“స్వర్ణాంధ్ర విజన్ – 2047″కి అనుగుణంగా తిరుమలలో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి కోసం టీటీడీ ప్రతిపాదనలను ఆహ్వానించింది. పర్యావరణ నిర్వహణ, వారసత్వ పరిరక్షణపై దృష్టి సారించే వ్యూహాత్మక ప్రణాళికతో “తిరుమల విజన్ – 2047” ను టీటీడీ ప్రారంభించింది. ఈ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రఖ్యాత ఏజెన్సీలను ఆహ్వానిస్తూ ప్రతిపాదనల కోసం ఆర్ఎఫ్‌పీని విడుదల చేసింది.
మూడు వారాల్లోగా ఆసక్తి గల ఏజెన్సీలు తమ ప్రతిపాదనలను సమర్పించాలని టీటీడీ కోరింది. ఇలాంటి భారీస్థాయి పట్టణ ప్రణాళిక, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో ఏజెన్సీలకు ముందస్తు అనుభవం తప్పనిసరి అని స్పష్టం చేసింది.
వారసత్వ పరిరక్షణ, పర్యావరణ నిర్వహణ, ఆధునిక పట్టణ ప్రణాళికలను మిళితం చేసే ఒక బృహుత్తర భవిష్య ప్రణాళికలను రూపొందించడం లక్ష్యాలుగా నిర్ణయించారు. అంతేకాకుండా తిరుమలలో రాబోవు తరాల్లో మరింతగా ఆధ్యాత్మిక, సాంస్కృతిక పవిత్రతను కాపాడటమే ఈ ప్రణాళిక లక్ష్యమని టీడీడీ పేర్కొంది.
సంబంధిత కథనం