Telangana News Live December 22, 2024: UntitTG DGP Jitender : మోహన్ బాబుది కుటుంబ సమస్య, రోడ్డెక్కి న్యూసెన్స్ సృష్టిస్తే చర్యలు తప్పవ్- డీజీపీ జితేందర్
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Sun, 22 Dec 202406:04 PM IST
TG DGP Jitender : సినీ హీరోలు అత్యుత్సాహం ప్రదర్శిస్తే చట్టపరంగా చర్యలు తప్పవని డీజీపీ జితేందర్ హెచ్చరించారు. మోహన్ బాబుది కుటుంబ సమస్య అని ఇంట్లో పరిష్కరించుకుంటే అత్యంతరం లేదన్నారు.
Sun, 22 Dec 202405:15 PM IST
CM Revanth Reddy : హీరో అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ విద్యార్థులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నానని సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్టు పెట్టారు.
Sun, 22 Dec 202404:48 PM IST
Sandhya Theatre Stampede Video : సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ సంచలన వీడియ విడుదల చేశారు. ఈ వీడియోలో తొక్కిసలాటకు ముందు, అల్లు అర్జున్ వచ్చిన సమయాల్లో జనం, వాస్తవ పరిస్థితులు పూర్తిగా స్పష్టంగా కనిపిస్తున్నాయి.
Sun, 22 Dec 202403:41 PM IST
Allu Arjun House Attack : హీరో అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ విద్యార్థులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిపై అల్లు అరవింద్ విచారం వ్యక్తం చేశారు. ఇది సంయమనం పాటించాల్సిన సమయం అన్నారు. ఎవరూ తొందరపాటు చర్యలకు దిగొద్దని విజ్ఞప్తి చేశారు.
Sun, 22 Dec 202401:37 PM IST
ACP Vishnu Murthy : హీరో అల్లు అర్జున్, సినీ పరిశ్రమపై ఏసీపీ విష్ణు మూర్తి అనుచిత వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ డబ్బు మదంతో పోలీసులపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. అల్లు అర్జున్ ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి..లేదంటే తీవ్ర పదజాలం వాడారు.తోలు తీస్తామన్నారు.
Sun, 22 Dec 202401:03 PM IST
Hyderabad Annual Crime Report : 2024లో హైదరాబాద్ క్రైమ్ రేటు కాస్త పెరిగిందని సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. ఈ ఏడాది మొత్తం 35,944 ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయని తెలిపారు. రూ.297 కోట్లు సైబర్ నేరాల్లో బాధితులు పోగొట్టుకున్నారన్నారు.
Sun, 22 Dec 202411:45 AM IST
Sun, 22 Dec 202411:36 AM IST
- Hyderabad Police : సంధ్య థియేటర్ ఘటనపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ స్పందించారు. తొక్కిసలాట ఘటన జరిగిన తీరుపై వీడియో విడుదల చేశారు. సంధ్య థియేటర్ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని స్పష్టం చేశారు. ఇదే సమయంలో బౌన్సర్లకు సీవీ ఆనంద్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
Sun, 22 Dec 202410:22 AM IST
Allu Arjun : సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన తెలంగాణలో పెనుదుమారం రేపుతోంది. ఈ వ్యవహారంలో సిని పరిశ్రమ లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీ నేతలు సినీ పరిశ్రమకు మద్దతుగా నిలుస్తున్నారు.
Sun, 22 Dec 202409:27 AM IST
Tollywood Vs State Govt : సంధ్య థియేటర్ తొక్కిసలాట పెద్ద దుమారాన్నే రేపుతోంది. అల్లు అర్జున్ అరెస్ట్, అనంతరం పరిణామాలు టాలీవుడ్ వర్సెస్ ప్రభుత్వం అన్నట్లు మారుతున్నాయి. అయితే గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.
Sun, 22 Dec 202408:27 AM IST
- సంథ్య థియేటర్ ఘటనపై రాష్ట్ర డీజీపీ జితేందర్ స్పందించారు. పౌరుల భద్రత, రక్షణ అన్నింటికంటే ముఖ్యమని స్పష్టం చేశారు. అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు కానీ పరిస్థితులను అర్థం చేసుకోవాలని వ్యాఖ్యానించారు. ప్రజల భద్రత కంటే సినిమా ప్రమోషన్ ముఖ్యమైన అంశం కాదన్నారు.
Sun, 22 Dec 202404:14 AM IST
- Pushpa 2 Row : పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటపై సర్కారు సీరియస్ అయ్యింది. ఈ ఘటనపై స్వయంగా సీఎం రేవంత్ అసెంబ్లీలో మాట్లాడారు. ఇష్యూపై సీరియస్ అయ్యారు. దీంతో తెలుగు సినిమా ఇండస్ట్రీని రేవంత్ టార్గెట్ చేశారా అనే చర్చ జరుగుతోంది.
Sun, 22 Dec 202401:39 AM IST
- ఫార్ములా ఈరేస్ కేసులో దర్యాప్తు సంస్థలు స్పీడ్ పెంచే పనిలో పడ్డాయి. ఓవైపు ఏసీబీ… కీలక దస్త్రాలను సేకరిస్తుండగా… మరోవైపు ఈడీ కూడా అదే దిశగా అడుగులు వేస్తోంది. సోమవారం నుంచి ఈడీ నేరుగా రంగంలోకి దిగే అవకాశం ఉందని తెలుస్తోంది. కేసులో ఉన్న వారికి నోటీసులు జారీ అయ్యే అవకాశం ఉంది.