Jani Master Released : చంచల్‌గూడ జైలు నుంచి జానీ మాస్టర్ విడుదల.. 36 రోజుల తర్వాత మెడలో ఎర్ర కండువాతో..
Jani Master Released : కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ జైలు నుంచి విడుదలయ్యారు. తెలంగాణ హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో.. చంచల్‌గూడ జైలు నుంచి శుక్రవారం సాయంత్రం బయటకు వచ్చారు. అత్యాచార ఆరోపణల నేపథ్యంలో జానీ మాస్టర్‌ను హైదరాబాద్ పోలీసులు గతనెల 20న అదుపులోకి తీసుకున్నారు.
చంచల్‌గూడ జైలు నుంచి జానీ మాస్టర్ బెయిల్‌పై విడుదలయ్యారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో.. శుక్రవారం సాయంత్రం జానీ మాస్టర్‌ను జైలు అధికారులు విడుదల చేశారు. అత్యాచార ఆరోపణల కేసులో జానీ మాస్టర్ 36 రోజులుగా జైల్లో ఉన్నారు. జానీకి బెయిల్ మంజూరు చేస్తూ.. తెలగాంణ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది.
తనపై జానీ మాస్టర్ లైంగికదాడి చేసినట్లు మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సెప్టెంబర్ 16న ఆయనపై నార్సింగి పోలీసులు 376,506,323 సెక్షన్ల కింద కేసు నమోదుచేసి అరెస్టు చేశారు. కోర్టు ఆయకు రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలులో 36 రోజులుగా ఉన్నారు. జాతీయ అవార్డుల ప్రదానోత్సవం నేపథ్యంలో ఈ నెల 6 నుంచి 9 వరకు ఆయనకు కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. గడువు ముగియడంతో మళ్లీ జైలుకు వెళ్లారు.
రెగ్యులర్ బెయిల్ కోసం పోక్సో కోర్టులో దాఖలు చేసిన పిటిషనన్ను ఈ నెల 14న కోర్టు తిరస్కరించింది. గురువారం ఆయనకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్‌ను హైదరాబాద్ పోలీసులు గతనెల 20న అదుపులోకి తీసుకున్నారు. గోవాలో జానీ మాస్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి జానీ మాస్టర్‌ను నేరుగా ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు. అవుట్ డోర్ షూటింగ్ సమయాల్లో జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని యువతి ఫిర్యాదు చేసింది.
హైదరాబాద్‌లోని నార్సింగిలోనూ తనపై లైంగిక దాడి జరిగిందని యువతి ఫిర్యాదులో పేర్కొంది. 2017లో ఒక టీవీ షోలో జానీ మాస్టర్ తనకు పరిచయమైనట్లు బాధితురాలు తెలిపింది. ఆ తర్వాత జానీ మాస్టర్ టీమ్ లో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ చేరానన్నారు. ఒక షో కోసం జానీకో కలిసి తాను ముంబయికి వెళ్లానని, అక్కడి హోటల్లో జానీ మాస్టర్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు ఫిర్యాదులో తెలిపింది.