రైల్వేలో 1036 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. అర్హతలతోపాటు ఇతర వివరాల కోసం ఇక్కడ చూడండి-railway to recruit for 1036 pots check eligibility and other details inside ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  రైల్వేలో 1036 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. అర్హతలతోపాటు ఇతర వివరాల కోసం ఇక్కడ చూడండి

రైల్వేలో 1036 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. అర్హతలతోపాటు ఇతర వివరాల కోసం ఇక్కడ చూడండి

Anand Sai HT Telugu
Dec 22, 2024 09:19 PM IST

Railway Recruitment : రైల్వేలో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామక ప్రక్రియ ద్వారా వివిధ విభాగాల్లో మొత్తం 1036 పోస్టులకు అభ్యర్థులను నియమించనున్నారు. ఈ పోస్టులకు సంబంధించిన వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

రైల్వేలో ఉద్యోగాలు
రైల్వేలో ఉద్యోగాలు

రైల్వేలో రిక్రూట్మెంట్ కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్‌న్యూస్. ఇండియన్ రైల్వేస్ మినిస్టీరియల్ ఐసోలేటెడ్ కేటగిరీకి బంపర్ రిక్రూట్‌మెంట్ విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా వివిధ విభాగాల్లో మొత్తం 1036 పోస్టులకు అభ్యర్థులను నియమించనున్నారు. దరఖాస్తు ప్రక్రియ జనవరి 7, 2025న ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 6న ముగుస్తుంది.

yearly horoscope entry point

రైల్వే రిక్రూట్మెంట్ ప్రక్రియ ద్వారా పీజీటీ టీచర్, జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్, లైబ్రేరియన్, సైంటిఫిక్ అసిస్టెంట్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఎందులో ఎన్ని పోస్టులు ఉన్నాయో చూద్దాం.. పీజీటీ టీచర్ (పీజీటీ) - 187 పోస్టులు, టీజీటీ టీచర్ (టీజీటీ) - 338 పోస్టులు, సైంటిఫిక్ సూపర్వైజర్ - 03 పోస్టులు, చీఫ్ లా ఆఫీసర్ - 54, పబ్లిక్ ప్రాసిక్యూటర్ - 20, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ పీటీఐ ఇంగ్లిష్ మీడియం - 18, సైంటిఫిక్ అసిస్టెంట్/ ట్రైనింగ్ - 02 పోస్టులు, జూనియర్ ట్రాన్స్లేటర్ హిందీ - 130, లైబ్రేరియన్ - 10, మ్యూజిక్ టీచర్ మహిళ - 03, ప్రైమరీ రైల్వే టీచర్ (పీఆర్టీ) - 188, అసిస్టెంట్ టీచర్ జూనియర్ స్కూల్ (మహిళ) - 02, ల్యాబొరేటరీ అసిస్టెంట్/ స్కూల్ - 07, ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3 (కెమిస్ట్ అండ్ మ్యాటరాలజీ) - 12 పోస్టులు ఉన్నాయి.

రైల్వే రిక్రూట్ మెంట్‌కు అప్లై చేయడానికి సంబంధిత సబ్జెక్టులో బ్యాచిలర్ డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. మాస్టర్స్ డిగ్రీ గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుంచి ఉండాలి. టీచింగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే బీఈడీ/డీఎల్ఈడీ/బీఈడీ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. టెట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి.

పోస్టులను బట్టి అభ్యర్థులకు వేతనం ఇస్తారు. అభ్యర్థులు దరఖాస్తు చేసే ముందు అధికారిక నోటిఫికేషన్లో అర్హత, విద్యార్హతలను మరోసారి చూసుకుంటే మంచిది.

జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రూ.500గా ఉంది. ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వారికి రూ.250గా ఉంటుంది. అప్లికేషన్‌ను అభ్యర్థులు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ అధికారిక వెబ్‌సైట్‌లో ఫిల్ చేయెుచ్చు. పూర్తి వివరాల కోసం నోటిఫికేషన్ చదవండి.

Whats_app_banner