Electric Car : బడ్జెట్ ధరలో వచ్చే ఈ ఎలక్ట్రిక్ కారు సిటీలో నడుపుతుంటే వచ్చే కిక్కు రచ్చో..రచ్చస్య..రచ్చోభ్య!
Electric Car : ఇప్పుడంతా ఎలక్ట్రిక్ కార్లవైపు ఆసక్తిచూపిస్తున్నారు. దీంతో బడ్జెట్ ధరలో మంచి డ్రైవింగ్ అనుభూతినిచ్చే కార్లు తీసుకోవాలి. టాటా టియాగో ఈవీ మీకు సూట్ అయ్యేకార్లలో ఒకటి.
ఓవైపు ఇంధన ధరలు పెరుగుతుండటంతో జనాలు ఎక్కువగా ఎలక్ట్రిక్ కార్ల వైపు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే నగరాల్లో చాలా ఎలక్ట్రిక్ కార్లు దర్శనమిస్తున్నాయి. అయితే దూర ప్రయాణాలు ఎక్కువగా చేసేవారు, సిటీలో ఎక్కువగా తిరిగేవారు కొనే కార్లు వేరుగా ఉంటాయి. ముందుగానే వాటిని అంచనా వేసి తీసుకుంటారు. మీరు కూడా సిటీలో ప్రయాణానికి కారు తీసుకోవాలనుకుంటే టాటా టియాగో ఈవీ మీకు మంచి ఆప్షన్.
టాటా టియాగో ఈవీ సౌకర్యవంతమైన వాహనం. కాంపాక్ట్ డిజైన్, సమర్థవంతమైన పనితీరు, అధునాతన ఫీచర్లుతో వస్తుంది. దీని బేస్ మోడల్ ధర రూ.8 లక్షల(ఎక్స్ షోరూమ్) నుంచి కూడా ఉంది. టాప్ మోడల్ ధర 11 లక్షల ఎక్స్ షోరూమ్ పైన ఉంది. ట్రాఫిక్ జామ్‌లు, పరిమిత పార్కింగ్, పెరుగుతున్న ఇంధన ఖర్చుల వంటి సమస్యలకు టాటా టియాగో సొల్యూషన్ అని చెప్పవచ్చు. సిటీ రోడ్లపై డ్రైవింగ్ కోసం బాగుంటుంది.
ఛార్జింగ్ స్టేషన్లు కూడా ఎక్కువగా అందుబాటులోకి తీసుకువస్తున్నారు. బయటికి వెళ్లినప్పుడు కూడా ఛార్జింగ్ బాధ ఉండదు. టాటా టియాగో ఎక్స్ఈ, ఎక్స్‌టీ, ఎక్స్‌జెడ్, ఎక్స్‌జెడ్ ప్లస్, ఎక్స్‌జెడ్ ప్లస్ టెక్ వేరియంట్‌లలో మీడియం రేంజ్, లాంగ్ రేంజ్ అనే రెండు వెర్షన్‌లలో వస్తుంది.
మీడియం రేంజ్ వెర్షన్లలోని 19.2 kWh బ్యాటరీ ప్యాక్ ఒక్కసారి ఛార్జింగ్‌పై 250 కిమీల రేంజ్ వరకూ అందిస్తుంది. 24 kWh బ్యాటరీ ప్యాక్‌తో కూడిన లాంగ్ రేంజ్ వేరియంట్‌లు 315 కి.మీల వరకు రేంజ్ అందిస్తాయి. ఎలక్ట్రిక్ కారు బేస్ వేరియంట్‌లు 19.2 kWh బ్యాటరీ ప్యాక్‌తో అమర్చబడి ఉంటాయి.
మీడియం రేంజ్ టియాగో ఈవీ 6.2 సెకన్లలో 0-60 కేఎంపీహెచ్ వేగవంతం అందుకుంటుంది. లాంగ్ రేంజ్ వెర్షన్ 5.7 సెకన్లలో 0-60కేఎంపీహెచ్ స్పీడ్ అందుకోగలదు. టియాగో ఈవీ మీడియం రేంజ్ వేరియంట్‌లు 60బీహెచ్‌పీ శక్తిని, గరిష్టంగా 110 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేయగలవు. అదే సమయంలో లాంగ్ రేంజ్ వెర్షన్లు 73బీహెచ్‌పీ శక్తిని, 114ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి.
ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌లోని మరో మంచి విషయం 5.1 మీటర్ల టర్నింగ్ రేడియస్. ఇది యూటర్న్ తీసుకోవడం కూడా సులభతరం చేస్తుంది. దీనితో పాటు గ్రౌండ్ క్లియరెన్స్ 165 మిల్లీమీటర్ల ఉంటుంది. ఛార్జింగ్ పరంగా టియాగో ఈవీ ప్రామాణికంగా 3.3 kW AC ఛార్జర్‌తో వస్తుంది. ఇది ఇంటిలో ఛార్జింగ్‌ను సులభతరం చేస్తుంది.
తక్కువ బడ్జెట్‌లో మంచి సిటీ కారు కోసం చూస్తున్నట్లయితే టియాగో ఈవీ గురించి కూడా ఆలోచించవచ్చు. ఇంధనం కోసం ఎక్కువగా ఖర్చు చేయకుండా రోజువారీ ప్రయాణాన్ని ఉపయోగపడుతుంది.