తెలుగు న్యూస్ / ఫోటో /
Megha Akash: వికటకవి వెబ్ సిరీస్‌తో మళ్లీ మెరిసిన మేఘా ఆకాశ్.. ఛాన్స్‌లు దొరికేనా?
Vikkatakavi Web Series Actress Megha Akash: నితిన్‌తో లై సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన మేఘా ఆకాశ్.. వరుస సినిమాలు చేసినా ఈ అమ్మడికి హిట్ పడలేదు. దాంతో ఇటీవల వికటకవి వెబ్ సిరీస్‌లో ఈ భామ కనిపించింది.
(1 / 6)
యంగ్ హీరోయిన్ మేఘా ఆకాశ్ చాలా రోజుల తర్వాత మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌తో ఇటీవల విడుదలైన వికటకవి వెబ్ సిరీస్‌లో ఈ ముద్దుగుమ్మ నటించింది. (meghaakash/instagram)
(2 / 6)
సాయి విష్ణు అనే కుర్రాడి ఈ ఏడాది పెళ్లి చేసుకున్న మేఘా ఆకాశ్.. ఆ తర్వాత సినిమాలకి దూరంగా ఉండిపోయింది. అయితే.. వికటకవితో మళ్లీ ఈ అమ్మడు మెరిసింది (meghaakash/instagram)
(3 / 6)
చెన్నైలో పుట్టిన మేఘా ఆకాశ్.. నితిన్ మూవీ ‘లై’తో తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయ్యింది. ఆ తర్వాత ఛల్ మోహన రంగ, రాజరాజ చోర, డియర్ మేఘ తదితర సినిమాల్లో నటించింది. కానీ.. ఏవీ పెద్దగా ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయాయి. (meghaakash/instagram)
(4 / 6)
తెలుగులోనే కాదు తమిళ్‌లోనూ మేఘా ఆకాశ్ నటించింది. సూపర్ స్టార్ రజినీకాంత్‌తో పేటా చిత్రంలో మేఘా ఆకాశ్ మెరిసింది. కానీ.. ఈ సినిమా మేఘాకి పేరు తెచ్చిపెట్టలేదు. (meghaakash/instagram)
(5 / 6)
వాస్తవానికి మేఘా ఆకాశ్ తమిళనాడుకి చెందని ఓ రాజకీయ నాయకుడి కొడుకుని పెళ్లి చేసుకోబోతోందని తొలుత వార్తలు వచ్చాయి. కానీ.. సడన్‌గా సాయి విష్ణుని వివాహం చేసుకున్నట్లు ప్రకటించింది. (meghaakash/instagram)
ఇతర గ్యాలరీలు