AP Govt Medical Recruitment 2024 : విజయనగరం జిల్లాలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు - ఇలా దరఖాస్తు చేసుకోండి
విజయనగరం, పార్వతీపురం జిల్లాల పరిధిలోని ప్రభుత్వాస్పత్రుల్లో పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందులో మెడికల్ ఆఫీసర్ డెంటల్, క్లినికల్ సైకాలజిస్ట్, అడియాలజిస్ట్ అండ్ స్పీచ్ థెరపిస్ట్ తో పాటు మరికొన్ని పోస్టులు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థలు డిసెంబర్ 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి.
విజయనగరం, పార్వతీపురంలోని జిల్లా ఆసుపత్రుల్లో పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు విజయనగరంలోని జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం ఏడు పోస్టులను రిక్రూట్ చేయనుంది. వీటిని కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
ఖాళీల వివరాలు:
- మెడికల్ ఆఫీసర్- డెంటల్ - 1 (కాంట్రాాక్ట్)
- క్లినికల్ సైకాలజిస్ట్ - 1 (కాంట్రాాక్ట్)
- అడియాలజిస్ట్ అండ్ స్పిచ్ థెరపిస్ట్ - 1 పోస్టు(కాంట్రాాక్ట్)
- డెంటల్ టెక్నీషియన్ - 2 పోస్టులు(కాంట్రాాక్ట్)
- Early Interventionist cum special educator - 1 పోస్టు(కాంట్రాాక్ట్)
- ల్యాబ్ టెక్నీషియన్ -1 ఉద్యోగం(కాంట్రాాక్ట్)
ఎంపిక విధానం…
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆయా కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అంతేకాకుండా పని చేసిన అనుభవం ఉండాలి. 42 సంవత్సరాలు మించకూడదు. అకడమిక్ మార్కులకు 75 శాతం వెయిటేజీ ఉంటుంది. 15 శాతం పని అనుభవానికి వేయిటేజీ ఉంటుంది. మరో 10 శాతం ఎడ్యుకేషనల్ సినియార్టీకి ఉంటుంది. ఆన్ లైన్ లో దరఖాస్తు ఫామ్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఆఫ్ లైన్ లో సమర్పించాలి. విజయనగరంలోని జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం చిరునామాకు అప్లికేషన్లను పంపించాలి.
ముఖ్య తేదీలు:
- నోటిఫికేషన్ విడుదల - 16-12-2024
- దరఖాస్తుల స్వీకరణ - 17-12-2024 నుంచి 31-12-2024.(పని దినాల్లో మాత్రం స్వీకరిస్తారు)
- అప్లికేషన్ల పరిశీలన - 01-01-2025 నుంచి 05-01-2025.
- ప్రివిజినల్ మెరిట్ లిస్ట్ - 09-01-2025
- అభ్యంతరాల స్వీకరణ - 10-01-2025 నుంచి 12-01-2025
- ఫైనల్ మెరిట్ లిస్ట్ - 20-01-2025
- అపాయింట్ మెంట్ అర్డర్స్ - 22-01-2025
- అధికారిక వెబ్ సైట్ - https://vizianagaram.ap.gov.in/
- అప్లికేషన్ లింక్ - https://cdn.s3waas.gov.in/s3cee631121c2ec9232f3a2f028ad5c89b/uploads/2024/12/2024121642.pdf
తూర్పుగోదావరి జిల్లాలో ఉద్యోగాలు:
నేషనల్ హెల్త్ మిషన్ స్కీమ్ కింద ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ అయింది. మొత్తం ఎనిమిది ఖాళీలను రిక్రూట్ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో మూడు ఫార్మసిస్ట్,4 ఎన్ జీఎస్ పోస్టులు ఉండగా.. ఒకటి డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టు ఉంది. వీటిని కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తారని నోటిఫికేషన్ లో స్పష్టం చేశారు.
ఫార్మసీ పోస్టులకు బీ ఫార్మసీ లేదా డిప్లామా ఇన్ ఫార్మసీ ఉత్తీర్ణత ఉండాలి. ఇక డేటా ఆపరేట్ పోస్టులకు డిగ్రీతో పాటు పీజీడీసీఏ ఉండాలి.LGS పోస్టులకు పదో తరగతి పాసై ఉండాలి.
అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ నుంచి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలి. డిసెంబర్ 29వ తేదీలోపు ఆఫ్ లైన్ లో సమర్పించాలి. డిస్ట్రిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ పేరుపై డీడీ కట్టాలి. ఓసీ అభ్యర్థులు రూ. 300 చెల్లించాలి. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులు రూ. 200 కట్టాలి.
ముఖ్యమైన తేదీలు:
- రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ - డిసెంబర్ 19, 2024
- అప్లికేషన్ల స్వీకరణ - డిసెంబర్ 21 నుంచి డిసెంబర్ 29, 2024
- ప్రివిజనల్ మెరిట్ లిస్ట్ - జనవరి 4, 2025
- ఫైనల్ మెరిట్ జాబితా - జనవరి 09, 2025
- ఆపాయింట్ మెంట్ అర్డర్ల అందజేత - జనవరి 14, 2024
- అధికారిక వెబ్ సైట్ లింక్ - https://kakinada.ap.gov.in/notice_category/recruitment/
సంబంధిత కథనం