Game Changer Dhop Song: ఫుల్ గ్రేస్‍తో రామ్‍చరణ్ ‘దోప్’ స్టెప్స్ అదుర్స్.. గేమ్ ఛేంజర్ మరో పాట రిలీజ్.. జానీ కొరియోగ్రఫీ
Game Changer Dhop Song: గేమ్ ఛేంజర్ సినిమా నుంచి మరో రిలీజ్ అయింది. దోప్ అంటూ ఈ ట్రెండీ పాట వచ్చేసింది. గ్రేస్‍ఫుల్ డ్యాన్స్‌తో రామ్ చరణ్ అదరగొట్టారు.
మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ పొటిలికల్ థ్రిల్లర్ మూవీని తెరకెక్కించారు. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నేడు అమెరికాలోని డల్లాస్ వేదికగా జరుగుతోంది. ఈ తరుణంలో గేమ్ ఛేంజర్ చిత్రం నుంచి నాలుగో పాట వచ్చేసింది. దోప్ అంటూ ఈ ట్రెండీ సాంగ్ నేడు (డిసెంబర్ 22) రిలీజ్ అయింది.
ట్రెండీగా బీట్..
గేమ్ ఛేంజర్ నుంచి వచ్చిన దోప్ సాంగ్ ట్రెండీగా ఉంది. ఈ పాటకు డిఫరెంట్ ట్యూన్‍ను ఇచ్చారు థమన్. ఈ పాటను థమన్, రోషిణి, జేకేవీ, పృథ్వి, శృతి రంజని కలిసి పాడారు. రామజోగయ్య శాస్త్రి క్యాచీ లిరిక్స్ ఇచ్చారు. ఈ పాట లిరికల్ వీడియో వచ్చేసింది.
“వాక.. వకవక.. వాట్సే దోప్” అనే లైన్‍తో ఈ సాంగ్ మొదలైంది. పాటంతా ఇదే తీరుగా సాగుతుంది. మొత్తంగా ట్రెండీగా కనిపిస్తోంది. శంకర్ రేంజ్‍లో గ్రాండ్‍నెస్ ఆకట్టుకుంటోంది.
రామ్‍చరణ్ డ్యాన్స్ హైలైట్
దోప్ పాటలో రామ్‍చరణ్ డ్యాన్స్ హైలైట్‍గా ఉంది. హుక్ స్టెప్స్ సూపర్ అనిపిస్తున్నాయి. లిరికల్ సాంగ్ వీడియోలో ముందుగా చెర్రీ డ్యాన్సే ఉంది. గ్రేస్, స్టైల్‍తో అదుర్స్ అనిపించారు. పాటలో మరిన్ని అట్రాక్టివ్ స్టెప్స్ ఉన్నాయి. హీరోయిన్ కియారా అద్వానీ కూడా సూపర్ స్టెప్స్ వేశారు. రామ్‍చరణ్, కియారా కెమెస్ట్రీ కూడా పాటలో అదిరిపోయింది. దోప్ సాంగ్‍లోని స్టెప్స్ బాగా పాపులర్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
జానీ మాస్టర్ కొరియోగ్రఫీ
గేమ్ ఛేంజర్ మూవీలోని ఈ దోప్ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణలతో జైలుకు వెళ్లి ఇటీవల ఆయన విడుదలయ్యారు. ఈ సాంగ్‍కు మంచి స్టెప్స్ కంపోజ్ చేశారు జానీ. మరోసారి తన మార్క్ చూపారు.
స్టేజ్‍పై డ్యాన్స్ చేసిన రామ్‍చరణ్
గేమ్ ఛేంజర్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‍లో రామ్‍చరణ్ స్టేజ్‍పైనే డ్యాన్స్ చేశారు. రా మచ్చా మచ్చారా సాంగ్‍కు మ్యూజిక్ డైరెక్టర్ థమన్, నటుడు ఎస్‍జే సూర్యతో కలిసి స్టెప్స్ వేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సంక్రాంతికి ముందు జనవరి 10వ తేదీన గేమ్ ఛేంజర్ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‍రాజు, శిరీశ్ నిర్మించారు.