Tirumala: తిరుమలలో భక్తులు ఎందుకు పూలు పెట్టుకోకూడదు? తప్పక ప్రతీ మహిళా తెలుసుకోవాల్సిన కథ ఇది-tirumala every women must know why we should not keep flowers at tirumala or else lord venkateshwara gets angry ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Tirumala: తిరుమలలో భక్తులు ఎందుకు పూలు పెట్టుకోకూడదు? తప్పక ప్రతీ మహిళా తెలుసుకోవాల్సిన కథ ఇది

Tirumala: తిరుమలలో భక్తులు ఎందుకు పూలు పెట్టుకోకూడదు? తప్పక ప్రతీ మహిళా తెలుసుకోవాల్సిన కథ ఇది

Peddinti Sravya HT Telugu

Tirumala: తిరుమల వెంకటేశ్వర స్వామి వారి అలంకరణ సేవ కోసం రోజూ ఎన్నో పుష్పాలని ఉపయోగించడం జరుగుతుంది. స్వామివారికి రకరకాల పూలను అలంకరిస్తూ ఉంటారు. అయితే, తిరుమలలో మాత్రం భక్తులు ఎవరూ కూడా పూలు పెట్టుకోకూడదు.

Tirumala: తిరుమలలో భక్తులు ఎందుకు పూలు పెట్టుకోకూడదు?

చాలా మంది ప్రతి ఏటా తిరుమల వెళ్తూ ఉంటారు. తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని, అనుకున్న పనులు జరుగుతాయని నమ్ముతారు. దేశ విదేశాల నుంచి కూడా ప్రతీ ఏటా చాలా మంది తిరుమల వస్తారు. తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారికి ప్రతిరోజు ప్రత్యేక పూజలుతో పాటుగా అభిషేకాలు, అర్చనలు ఇలా ఎన్నో జరుపుతూ ఉంటారు.

పలు సేవలు కూడా వెంకటేశ్వర స్వామి వారికి చేస్తూ ఉంటారు. ఆ సేవల్లో కూడా భక్తులు పాల్గొంటారు. తిరుమల వెంకటేశ్వర స్వామి వారి అలంకరణ సేవ కోసం రోజూ ఎన్నో పుష్పాలని ఉపయోగించడం జరుగుతుంది. స్వామివారికి రకరకాల పూలను అలంకరిస్తూ ఉంటారు. అయితే, తిరుమలలో మాత్రం భక్తులు ఎవరూ కూడా పూలు పెట్టుకోకూడదు.

ఎందుకు తిరుమలలో స్త్రీలు పూలు పెట్టుకోకూడదు?

ప్రతిరోజు కూడా వెంకటేశ్వర స్వామి వారిని ఎంతో అందంగా అలంకరించి, రకరకాల పుష్పాలను సమర్పిస్తారు. భూవైకుంఠ తిరుమలకి కోట్లాది మంది భక్తులు ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రమే కాకుండా తెలంగాణ, కర్ణాటక వంటి రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉంటారు. స్వామివారికి అర్చనలు, అభిషేకాలు చేస్తూ పుష్పాలని సమర్పిస్తూ ఉంటారు. వివిధ అలంకారాల్లో ఏడుకొండలవారు మనకి దర్శనమిస్తూ ఉంటారు. మహావిష్ణువుని అలంకరణప్రియుడు అని అంటారు.

శ్రీహరిని పుష్ప ప్రియుడని పిలుస్తారు. తిరుమలని పురాణాల ప్రకారం పూలమంటపం అని పిలుస్తారు. శ్రీహరి పుష్పాలంకరణ ప్రియుడు కావడం వలన ఎప్పుడూ కూడా వివిధ రకాల పువ్వులతో ఆయనను అలంకరిస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు, పూలను తాకకూడదని నిబంధన ఉంది. అంతే కాక స్వామి వారు అలంకరణ ప్రియుడు కాబట్టి అక్కడ పూలన్నీ కూడా ఆయనకే చెందాలని, కొండపై పూసిన ప్రతి పువ్వు శ్రీనివాసుడికి చెందుతుందని భక్తులు భావిస్తారు. అందుకని కొండపైన ఎవరూ కూడా పూలు పెట్టుకోరు.

పూల బావిలో వేసే ఆచారం

శ్రీశైలపూర్ణుడు అనే ఒక పూజారి శిష్యుడు వెంకటేశ్వర స్వామిని అలంకరించాల్సిన పువ్వుల్ని అలంకరించుకున్నారు. ఆ రోజు ఏడుకొండలవాడు ఆ పూజారి కలలో కనపడ్డారు. నీ శిష్యుడు పరిమళ ద్రోహం చేశాడని చెప్పారు. విషయం తెలుసుకున్న ఆయన ఎంతో బాధపడ్డాడు. అప్పటినుంచి కూడా పూలను స్వామి పాద సేవకి మాత్రమే అనే నియమం వచ్చింది. స్వామిని అలంకరించిన పూలను పూలబావిలో వేసే ఆచారం వచ్చింది.

నిజానికి గుడికి ఎలా వెళ్లాలి?

అతి సాధారణంగా భక్తులు భగవంతుడు ముందు కనిపించాలి. ఇది గుర్తు చేయడానికి పూలు ధరించకూడదని నియమం వచ్చింది. ఆలయానికి వెళ్ళినప్పుడు ఆడంబరంగా వెళ్ళకూడదు. నిరాడంబరంగానే వెళ్లాలి. అప్పుడే భగవంతునిపై మన మనసు మళ్లుతుంది. ఏకాగ్రత పెట్టగలుగుతాము.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.