UGC NET December 2024 : యూజీసీ నెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల - ఇవిగో తేదీలు-examination schedule of ugc net december 2024 out key details read here ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Ugc Net December 2024 : యూజీసీ నెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల - ఇవిగో తేదీలు

UGC NET December 2024 : యూజీసీ నెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల - ఇవిగో తేదీలు

Maheshwaram Mahendra Chary HT Telugu
Dec 19, 2024 10:20 PM IST

UGC NET December 2024: యూజీసీ నెట్ డిసెంబర్ 2024 కు సంబంధించిన పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. జనవరి 3వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జనవరి 16వ తేదీతో అన్ని సబ్జెక్టుల ఎగ్జామ్స్ పూర్తి అవుతాయి. ప్రతి రోజూ రెండు సెషన్లు ఉంటాయి.

యూజీసీ నెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల
యూజీసీ నెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల

యూజీసీ నెట్ డిసెంబర్ 2024 కు సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్ వచ్చేసింది. పరీక్షల పూర్తి షెడ్యూల్ విడుదలైంది. ఈమేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వివరాలను ప్రకటించింది.

తాజాగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం 2025 జనవరి 3 నుంచి ప్రారంభమవుతాయి. జనవరి 16వ తేదీతో ముగుస్తాయి. ప్రతి రోజూ రెండు సెషన్లు ఉంటాయి. పరీక్షలు ప్రారంభమయ్యే ఎనిమిది రోజుల ముందు హాల్ టికెట్లు అందుబాటులో వస్తాయి. భారతీయ విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో 'జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ మంజూరు, అసిస్టెంట్ ప్రొఫెసర్ గా నియామకం, పీహెచ్డీలో ప్రవేశం కోసం భారతీయ పౌరుల అర్హతను నిర్ణయించడానికి యూజీసీ -నెట్ నిర్వహిస్తారు.

యూజీసీ నెట్ 2024కు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 011-40759000 నెంబర్ ను సంప్రదించవచ్చని ఎన్టీఏ సూచించింది. లేదా email ugcnet@nta.ac.in. కు మెయిల్ కూడా చేయవచ్చు.

పరీక్ష తేదీలు వంటి వివరాలను అభ్యర్థులు యూజీసీ అధికారిక వెబ్​సైట్​ ugcnet.nta.ac.in లో తెలుసుకోవచ్చు. పరీక్షలు పూర్తి అయిన తర్వాత ప్రాథమిక కీలను ప్రకటించి తుది ఫలితాలను వెల్లడిస్తారు.

ఇక యూజీసీ నెట్ జూన్ రీ ఎగ్జామ్ ఆగస్టు 21, 22, 23, 27, 28, 29, 30, సెప్టెంబర్ 2, 3, 4, 5 తేదీల్లో జరిగింది. మొత్తం 11,21,225 మంది అభ్యర్థులు పరీక్షకు రిజిస్టర్ చేసుకోగా వారిలో 6,84,224 మంది మాత్రమే హాజరయ్యారు. 4,37,001 మంది అభ్యర్థులు రీ టెస్ట్ కు గైర్హాజరయ్యారని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వెల్లడించింది. ఈ పరీక్షలో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF)కు 4,970 మంది, అసిస్టెంట్ ప్రొఫెసర్ కు 53,694 మంది, పీహెచ్ డీ ప్రవేశాలకు 1,12,070 మంది అర్హత సాధించారు.

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్