Sangareddy DMHO Searches : ఎలిసా టెస్ట్ చేయకుండానే డెంగ్యూ అని నిర్థారణ, ల్యాబ్ సీజ్ చేసిన డీఎంహెచ్ఓ-sangareddy dmho searches in private hospitals seized labs not did elisa test ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Sangareddy Dmho Searches : ఎలిసా టెస్ట్ చేయకుండానే డెంగ్యూ అని నిర్థారణ, ల్యాబ్ సీజ్ చేసిన డీఎంహెచ్ఓ

Sangareddy DMHO Searches : ఎలిసా టెస్ట్ చేయకుండానే డెంగ్యూ అని నిర్థారణ, ల్యాబ్ సీజ్ చేసిన డీఎంహెచ్ఓ

HT Telugu Desk HT Telugu
Sep 11, 2024 07:16 AM IST

Sangareddy DMHO Searches : సంగారెడ్డి డీఎంహెచ్ఓ డా.గాయత్రీ దేవీ పలు ప్రైవేట్ ఆసుపత్రులను, ల్యాబ్ లను తనిఖీ చేశారు. కొన్ని ల్యాబ్ లు డెంగ్యూ నిర్థారణకు ఎలిసా టెస్ట్ లు చేయడంలేదని గుర్తించారు. అలాగే వైద్యులు, ఖర్చుల వివరాలు ప్రదర్శించని ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటామన్నారు.

ఎలిసా టెస్ట్ చేయకుండానే డెంగ్యూ అని నిర్థారణ, ల్యాజ్ సీజ్ చేసిన డీఎంహెచ్ఓ
ఎలిసా టెస్ట్ చేయకుండానే డెంగ్యూ అని నిర్థారణ, ల్యాజ్ సీజ్ చేసిన డీఎంహెచ్ఓ

Sangareddy DMHO Searches : సంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్ జి.గాయత్రీ దేవి సంగారెడ్డి పట్టణంలోని పలు ప్రైవేట్ ఆసుపత్రులను, ఆసుపత్రులలోని ల్యాబ్ లను తనిఖీ చేశారు. పట్టణంలోని బైపాస్ రోడ్ లో ఉన్న శిశురక్ష హాస్పిటల్ లో తనిఖీ నిర్వహించగా ఆ ఆసుపత్రిలో పనిచేయుచున్న డాక్టర్ల వివరాలు, ఆసుపత్రిలో అందుతున్న సేవలకు పేషెంట్ల వద్ద వసూలు చేస్తున్న ధరల పట్టికను రిసెప్షన్ వద్ద ప్రదర్శించడం డాక్టర్ గాయత్రి దేవి గుర్తించారు .

పెద్ద లాబ్ కి శాంపిల్స్ పంపాలి

దీంతోపాటు హాస్పిటల్ లో ఉన్న ల్యాబ్లో రాపిడ్ కార్డు టెస్ట్ లో డెంగు జ్వరం పాజిటివ్ వచ్చిన అది నిర్ధారణ చేయకుండా సెకండ్ శాంపిల్ ఎలిసా టెస్ట్ కు తెలంగాణ డయాగ్నస్టిక్స్ కు కానీ ఏదైనా పెద్ద డయాగ్నస్టిక్స్ కు పంపించి అక్కడ ఎలిసా టెస్ట్ లో పాజిటివ్ వచ్చినప్పుడు డెంగ్యూ పాజిటివ్ నిర్ధారణ చేయాలని సూచించారు. కానీ రెండోసారి శాంపుల్ ఎలిసా టెస్ట్ కు పంపియకుండా డెంగ్యూ పాజిటివ్ అని నిర్ధారణ చేసి పేషంట్లకు భయభ్రాంతులను గురి చేస్తున్నారని ఓ ల్యాబ్ ను సీజ్ చేశారు.

రికార్డులు లేని మరొక ల్యాబ్ సీజ్

సంగారెడ్డి చౌరస్తాలోని చరిత హాస్పిటల్ లో డాక్టర్ గాయత్రి దేవి తనిఖీ చేశారు. ఈ హాస్పిటల్ లో పరిశుభ్రత పాటించడంలేదని, బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ సరిగా మెయింటైన్ చేయకపోవడం, ఫైర్ సేఫ్టీ సిస్టం లేకపోవడం, ల్యాబ్ లో రికార్డ్స్ సరిగా మెయింటెన్ చేయకపోవడం గుర్తించారు. ఈ కారణాలతో చరిత హాస్పిటల్ లో ఉన్న ల్యాబ్ ను సీజ్ చేశారు. దీంతోపాటు ఆసుపత్రి యజమాన్యానికి నోటీసులు ఇచ్చారు.

ధరల పట్టిక ప్రదర్శించకపోతే ఆసుపత్రులపై కఠిన చర్యలు

జిల్లాలోని అన్ని ప్రైవేట్ ఆసుపత్రులకు, ల్యాబ్ నిర్వాహకులు తమ సంస్థలలో పేషెంట్లకు ఇస్తున్న సర్వీసులు, వాటికి తీసుకుంటున్న ఛార్జీలు రిసెప్షన్ వద్ద బోర్డులో ప్రదర్శించాలని, ఆసుపత్రులలో పనిచేస్తున్న డాక్టర్ల వివరాలు కూడా ప్రదర్శించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ గాయత్రీ దేవి తెలిపారు. లేకపోతే ప్రైవేటు ఆసుపత్రులపై, ల్యాబ్ లపై క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని డీఎం అండ్ హెచ్ఓ గాయత్రీ దేవి హెచ్చరించారు.

అన్ని ఆసుపత్రుల్లో ఫైర్ సేఫ్టీ సిస్టంలు ఏర్పాటు చేయాలి

డెంగ్యూ కేసులు జిల్లాలో చాలా ఎక్కువగా పెరగటం వలన, కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశాల ప్రకారం తాను ఆసుపత్రులను తనిఖీ చేశానని డాక్టర్ గాయత్రి దేవి తెలిపారు. ఈ సందర్బంగా, ఆమె మాట్లాడుతూ అన్ని ఆసుపత్రులు కూడా బయో వేస్ట్ మేనేజ్మెంట్ చేయాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు ఫైర్ సేఫ్టీ సిస్టం ఏర్పాటు చేసుకోవాలని డీఎంహెచ్ఓ ఆదేశాలు జారీచేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రులను తరచూ తనిఖీ చేస్తామని తెలిపారు.