Baby Massage: చలికాలంలో బేబీ మసాజ్ చేయచ్చా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
Baby Massage: ఏడాదిలోపు పిల్లలకు మసాజ్ అనేది చాలా అవసరం. అయితే చలికాలంలో వాతావరణం చల్లగా ఉంటుంది కనుక మసాజ్ చేయచ్చా చేయకూడదా అని చాలా మంది తల్లులు సందేహిస్తుంటారు. శీతాకాలంలో బేబీ మసాజ్ చేయచ్చు కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. చలికాలంలో బేబీ మసాజ్ ఎలా చేయాలి తెలుసుకుందాం.
ఒక సంవత్సరం కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు మసాజ్ చాలా ముఖ్యం. దీనివల్ల పిల్లలు రిలాక్స్ అవుతారు. వారి ఎదుగుదల కూడా పెరుగుతుంది. అయితే శీతాకాలం వచ్చే సరికి చాలా మంది తల్లులకు మసాజ్ విషయంలో సందేహాలు తలెత్తుతాయి. వాతావరణం చాలా చల్లగా ఉంటున్నందున బేబీకి మసాజ్ చేయచ్చా..? ఇలా చేయడం వల్ల బిడ్డకు చల్లదనం ఎక్కువై జలుబు చేయదా? వంటి అనుమానాలు వస్తాయి. ఈ గందరగోళంలో వారు బిడ్డకు మసాజ్ చేయడం మానేస్తారు. నిజానికి చలికాలంలో బిడ్డకు మసాజ్ చాలా అవసరమని గైనకాలజిస్ట్ లు చెబుతున్నారు. కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుని బిడ్డకు మసాజ్ చేయడం వల్ల శిశువు మరింత ఆరోగ్యంగా తయారవుతాడు. చలికాలంలో బేబీ మసాజ్ ఎలా చేయాలి అనే విషయం గురించి ప్రముఖ గైనకాలజిస్ట్ షెఫాలీ ఇన్ స్టాగ్రామ్ లో ఓ వీడియోను షేర్ చేశారు. దాంట్లో కొన్ని ముఖ్యమైన సూచనలు ఉన్నాయి. అవేంటంటే..
చలికాలంలో చిన్న పిల్లలకు మసాజ్ ఎలా చేయాలి?
నూనెను కాస్త వేడి చేయండి:
చలికాలంలో అయినా ఇతర సమయాల్లో అయినా బేబీ మసాజ్ చేసేటప్పుడు ప్రతిసారి నూనెను కొద్దిగా వేడి చేయాలి. గోరువెచ్చటి నూనెనె తీసుకుని బిడ్డ శరీరానికి మసాజ్ చేయడం వల్ల వాతావరణం చల్లగా ఉన్నా వారికి జలుబు చేయదు.
పిల్లల బట్టలు తొలగించవద్దు:
మసాజ్ కోసం పిల్లల బట్టలు తొలగించడం అవసరం. కానీ చల్లని వాతావరణంలో ఇలా చేయడం మానుకోవాలి. మొత్తం బట్టలు తొలగించడం లేదా ఉన్ని వస్త్రాన్ని ఉంచి మసాజ్ చేయడం శిశువుకు హానికరం. బిడ్డకు చలిగా అనిపించవచ్చు. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు పూర్తిగా దుస్తులు ధరించి ఉంచి వాటి లోపల మీ చేతులను పంపి మసాజ్ చేయడం మంచిది.
గాలి రాకుండా చేయాలి:
చలికాలంలో మసాజ్ ప్రారంభించే ముందు, గదిలో గాలి వనరులను అంటే ఫ్యాన్ ఆఫ్ చేయండి. అలాగే చల్లటి గాలి వీచే కిటికీలను మూసి వేయండి. ఉష్ణోగ్రతను సాధారణీకరించడానికి హీటర్ లేదా బ్లోయర్ను ఆన్ చేయండి. హీటర్ ఆన్ చేసి గదిలో తేమను తొలగించండి. తద్వారా బిడ్డకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాగే జలుబు వచ్చే ప్రమాదం కూడా ఉండదు.
ప్లాస్టిక్ లేదా కాటన్ షీట్లపై పడుకోబెట్టవద్దు,
మీరు పిల్లలను మంచంపై పడుకోబెట్టాలనుకుంటే, నేరుగా కాటన్ లేదా ప్లాస్టిక్ షీట్లపై పడుకోవద్దు. ఇది నవజాత శిశువుకు చల్లగా అనిపిస్తుంది. ఎల్లప్పుడూ ఉన్ని షీట్ ను ఉపయోగించండి. అలాగే అది మృదువుగా ఉండేలా చూసుకొండి. తద్వారా బిడ్డకు జలుబు అనిపించకుండా, మసాజ్ చేయడంలో ఇబ్బంది ఉండదు. వెచ్చగా, సౌకర్యవంతంగా అనిపిస్తుంది.
బేబీ మసాజ్ ఉపయోగాలు..
- పసిపిల్లలకు మసాజ్ చేయడం అనేది శరీరానికి, మనసుకు అనేక లాభాలు కలిగిస్తుంది.
- మసాజ్ వల్ల పిల్లలకు మాంసపేశాలు మృదువుగా, బలంగా తయారవుతాయి. ఇది శరీర కదలికలకు సహాయం చేస్తుంది.
- రక్తప్రసరణను పెంచి శరీరంలోని ఆక్సిజన్, పోషకాల సరఫరాను మెరుగుపరుస్తుంది.
- మసాజ్ చేయడం వల్ల నరాల సురక్షితంగా అభివృద్ధి చెందుతాయి. శరీర ఆకృతి బలంగా, ఆరోగ్యంగా మారుతుంది.
- మసాజ్ వల్ల పిల్లలు మానసికంగా సుఖంగా భావిస్తారు. ఫలితంగా సుఖంగా, ప్రశాంతంగా నిద్రపోతారు.ఆరోగ్యంగా ఉంటారు.
- బేబీ మసాజ్ తో వారి చర్మం మృదువుగా మారుతుంది. ఇది చర్మానికి తేమను అందిస్తుంది. పొడిబారకుండా ఉంటుంది. చక్కటి మాయిశ్చరైజర్ లా పనిచేస్తుంది.
- ఒత్తిడి,చర్మ వ్యాధులు, ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా బేబీ మసాజ్ బాగా సహాయపడుతుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల అభిప్రాలయను క్రోడీకరించి మాత్రమే మేము ఈ సూచనలు అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.బిడ్డకూ, తల్లిదండ్రులకు మధ్య భావోద్వేగ సంబంధాన్ని మెరుగుపరుస్తుంది. పిల్లల భావోద్వేగ అభివృద్ధికి ఇది తోడ్పడుతుంది.
సంబంధిత కథనం