OTT Thriller: ఓటీటీలోకి వస్తున్న థ్రిల్లర్ చిత్రం.. డేట్ ఫిక్స్.. చేయని హత్యకు జైలుకెళ్లి మరిన్ని గొడవల్లో..-tamil prison thriller movie sorgavaasal ott streaming date confirmed on netflix ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Thriller: ఓటీటీలోకి వస్తున్న థ్రిల్లర్ చిత్రం.. డేట్ ఫిక్స్.. చేయని హత్యకు జైలుకెళ్లి మరిన్ని గొడవల్లో..

OTT Thriller: ఓటీటీలోకి వస్తున్న థ్రిల్లర్ చిత్రం.. డేట్ ఫిక్స్.. చేయని హత్యకు జైలుకెళ్లి మరిన్ని గొడవల్లో..

Chatakonda Krishna Prakash HT Telugu
Dec 22, 2024 02:49 PM IST

Sorgavaasal OTT Release Date: తమిళ థ్రిల్లర్ సినిమా సొర్గవాసల్ ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ అధికారికంగా ఖరారైంది. ఈ సినిమా ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్‍కు రానుందంటే..

OTT Thriller: ఓటీటీలోకి వస్తున్న థ్రిల్లర్ చిత్రం.. డేట్ ఫిక్స్.. చేయని హత్య కేసులో జైలుకెళ్లి మరిన్ని గొడవల్లో..
OTT Thriller: ఓటీటీలోకి వస్తున్న థ్రిల్లర్ చిత్రం.. డేట్ ఫిక్స్.. చేయని హత్య కేసులో జైలుకెళ్లి మరిన్ని గొడవల్లో..

ఆర్జే బాలాజీ, సెల్వ రాఘవన్ ప్రధాన పాత్రలు పోషించిన సొర్గవాసల్ చిత్రం నవంబర్ 29వ తేదీన థియేటర్లలో రిలీజైంది. ఈ ప్రిజన్ థ్రిల్లర్ చిత్రానికి మిశ్రమ స్పందన దక్కింది. సిద్ధార్థ్ విశ్వనాథన్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. చేయని నేరానికి జైలు పాలైన ఓ వ్యక్తి చుట్టూ ఈ సినిమా సాగుతుంది. ఈ మూవీకి మోస్తరు వసూళ్లు వచ్చాయి. ఈ సొర్గవాసల్ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.

స్ట్రీమింగ్ డేట్ ఇదే

సొర్గవాసల్ చిత్రం డిసెంబర్ 27వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని నెట్‍ఫ్లిక్స్ నేడు (డిసెంబర్ 22) అధికారికంగా వెల్లడించింది. అంటే మరో ఐదు రోజుల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు రానుంది. డిసెంబర్ 27న ఈ మూవీ వస్తుందని గతంలోనే రూమర్లు వచ్చినా.. ఇప్పుడు అఫీషియల్‍గా వెల్లడైంది.

సొర్గవాసల్ డబ్బింగ్ వెర్షన్‍లపై నెట్‍ఫ్లిక్స్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అయితే, తమిళంతో పాటు ఈ చిత్రం తెలుగు, మలయాళం, కన్నడ, హిందీలోనూ స్ట్రీమింగ్‍కు రానుంది. మరి ఈ చిత్రం డిసెంబర్ 27న తమిళంలో మాత్రమే వస్తుందా.. డబ్బింగ్ వెర్షన్లు కూడా అందుబాటులోకి వస్తాయా అనేది చూడాలి.

సొర్గవాసల్ చిత్రాన్ని కొత్త దర్శకడు సిద్ధార్థ్ విశ్వనాథ్ తెరకెక్కించారు. 1999 మద్రాస్ సెంట్రల్ జైలు అల్లర్ల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీలో ఆర్జే బాలాజీ, సెల్వ రాఘవన్‍తో పాటు కరుణాస్, సానియా ఇలప్పన్, నాటీ సుబ్రమణియం, షరాఫుద్దీన్, బాలాజీ శక్తివేల్, హక్కిమ్ షా కీలకపాత్రల్లో నటించారు.

సొర్గవాసల్ చిత్రాన్ని స్వైప్ రైట్ స్టూడియోస్, థింక్ స్టూడియోస్ పతాకాలపై సిద్ధార్థ్ రావ్, పల్లవి సింగ్ నిర్మించారు. ఈ మూవీకి క్రిస్టో గ్జేవియర్ సంగీతం అందించారు. ప్రిన్స్ అండర్సన్ సినిమాటోగ్రఫీ చేసినా ఈ చిత్రాన్ని సెల్వ ఆర్కే ఎడిటింగ్ చేశారు.

సొర్గవాసల్ స్టోరీలైన్

చెన్నైలో రోడ్‍సైడ్ చిన్న ఫుడ్ బిజినెస్ చేస్తుంటాడు పార్థిబన్ అలియాజ్ పార్థి (ఆర్జే బాలాజీ). ఎప్పటికైనా ఓ పెద్ద హోటల్ పెట్టాలని, రేవతి (సానియా అయ్యప్పన్)ను పెళ్లి చేసుకోవాలని కలలు కంటూ ఉంటాడు. ఈ క్రమంలో పార్థి ఫుడ్ సెంటర్ వద్ద రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ షణ్ముగం చనిపోతాడు. అయితే, ఆయన హత్య కేసు పార్థిపై పడుతుంది. దీంతో అతడు జైలుకు వెళ్లాల్సి వస్తుంది.

తాను నేరం చేయలేదని నిరూపించుకునేందుకు పార్థి కష్టాలు పడతాడు. కానీ జైలుకు వెళతాడు. అక్కడ సూపరింటెండెంట్ సునీల్ కుమార్ (షరాఫుద్దీన్) లాంటి అవినీతి అధికారులు ఉంటారు. ఆ జైలులో సగా (సెల్వరాఘవన్), కెండ్రిక్ (సామ్యూల్) మధ్య గొడవలు జరుగుతుంటాయి. అనుకోకుండా ఈ అల్లర్లలో పార్థి భాగమవుతాడు. ఈ అల్లర్లపై విచారణ జరిపేందుకు ఆఫీసర్ ఇస్మాయిల్ (నటరాజ్) నియమితు. ఆ తర్వాత పార్థికి ఏం జరిగింది? హత్య కేసు నుంచి బయటపడ్డాడా? రిటైర్డ్ ఐఏఎస్ మరణం విషయంలో ఏం జరిగింది? అల్లర్ల విషయంలో ఏం తేలింది? అనే అంశాలు సొర్గవాసల్ మూవీలో ప్రధానంగా ఉంటాయి.

Whats_app_banner

సంబంధిత కథనం