AP DMHO Jobs : ఏపీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉద్యోగాలు, రాత పరీక్ష లేకుండానే భర్తీ- దరఖాస్తు విధానం ఇలా
AP DMHO Jobs : ఏపీలోని కడప, చిత్తూరు, విజయనగరం జిల్లాల్లో డీఎంహెచ్ఓ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించారు. మెడికల్, పారా మెడికల్, ఇతర పోస్టులను భర్తీ చేయనున్నారు.
AP DMHO Jobs : కడప, చిత్తూరు, విజయనగరం జిల్లాల్లో డీఎంహెచ్ఓ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. జిల్లాల వారీగా పారా మెడికల్, ఇతర పోస్టుల భర్తీకి వైద్యారోగ్య శాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
కడప జిల్లాలో ఖాళీలు- 14
- మెడికల్ ఆఫీసర్/ఫిజీషియన్ - 01 పోస్టు
- ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-II- 02 పోస్టులు
- శానిటరీ అటెండర్ కమ్ వాచ్‌మెన్ - 04 పోస్టులు
- ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ -05 పోస్టులు
- ఫార్మసిస్ట్ - 01 పోస్టు
- టీబీ హెల్త్ విజిటర్ - 01 పోస్టు
కడప జిల్లాలోని పోస్టులకు డిసెంబర్ 30వ తేదీలోపు ఆఫ్ లైన్ లో దరఖాస్తు(https://kadapa.ap.gov.in/) చేసుకోవాల్సి ఉంటుంది. పరీక్ష మార్కులు, ఎక్స్ పీరియన్స్, రిజర్వేషన్ ప్రకారం అభ్యర్థులను ఎఁపికి చేస్తారు. ఫిజీషియన్ పోస్టులకు మాత్రమే వాక్ ఇన్ ఇంటర్వ్యూను డిసెంబర్ 30న నిర్వహిస్తారు. పోస్టులను అనుసరించి టెన్త్, ఇంటర్, డీఎంఎల్‌టీ, బీఎస్సీ (ఎంఎల్‌టీ), ఎంపీడబ్ల్యూ,ఎల్‌హెచ్‌వీ, ఏఎన్‌ఎం, డీఫార్మసీ, బీఫార్మసీలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ఆఫ్‌లైన్ లో దరఖాస్తు, సంబంధిత ధ్రువపత్రాలను జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం, కడప, వైఎస్‌ఆర్ జిల్లా చిరునామాకు పంపించాల్సి ఉంటుంది.
చిత్తూరు జిల్లాలోని (https://chittoor.ap.gov.in/)ప్రభుత్వ ఆస్పత్రుల్లో 16 కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మెడికల్, పారా మెడికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించారు. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 27వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టులను అనుసరించి టెన్త్, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్, డీఎంఎల్‌టీ, బీఎస్సీ (ఎంఎల్‌టీ) అర్హతలు కలిగి ఉండాలి. అభ్యర్థులకు 42 ఏళ్ల వయస్సు మించకూడదు. విద్యార్హత పరీక్ష మార్కులు, ఎక్స్ పీరియన్స్, రిజర్వేషన్ ఆధారంగా పోస్టులు కేటాయిస్తాయి. ఆఫ్‌లైన్ దరఖాస్తులు, సర్టిఫికెట్లను జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం, చిత్తూరు, చిత్తూరు జిల్లా చిరునామాకు పంపించాలి.
మొత్తం ఖాళీలు- 16
- ల్యాబ్- టెక్నీషియన్ గ్రేడ్-II- 3 పోస్టులు
- శానిటరీ అటెండర్ కమ్ వాచ్‌మెన్- 6 పోస్టులు
- ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ- 7 పోస్టులు
విజయనగరం జిల్లా(https://vizianagaram.ap.gov.in/) డీఎంహెచ్ఓ పరిధిలో విజయనగరం, పార్వతీపురంలోని జిల్లా ఆసుపత్రుల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 7 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించారు. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టును అనుసరించి డీఎస్సీ టెక్నీషియన్ కోర్సు, పీజీ, ఎంఫిల్, బీఈడీ, డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయస్సు 42 సంవత్సరాలు మించకూడదు. అభ్యర్థులు ఆఫ్ లైన్ లో దరఖాస్తులను విజయనగరంలోని జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం చిరునామాకు పంపించాలి.
మొత్తం ఖాళీలు - 7
- మెడికల్ ఆఫీసర్(డెంటల్)- 01 పోస్టు
- క్లినికల్ సైకాలజిస్ట్- 01 పోస్టు
- అడియాలజిస్ట్ అండ్ స్పీచ్ థెరపిస్ట్- 01 పోస్టు
- ఎర్లీ ఇంటర్‌వెన్షనిస్ట్ కమ్ స్పెషల్ ఎడ్యుకేటర్- 01 పోస్టు
- డెంటల్ టెక్నీషియన్- 02 పోస్టులు
- ల్యాబ్ టెక్నీషియన్- 01 పోస్టు
సంబంధిత కథనం