిక్సీ జార్‌లో వేసి గ్లాస్ నీరు పోయాలి. వీటిని జ్యూస్‍లా మిక్సీతో బ్లెండ్ చేసుకోవాలి.
ఈ అల్లం జ్యూస్‍లో కాస్త ఉప్పు వేసుకోవాలి. మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. తీపి కావాలంటే తేనె వాడుకోవచ్చు. ఇలా ఉసిరి అల్లం జ్యూస్ తయారు చేసుకోవచ్చు.
Photo: Pexels
ఉసిరి, అల్లంలో విటమిన్ సీ, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీంతో ఇది తాగితే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
Photo: Pexels
సీజనల్ వ్యాధులు, ఇన్ఫెక్షన్ల రిస్క్ ఎక్కువగా ఉండే చలికాలంలో ఉసిరి అల్లం జ్యూస్‍ను రెగ్యులర్‌గా తాగడం మంచిది. వాటిబారిన పడకుండా ఇమ్యూనిటీని ఇది పెంచగలదు.
Photo: Pexels
రోగ కారకాల నుంచి శరీరం సమర్థంగా పోరాడేలా రోగ నిరోధక వ్యవస్థకు ఉసిరి అల్లం జ్యూస్ మేలు చేస్తుంది. వ్యాధులు దరి చేరే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
Photo: Pexels
అల్లం ఉసిరి జ్యూస్ తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. బ్లడ్ షుగర్ స్థాయి కూడా కంట్రోల్‍లో ఉండేలా చేయగలదు. జుట్టు, చర్మానికి కూడా మంచిది.