AP Free Bus Scheme : లేటుగా వచ్చినా లేటెస్ట్‌గా వస్తాం.. మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై స్పందించిన మంత్రి-minister ramprasad reddy responds to ap free bus scheme ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Free Bus Scheme : లేటుగా వచ్చినా లేటెస్ట్‌గా వస్తాం.. మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై స్పందించిన మంత్రి

AP Free Bus Scheme : లేటుగా వచ్చినా లేటెస్ట్‌గా వస్తాం.. మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై స్పందించిన మంత్రి

Basani Shiva Kumar HT Telugu
Dec 22, 2024 01:04 PM IST

AP Free Bus Scheme : సూపర్ సిక్స్ హామీల్లో ప్రధానమైంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఈ పథకం కోసం రాష్ట్రంలో మహిళలు ఎదురుచూస్తున్నారు. సీఎం చంద్రబాబు ఎప్పుడు ప్రకటన చేస్తారని చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో.. మంత్రి రాంప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

మహిళల ఉచిత బస్సు ప్రయాణం
మహిళల ఉచిత బస్సు ప్రయాణం (TDP)

మంత్రి రాంప్రసాద్‌ రెడ్డి విశాఖపట్నంలో పర్యటించారు. కొత్త ఆర్టీసీ బస్సులను ప్రారంభించారు. త్వరలో ఆర్టీసీలోకి 1400 కొత్త బస్సులు తెస్తున్నామని ప్రకటించారు. 2 వేల ఎలక్ట్రిక్‌ బస్సులు తెచ్చే యోచనలో ఉన్నట్టు వివరించారు. కొత్త బస్సులతో పాటు సిబ్బందిని నియమిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఏపీలో మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై స్పందించారు.

లేటెస్ట్‌గా వస్తాం..

'ఉచిత బస్సు పథకాన్ని విజయవంతంగా అందుబాటులోకి తెస్తాం. ఒకటో తేదీన ప్రారంభించి 16న మూసేయడం మాకు ఇష్టం లేదు. ఈ విషయంలో లేటుగా వచ్చినా లేటెస్ట్‌గా వస్తాం. పథకం అమలయ్యేనాటికి సమస్యలు అధిగమించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే మంత్రులతో కూడిన సబ్‌కమిటీ నియమించారు. ఎవరూ వేలెత్తి చూపించకుండా పథకం తీసుకువస్తాం' అని మంత్రి రాంప్రసాద్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.

కేబినెట్ సబ్‌ కమిటీ..

మహిళలకు ఉచిత బస్సు పథకంపై కేబినెట్ సబ్‌ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రవాణాశాఖ మంత్రితో పాటు, హోంశాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రులు సభ్యులుగా కమిటీని ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఈ పథకం అమలు అవుతున్న రాష్ట్రాల్లో పర్యటించి, అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ పథకం త్వరలోనే ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

చాలా రోజులుగా..

మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సేవలు ప్రారంభించేందుకు రంగం సిద్దం అవుతోందని.. టీడీపీ నేతలు చాలా రోజులుగా చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ముఖ్యమైన హామీలలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం కూడా ఒకటి. దీనిపై ప్రకటన ఎప్పడు వస్తుందా అని మహిళలు, యువతులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

చంద్రబాబు ఆదేశం..

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం విషయంలో కొంత ఆలస్యమైనా, సమగ్ర విధానాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు సమగ్ర నివేదికను రూపొందించారు. మహిళలకు ఉచితబస్సు ప్రయాణం అమలు కోసం.. అదనంగా 2 వేల బస్సులు, 3 వేల 500 మంది డ్రైవర్లు అవసరమని.. అధికారుల కమిటీ నివేదికలో పేర్కొంది. ప్రతి నెలా ఆర్టీసీ 250 నుంచి 260 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

ఎదురుచూపులు..

మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సేవలు ప్రారంభించేందుకు రంగం సిద్దం అవుతోందని.. టీడీపీ నేతలు చాలా రోజులుగా చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ముఖ్యమైన హామీలలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం కూడా ఒకటి. దీనిపై ప్రకటన ఎప్పడు వస్తుందా అని మహిళలు, యువతులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Whats_app_banner