OTT Movies: ఈ వారం ఓటీటీల్లోకి వచ్చిన టాప్-5 సినిమాలు ఇవే.. డిఫరెంట్ జానర్లలో..
OTT Top 5 Movies this week: ఈ వారం ఓటీటీల్లోకి చాలా సినిమాలు అడుగుపెట్టాయి. వివిధ జానర్ల చిత్రాలు స్ట్రీమింగ్‍కు వచ్చాయి. వీటిలో ముఖ్యమైన 5 చిత్రాలు ఏవో, ఎక్కడ స్ట్రీమింగ్‍కు అందుబాటులో ఉన్నాయో ఇక్కడ చూడండి.
డిసెంబర్ మూడో వారంలో వివిధ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో మరిన్ని చిత్రాలు, వెబ్ సిరీస్‍లు ఎంట్రీ ఇచ్చాయి. ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చాయి. ఇందులో ఐదు సినిమాలు ఇంట్రెస్టింగ్‍గా ఉన్నాయి. డిఫరెంట్ జానర్లతో ఉన్నాయి. రెండు చిత్రాలు నేరుగా ఓటీటీలోకే వచ్చాయి. ఈ వారం ఓటీటీల్లో స్ట్రీమింగ్‍కు వచ్చిన టాప్-5 సినిమాలు ఇవే..
జీబ్రా
జీబ్రా సినిమా ఈ శుక్రవారం (డిసెంబర్ 20) ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు వచ్చింది. యంగ్ హీరో సత్యదేవ్ హీరోగా నటించిన ఈ మూవీ బ్యాంకులో జరిగే మోసం చుట్టూ తిరుగుతుంది. ఈ చిత్రాన్ని థ్రిల్లర్‌గా తెరకెక్కించారు డైరెక్టర్ ఈశ్వర్ కార్తీక్. నవంబర్ 22వ తేదీన థియేటర్లలో రిలీజైన జీబ్రా మూవీ మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ చిత్రంలో డాలి ధనంజయ, సత్యరాజ్ కీలకపాత్రలు పోషించారు. జీబ్రా చిత్రాన్ని ఆహాలో చూసేయవచ్చు.
గర్ల్స్ విల్ బీ గర్ల్స్
గర్ల్స్ విల్ బీ గర్ల్స్ సినిమా డిసెంబర్ 18న అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. బోల్డ్ కాన్సెప్ట్‌తో ఈ ఇండో ఫ్రెంచ్ కమింగ్ ఏజ్ డ్రామా మూవీ రూపొందింది. ఓ టీనేజ్ అమ్మాయి శృంగార కోరికల చుట్టూ ఈ మూవీ సాగుతుంది. గర్ల్స్ విల్ బీ గర్ల్స్ మూవీకి సుచీ తలతి దర్శకత్వం వహించగా.. కని కురుస్తి, ప్రీతి పాణిగ్రహి లీడ్ రోల్స్ చేశారు. ప్రైమ్ వీడియోలో హిందీ, ఇంగ్లిష్‍తో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది.
పొట్టేల్
తెలుగు రూరల్ యాక్షన్ డ్రామా మూవీ పొట్టేల్ డిసెంబర్ 20న ఆహా, అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ మూవీలో యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలు పోషించారు. సాహిత్ మోత్కూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 25న థియేటర్లలో రిలీజ్ అయింది. బలి ఇవ్వాలనుకున్న పొట్టేల్ తప్పిపోవడం, దాన్ని వెతకడం, సవాళ్లను ఎదుర్కొని కూతురుని చదివించాలని తండ్రి చేసే పోరాటం చుట్టూ ఈ మూవీ సాగుతుంది. ఇప్పుడు పొట్టేల్ సినిమాను ఆహా, ప్రైమ్ వీడియోలో వీక్షించవచ్చు.
లీలా వినోదం
బిగ్‍బాస్ ఫేమ్, పాపురల్ యూట్యూబర్ షణ్ముక్ జస్వంత్ హీరోగా నటించిన లీలా వినోదం సినిమా అక్టోబర్ 19న నేరుగా ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. రూరల్ కామెడీ రొమాంటిక్ డ్రామాగా ఈ మూవీని తెరకెక్కించారు డైరెక్టర్ పవన్ సుంకర. ఈ చిత్రంలో అనఘ అజిత్ హీరోయిన్‍గా చేశారు.
మురా
మురా చిత్రం డిసెంబర్ 20వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఖాళీగా ఉండే నలుగురు యువకుల చుట్టూ ఈ మలయాళ యాక్షన్ థ్రిల్లర్ మూవీ సాగుతుంది. నవంబర్ 8న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ పాజిటివ్ రెస్పాన్ దక్కించుకుంది. మురా చిత్రంలో హృదు హరూన్, యధు కృష్ణన్, అనుజిత్, జోబిన్ దాస్, సూరజ్ వెంజరమూడు, మలా పార్వతి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ మహమ్మద్ ముస్తఫా తెరకెక్కించారు. ఈ మురా మూవీని అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇప్పుడు చూసేయవచ్చు.
సంబంధిత కథనం