Tirumala : తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్-ఈ నెల 23, 24 తేదీల్లో వైకుంఠ ద్వార దర్శన టికెట్లు విడుదల-tirumala ttd key decisions on vaikunta dwara darshan preparations srivani ssd tickets ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirumala : తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్-ఈ నెల 23, 24 తేదీల్లో వైకుంఠ ద్వార దర్శన టికెట్లు విడుదల

Tirumala : తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్-ఈ నెల 23, 24 తేదీల్లో వైకుంఠ ద్వార దర్శన టికెట్లు విడుదల

Bandaru Satyaprasad HT Telugu
Dec 17, 2024 10:39 PM IST

Tirumala Vaikunta Dwara Darshan : తిరుమల శ్రీవారి ఆలయం వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లు టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. వైకుంఠ ద్వార దర్శన టోకెన్లను ఈ నెల 23, 24 తేదీల్లో ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు.

తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్-ఈ నెల 23, 24 తేదీల్లో వైకుంఠ ద్వార దర్శన టికెట్లు విడుదల
తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్-ఈ నెల 23, 24 తేదీల్లో వైకుంఠ ద్వార దర్శన టికెట్లు విడుదల

Tirumala Vaikunta Dwara Darshan : వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 19వ తేది వరకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నారు. వైకుంఠ ద్వార దర్శనాల ఏర్పాట్లపై మంగళవారం సాయంత్రం టీటీడీ ఈవో జె.శ్యామలరావు, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య తిరుమలలోని అన్నమయ్య భవనంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. దర్శన ఏర్పాట్లపై అన్ని విభాగాల అధిపతులతో చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు.

వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై టీటీడీ తీసుకున్న ముఖ్య నిర్ణయాలు

  • డిసెంబర్ 23న ఉదయం 11 గంటలకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి 10 రోజుల శ్రీవాణి టికెట్లు ఆన్ లైన్ లో విడుదల చేస్తారు.
  • డిసెంబర్ 24న ఉదయం 11 గంటలకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి 10 రోజుల ఎస్ఈడీ టికెట్లు ఆన్ లైన్ లో విడుదల‌‌ చేస్తారు.
  • జనవరి 10 నుండి 19 వరకు పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు తిరుపతిలో 8 కేంద్రాలు, తిరుమలలో ఒక కేంద్రంలో ఎస్ఎస్.డి టోకెన్లు కేటాయిస్తాయి.
  • తిరుపతిలో ఎం.ఆర్.పల్లి, జీవకోన, రామా నాయుడు స్కూల్, రామచంద్ర పుష్కరిణీ, ఇందిరా మైదానం, శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్, తిరుమలలోని కౌస్తుభం విశ్రాంతి భవనంలో ఎస్ఎస్.డి టోకెన్ల కేటాయింపు
  • టోకెన్ జారీ కేంద్రాలు వద్ద భక్తులకు అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేయాలని సీఈకి ఆదేశం.
  • టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనాలకు అనుమతి, టోకెన్ లేని భక్తులు తిరుమలకు రావచ్చు. కానీ దర్శన క్యూ లైన్లలోకి అనుమతించరు.
  • వైకుంఠ ఏకాదశి రోజు ఉదయం 4.45 గంటలకు ప్రోటోకాల్ దర్శనాలు ప్రారంభం
  • వైకుంఠ ఏకాదశి రోజున అధిక రద్దీ కారణంగా ఆలయంలో వేదాశీర్వచనం రద్దు
  • వైకుంఠ ఏకాదశి రోజు ఉదయం 9 నుంచి 11 గంటలు వరకు స్వర్ణ రథం
  • వైకుంఠ ద్వాదశి రోజున ఉదయం 5.30 నుండి 6.30 వరకు శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం
  • గోవిందమాల భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శన సదుపాయం ఉండదు

వైకుంఠ ఏకాదశి రోజున టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది సమన్వయంతో తిరుమలలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకోవాలని పోలీసులకు టీటీడీ సూచించింది. ఉదయం 6 నుంచి రాత్రి 12 గంటల వరకు నిరంతరాయంగా అన్న ప్రసాదాలు పంపిణీ చేయాలని కేటరింగ్ అధికారులకు టీటీడీ ఆదేశించింది. టీ, కాఫీ, పాలు, ఉప్మా, చక్కెర పొంగలి, పొంగలి పంపిణీ చేయనున్నారు. లడ్డూ ప్రసాదం కోసం భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా ప్రతిరోజూ 3.50 లక్షల లడ్డూలు అందుబాటులో ఉంచనున్నారు. అదనంగా 3.50 లక్షల లడ్డూలు బఫర్ స్టాక్ ఉంచుకోవాలని టీటీడీ ఆదేశించింది.

Whats_app_banner

సంబంధిత కథనం