TG Model School Admissions 2025 : తెలంగాణ మోడల్ స్కూల్ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల - దరఖాస్తు తేదీలివే
Telangana Model School Notification 2025 : తెలంగాణ మోడల్ స్కూల్ ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. 2025 -26 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు కల్పించనున్నారు. జనవరి 6, 2025వ తేదీ నుంచి ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభమవుతాయి. http://telanganams.cgg.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ చేసుకోవాలి.
తెలంగాణలోని మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చేసింది. 6వ తరగతిలో కొత్తగా ప్రవేశాలు కల్పించడంతో పాటు 7-10 తరగతుల్లోని ఖాళీ సీట్ల భర్తీకి నిర్వహించే ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారు. http://telanganams.cgg.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ చేసుకోవాలి. 2025 -26 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్లు కల్పిస్తారు.
ఆన్ లైన్ లో దరఖాస్తులు…
అడ్మిషన్ నోటిఫికేషన్ డిసెంబర్ 23వ తేదీన విడుదలవుతుంది. ఆన్ లైన్ దరఖాస్తుల జనవరి 6వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. అర్హులైన విద్యార్థులు ఫిబ్రవరి 28వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు.
ఓసీ విద్యార్థులు రూ. 200 చెల్లించాలి. ఇక బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, ఈడబ్యూఎస్ విద్యార్థులు రూ. 125 చెల్లించాల్సి ఉంటుంది. రాత పరీక్ష ఏప్రిల్ 13, 2025వ తేదీన జరగుతుంది. ఏప్రిల్ 3వ తేదీ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
మోడల్ స్కూల్ ప్రవేశాలు - ముఖ్య వివరాలు:
- మోడల్ స్కూల్స్ ప్రవేశాలు - 2025- 2026
- ప్రవేశాలు కల్పించే తరగతులు - 6, 7, 8, 9, 10.
- దరఖాస్తు విధానం - ఆన్‌లైన్ ద్వారా.
- దరఖాస్తులు ప్రారంభం - జనవరి 06, 202
- దరఖాస్తులకు తుది గుడువు - ఫిబ్రవరి 28, 202
- హాల్ టికెట్లు డౌన్లోడ్ - ఏప్రిల్ 03, 2025
- పరీక్ష తేదీ - ఏప్రిల్ 13, 2025
- వెబ్ సైట్ - http://telanganams.cgg.gov.in
మరోవైపు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలకు ప్రకటన జారీ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తోన్న సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, గురుకుల విద్యాలయ సంస్థల్లో ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. 5వ తరగతిలో ప్రవేశాల కోసం 2025 - 26 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు.
5వ తరగతిలో ప్రవేశం కోసం 2025 ఫిబ్రవరి 23న ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు అన్ని జిల్లాలలో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఎంపిక చేసిన పరీక్షా కేంద్రాలలో జరిగే ప్రవేశ పరీక్ష కోసం అభ్యర్థులు దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాల్సి ఉంటుంది. https://tgswreis.telangana.gov.in/ లింక్ పై క్లిక్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
సంబంధిత కథనం