Nara Devansh: చెస్‌లో నారా దేవాన్ష్ వరల్డ్ రికార్డ్ - కొడుకు విజయం పట్ల లోకేష్ ఆనందం
Nara Devansh: చెస్‌లో ఏపీ మంత్రి, నారా లోకేష్ తనయుడు దేవాన్ష్ మరో కొత్త వరల్డ్ రికార్డ్ నెలకొల్పాడు. 175 పజిల్స్‌లో ఫాస్టెస్ట్ చెక్‌మేట్ సాల్వర్‌గా నిలిచాడు. దేవాన్ష్ రికార్డును లండన్‌కు చెందిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ధృవీకరించింది.
Nara Devansh: ఏపీ మంత్రి నారా లోకేష్ తనయుడు దేవాన్ష్ చెస్ లో వేగవంతంగా పావులు కదపడంలో వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు.- 175 పజిల్స్‌లో ఫాస్టెస్ట్ చెక్‌మేట్ సాల్వర్ గా తొమ్మిదేళ్ల నారా దేవాన్ష్ ఈ రికార్డ్ నెలకొల్పినట్లు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ తెలిపింది. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి అధికారిక ధృవీకరణను అందుకోవడం పట్ల నారా కుటుంబం ఆనందం వ్యక్తం చేసింది.
తల్లిదండ్రుల ప్రోత్సాహం, కోచ్ మార్గదర్శకత్వంతో దేవాంశ్ ఈ రికార్డును సాధించాడని తెలిపారు. వ్యూహాత్మకమైన ఆటతీరు, అద్భుత ప్రదర్శనతో నారా దేవాన్ష్ "చెక్‌మేట్ మారథాన్" పేరుతో ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. ప్రసిద్ధ చెస్ సంకలనం నుండి ఎంపిక చేసిన 5334 సమస్యలు, వాటి కలయికల ద్వారా ఈ పోటీని రూపొందించారు.
మరో రెండు రికార్డులు...
నారా దేవాన్ష్ చెస్‌లో నెలకొల్పిన మూడో వరల్డ్ రికార్డ్ ఇది. ఇటీవలే దేవాన్ష్ ఓ రెండు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. 7 డిస్క్ టవర్ ఆఫ్ హనోయిని కేవలం నిమిషం 43సెకన్లలో పూర్తి చేసాడు. 9 చెస్ బోర్డ్‌లను కేవలం 5నిమిషాల్లో అమర్చాడు, మొత్తం 32 ముక్కలను వేగవంతంగా సరైన స్థానాల్లో ఉంచి ఈ రికార్డులను నెలకొల్పాడు. దేవాన్ష్ ప్రపంచ రికార్డు పట్ల న్యాయనిర్ణేతలు, లండన్‌లోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారులు సైతం ఆశ్చర్యపోయారు.
పట్టుదల, కృషి ద్వారా తమ కలలను సాధించవచ్చని దేవాన్ష్ నిరూపించాడని పేర్కన్నారు. ఇది భారతీయ పిల్లల అపారమైన ప్రతిభకు, వారిలో దాగివున్న నైపుణ్యాలకు మచ్చుతునక అని, సరైన ఎక్స్‌పోజర్, మార్గదర్శకత్వం ఉంటే పిల్లలు ఉన్నతస్థానానికి చేరుతారనడానికి దేవాన్ష్ నిదర్శనమని తెలిపారు.
లోకేష్ ఆనందం…
చిన్న వయసులో తనయుడు దేవాన్ష్ సాధించిన విజయాలపై తండ్రి లోకేష్ ఆనందం వ్యక్తం చేశాడు ... “దేవాన్ష్ అంతర్జాతీయ స్థాయిలో భారతీయ చెస్ క్రీడాకారుల అద్భుతమైన, చారిత్రాత్మక ప్రదర్శనల నుండి స్ఫూర్తి పొందాడు. వారి వల్లే చేస్ ఆట పట్ల అతడిలో ఆసక్తి ఏర్పడింది. దేవాన్ష్ కు చెస్ పాఠాలు నేర్పిన రాయ్ చెస్ అకాడమీకి నేను ధన్యవాదాలు చెబుతున్నాను అని లోకేష్ అన్నారు.
ఈ ఈవెంట్ కోసం దేవాన్ష్ గత కొన్ని వారాలుగా రోజుకు 5-6 గంటల పాటు శిక్షణ పొందుతున్నాడు. దేవాన్ష్ కోచ్ కె. రాజశేఖర్ రెడ్డి ఈ విజయంపై స్పందిస్తూ “దేవాన్ష్ ఒక డైనమిక్ విద్యార్థి. క్రియేటివ్ ప్లేయర్. 175 సంక్లిష్టమైన పజిల్స్‌ని ఆసక్తిగా పరిష్కరించగలిగిన అతడి మానసిక చురుకుదనం అపారం. అతని చదరంగం ప్రయాణంలో ఈ రికార్డులు ఓ మైలురాయి నిలిచిపోయాతాయని విశ్వసిస్తున్నాను అని అన్నాడు.
టాపిక్