Telangana News Live December 21, 2024: Allu Arjun : నా పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు, రోడ్ షో చేయలేదు- అల్లు అర్జున్
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Sat, 21 Dec 202402:56 PM IST
Allu Arjun : నా క్యారెక్టర్ అసాసినేషన్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని హీరో అల్లు అర్జు్న్ ఆరోపించారు. సంధ్య థియేటర్ తొక్కిసలాటపై తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. రోడ్ షో చేసుకుంటూ వెళ్లామనడం సరికాదన్నారు.
Sat, 21 Dec 202411:50 AM IST
Minister Komatireddy : సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారు. ఈ ఘటనలో మృతి చెందిన బాధితురాలు రేవతి కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం అందిస్తామని ప్రకటించారు. ఇకపై రాష్ట్రంలో బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ల పెంపునకు అనుమతి ఇవ్వబోమన్నారు.
Sat, 21 Dec 202410:02 AM IST
CM Revanth Reddy : "ఒక రోజు జైలుకెళ్లిన హీరోను ఏదో కాళ్లు, చేతులు పోయిన వ్యక్తిలా పరామర్శించడానికి క్యూకట్టిన సెలబ్రిటీలు...ఓ మహిళ ప్రాణం పోయింది, బాలుడు బ్రెయిన్ డెడ్ అయ్యి కోమాలో ఉంటే కనీసం పరామర్శించలేదు" అని సంధ్య థియేటర్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Sat, 21 Dec 202409:38 AM IST
- TG Rythu Bharosa : తెలంగాణలో రైతు భరోసా అమలుపై ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక.. ఈ పథకాన్ని నిలిపేస్తారని ప్రచారం జరిగింది. తాజాగా దీనిపై బీఆర్ఎస్.. కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు.
Sat, 21 Dec 202407:54 AM IST
- మైనర్ లు బైక్ నడిపి ప్రమాదాలకు కారణమైతే పేరెంట్స్ తో పాటు వాహన యజమాని జైలుకు వెళ్ళక తప్పదని సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ హెచ్చరించారు. స్పెషల్ డ్రైవ్ చేపట్టిన పోలీసులు… వాహనాలు నడిపిన 285 మంది మైనర్ల ను పట్టుకున్నారు. మైనర్లతో పాటు వారి పేరెంట్స్ కు కౌన్సిలింగ్ నిర్వహించారు.
Sat, 21 Dec 202406:58 AM IST
- South Central Railway : కాజీపేట- కొండపల్లి సెక్షన్‌లో మూడో రైల్వే లైన్ పనులు జరుగుతున్నాయి. దీంతో పలు రైళ్లను రద్దు చేసినట్టు అధికారులు వెల్లడించారు. డిసెంబర్ 25 నుంచి జనవరి 9 వరకు రైళ్లను రద్దు చేశారు. మరికొన్నింటిని దారి మళ్లించారు. ప్రయాణికులు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
Sat, 21 Dec 202405:14 AM IST
- TG Local Body Elections : తెలంగాణ లోకల్ బాడీ ఎలక్షన్స్‌కు సంబంధించి కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇద్దరు పిల్లల నిబంధనను కొనసాగించాలని నిర్ణయించింది. దీంతో చాలామందికి నిరాశే ఎదురైంది. ఈ నిబంధనను తొలగిస్తారని చాలామంది ఆశించారు. కానీ.. కొనసాగించాలని కేబినెట్ నిర్ణయించింది.
Sat, 21 Dec 202404:04 AM IST
- Hyderabad : హైదరాబాద్‌లో ప్రాపర్టీ కొనుగోలు చేయడం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఎంతో కాలం సంపాదించి, ఇల్లు, స్థలం కొంటారు. ఆ తర్వాత ఏ చిన్న సమస్య వచ్చినా.. కోలుకోలేని దెబ్బ తగులుతుంది. అందుకే భాగ్యనగరంలో ప్రాపర్టీ కొనేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో ఓసారి చూద్దాం.
Sat, 21 Dec 202403:14 AM IST
- ఫార్ములా ఈరేస్ కేసులో కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేయగా.. మరోవైపు ఈడీ కూడా ఎంట్రీ ఇచ్చింది. ఈ కేసులో ఏ1గా కేటీఆర్ పేరు ఉంది. ఓవైపు ఏసీబీ విచారణకు సిద్ధమవుతుండగా.. మరోవైపు ఈడీ కూడా నోటీసులు జారీ చేసి విచారించే అవకాశం ఉంది.
Sat, 21 Dec 202401:08 AM IST
- కోరుట్ల లో ఘరానా మోసం వెలుగు చూసింది. పింఛన్ ఇప్పిస్తానంటూ ఓ యువకుడు… వృద్దురాలి బంగారు ఆభరణాలను చోరీ చేశాడు. అసలు విషయం తెలియటంతో మోసపోయిన వృద్ధురాలు…. లాబోదిబో అంటు పోలీసులను ఆశ్రయించింది. సీసీ పుటేజీ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.