AP Cabinet Decisions : ఏపీ కేబినెట్ భేటీ - కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర, వివరాలివే
ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతి నిర్మాణం కోసం ప్రతిపాదించిన అంశాలకు ఆమోదముద్ర పడింది. పోలవరం ఎడమ కాల్వ రీటెండర్‌కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఏపీ కేబినెట్ భేటీ
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం 21 అంశాలపై చర్చించారు. అమరావతి నిర్మాణం కోసం ప్రతిపాదించిన అంశాలకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. మొత్తం 20 ఇంజినీరింగ్ పనులకు రూ.8821 కోట్లు పరిపాలన అనుమతులకు అనుమతి ఇచ్చింది. 25 ఇంజినీరింగ్ పనులు చేపట్టేందుకు నిధుల మంజూరుకు ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.మూడేళ్లలో నిర్మాణాలు పూర్తి చేసేందుకు నిర్ణయించింది.
ఏపీ కేబినెట్ నిర్ణయాలు:
- రాష్ట్రంలోని 475 జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అందించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
- పోలవరం లెఫ్ట్ కెనాల్ పనులకు రీడెండరింగ్ కు కేబినెట్ ఆమోదముద్ర వేసింది.
- రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ తో ఎన్టీపీసీ జాయింట్ వెంచర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
- గ్రామ కంఠం భూముల సర్వే కోసం తీసుకున్న 679 సూపర్ న్యుమరి డిప్యూటీ తహసీల్దార్‌లను మరో రెండేళ్లు కొనసాగించేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
- వరద బాధితులకు స్టాంప్ డ్యూటీ మినహాయింపులు చేస్తూ ఆమోదముద్ర వేసింది.
- జల్ జీవన్ మిషన్‌కు సంబంధించి పనులను కేబినెట్ లో కీలకంగా చర్చ జరిగింది. రీటెండరింగ్ కు పిలవటంతో పాటు… ఒప్పంద గడువు పొడిగించేందుకు కేబినెట్ అనుమతి ఇచ్చింది.