Top 10 Bikes : నవంబర్ అమ్మకాల్లో హీరో స్ప్లెండర్ నెంబర్ 1.. టాప్ 10 లిస్టులో ఏ బైకులు ఉన్నాయో చూసేయండి-hero splendor number 1 in november 2024 sales honda shine 2nd position check top 10 bikes list here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Top 10 Bikes : నవంబర్ అమ్మకాల్లో హీరో స్ప్లెండర్ నెంబర్ 1.. టాప్ 10 లిస్టులో ఏ బైకులు ఉన్నాయో చూసేయండి

Top 10 Bikes : నవంబర్ అమ్మకాల్లో హీరో స్ప్లెండర్ నెంబర్ 1.. టాప్ 10 లిస్టులో ఏ బైకులు ఉన్నాయో చూసేయండి

Anand Sai HT Telugu
Dec 22, 2024 05:30 PM IST

November Bike Sales : గత నెలలో మోటార్ సైకిల్ అమ్మకాల్లో హీరో స్ప్లెండర్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ కాలంలో స్ప్లెండర్ మొత్తం 2,93,828 యూనిట్ల బైకులను విక్రయించింది. సరిగ్గా ఏడాది క్రితం స్ల్పెండర్ కు 2,50,786 కొత్త కస్టమర్లు వచ్చారు.

నవంబర్ బైకుల అమ్మకాలు
నవంబర్ బైకుల అమ్మకాలు

నవంబర్ 2024లో భారతీయ మోటార్‌సైకిల్ మార్కెట్ మిశ్రమ పనితీరును కనబరిచింది. కొన్ని మోడల్‌లు గణనీయమైన వృద్ధిని కనబరిచాయి. మరికొన్ని గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఇబ్బంది పడ్డాయి. టాప్ 10 మోటార్‌సైకిళ్ల మొత్తం విక్రయాలు 8,10,674 యూనిట్లుగా ఉన్నాయి, నవంబర్ 2023లో 8,45,424 యూనిట్లతో పోల్చితే.. సంవత్సరానికి 4.11 శాతం క్షీణత ఉంది. ఈ నెలలోని టాప్ 10 మోటార్‌సైకిళ్లను ఇక్కడ చూడండి..

హీరో మోటోకార్ప్ మోటార్ సైకిళ్లు ఎల్లప్పుడూ భారతీయ వినియోగదారులకు ఇష్టమైనవిగా ఉంటాయి. గత నెలలో అంటే 2024 నవంబర్లో జరిగిన అమ్మకాల్లో హీరో స్ప్లెండర్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ కాలంలో హీరో స్ప్లెండర్ 17.16 శాతం వృద్ధితో మొత్తం 2,93,828 యూనిట్ల మోటార్ సైకిళ్లను విక్రయించింది. సరిగ్గా ఏడాది క్రితం అంటే 2023 నవంబర్లో హీరో స్ప్లెండర్‌కు 2,50,786 కొత్త కస్టమర్లు వచ్చారు. ఈ కాలంలో హీరో స్ప్లెండర్ మాత్రమే మోటార్ సైకిల్ మార్కెట్లో 36.24 శాతం ఆక్రమించింది.

హోండా షైన్ అత్యధికంగా అమ్ముడవుతున్న రెండో బైక్. ఈ కాలంలో హోండా షైన్ మొత్తం 1,45,530 మంది కొత్త కస్టమర్లను తెచ్చుకుంది. బజాజ్ పల్సర్ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉంది. ఈ కాలంలో బజాజ్ పల్సర్ కు మొత్తం 1,14,467 మంది కస్టమర్లు వచ్చారు. అదే సమయంలో హీరో హెచ్ఎఫ్ డీలక్స్ ఈ అమ్మకాల జాబితాలో నాలుగో స్థానంలో ఉంది. ఈ కాలంలో హీరో హెచ్ఎఫ్ డీలక్స్ మొత్తం 61,245 యూనిట్ల మోటార్ సైకిళ్లను విక్రయించింది. ఈ జాబితాలో బజాజ్ ప్లాటినా ఐదో స్థానంలో నిలిచింది. బజాజ్ ప్లాటినా 44,578 కొత్త కస్టమర్లను చేర్చుకుంది.

మరోవైపు టీవీఎస్ అపాచీ ఈ అమ్మకాల జాబితాలో ఆరో స్థానంలో నిలిచింది. ఈ కాలంలో టీవీఎస్ అపాచీకి మొత్తం 35,610 కొత్త కస్టమర్లు వచ్చారు. ఈ జాబితాలో టీవీఎస్ రైడర్ ఏడో స్థానంలో నిలిచింది. ఈ కాలంలో టీవీఎస్ రైడర్ మొత్తం 31,769 కొత్త కస్టమర్లను పొందింది. హోండా సీబీ యూనికార్న్ 150 ఈ జాబితాలో ఎనిమిదో స్థానంలో ఉంది. ఈ కాలంలో సీబీ యూనికార్న్ 150 మొత్తం 30,678 యూనిట్ల మోటార్ సైకిళ్లను విక్రయించింది. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 27514 కస్టమర్లతో తొమ్మిదో స్థానంలో ఉండగా.. హీరో ఎక్స్‌ట్రీమ్ 125ఆర్ 25,455 యూనిట్లతో 10వ స్థానంలో నిలిచాయి.

Whats_app_banner