Bachhala Malli: అప్పల్లో గాలి శీను.. ఇప్పుడు బచ్చల మల్లి.. పదేళ్లు గుర్తిండిపోయే క్యారెక్టర్: అల్లరి నరేశ్-allari naresh hilarious interview ahead of bachhala malli movie release ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bachhala Malli: అప్పల్లో గాలి శీను.. ఇప్పుడు బచ్చల మల్లి.. పదేళ్లు గుర్తిండిపోయే క్యారెక్టర్: అల్లరి నరేశ్

Bachhala Malli: అప్పల్లో గాలి శీను.. ఇప్పుడు బచ్చల మల్లి.. పదేళ్లు గుర్తిండిపోయే క్యారెక్టర్: అల్లరి నరేశ్

Galeti Rajendra HT Telugu
Dec 17, 2024 08:07 PM IST

Bachhala Malli: నాంది సినిమా తర్వాత ఆ తరహాలో బచ్చల మల్లి సినిమాతో మళ్లీ అల్లరి నరేశ్ ప్రయోగం చేస్తున్నాడు. ఈ నెల 20న ఈ సినిమా థియేటర్లలోకి రాబోతుండగా..

అల్లరి నరేశ్
అల్లరి నరేశ్

హీరో అల్లరి నరేశ్ కెరీర్‌లో తొలిసారి రస్టిక్ లుక్‌‌లో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమయ్యారు. అల్లరి నరేశ్ నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ 'బచ్చల మల్లి' డిసెంబరు 20న థియేటర్లలోకి రాబోతోంది. సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగాదేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. అల్లరి నరేశ్ సరసన అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటించింది. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మించారు.

బచ్చలమల్లి మూవీ రిలీజ్ ముంగిట విలేకరులతో అల్లరి నరేశ్ మాట్లాడారు.

బచ్చలమల్లి కథలో మిమ్మల్ని ఎట్రాక్ట్ చేసిందేంటి?

డైరెక్టర్ సుబ్బు కథ చెప్పినప్పుడు సింగల్ సిట్టింగ్ లోనే ఇది ఓకే అయింది. కథ అంత అద్భుతంగా ఉంది. ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో చాలా వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్ ఇది. ఇందులో హాస్యం తప్ప అన్ని వేరియేషన్స్ వున్నాయి. నాంది తర్వాత డిఫరెంట్ సినిమాలని చేద్దామనుకున్నాను. అలా మంచి కంటెంట్ సినిమాల కోసం చూస్తున్న టైం లో ఈ సినిమా వచ్చింది.

క్యారెక్టర్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది?

గమ్యంలో గాలి శీను ఎలా గుర్తుండిపోయాడో బచ్చల మల్లి కూడా ఓ పదేళ్ళ పాటు అలా గుర్తుండిపోతాడు. క్యారెక్టర్ ఇంపాక్ట్ అలా ఉంటుంది. నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఈ సినిమాలో కొత్తగా ట్రై చేశాను.

మీకు మోస్ట్ ఛాలెంజింగ్ పార్ట్ ఈ సినిమాలో ఉందా?

మా డైరెక్టర్ నడకలో కూడా ఒక మూర్ఖత్వం చూపించాలి అని అడిగారు. కాస్త కొత్తగా ఏడవండి అని చెప్పేవారు( నవ్వుతూ). ప్రతిదీ కొత్తగా చేయాలనే ఉద్దేశంతో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. నా గత సినిమాల బాడీ లాంగ్వేజ్ ఎక్కడ కూడా కనిపించకూడదని చాలా జాగ్రత్తగా పడ్డారు. ఈ సినిమా చూసిన ఐదు నిమిషాల తర్వాత అల్లరి నరేశ్‌ను మర్చిపోయి బచ్చల మల్లినే చూస్తారు.

లుక్ విషయంలో ఏ జాగ్రత్తలు తీసుకున్నారు ?

ఈ కథ 90లో జరుగుతుంది. బచ్చల మల్లి చాలా రెస్టిక్ క్యారెక్టర్. తను ట్రాక్టర్ నడుపుతుంటాడు. తన బాడీ గురించి ఎక్కువ కేర్ తీసుకునే పర్సన్ కాదు. అలాంటి లుక్‌ని తీసుకురావడం కోసం హెయిర్‌కి కాస్త రెడ్డిష్ కలర్ ట్రై చేశాం.

ఇందులో హీరోకి మూర్ఖత్వం ఎక్కువ ఉంటుంది కదా.. మరి దీనికి సంబంధించిన బ్యాక్ స్టోరీ ఏమైనా ఉంటుందా?

ఉంది.. ఫాదర్ అండ్ సన్, మదర్ అండ్ సన్ ఎమోషన్ ఉంటుంది. నన్ను వద్దనుకుంటే నాకు ఎవరు వద్దు అనుకునే క్యారెక్టర్. ఒక క్యారెక్టర్‌తో డిస్కనెక్ట్ అయితే ఇంకా చాప్టర్‌ని క్లోజ్ చేసే క్యారెక్టర్. ఇందులో యాక్షన్ కూడా కథకి తగ్గట్టుగానే ఉంటుంది.

ఇందులో లవ్ స్టోరీ‌కి ఎలాంటి ప్రాధాన్యత ఉంటుంది?

బచ్చల మల్లి జీవితంలోకి కావేరి అనే అమ్మాయి ఎంటర్ అయిన తర్వాత ఆ అమ్మాయి కోసం మారతాడు. ఆ మారే క్రమంలో తాను చేసిన పాత తప్పులన్నీ ఎదురవుతుంటాయి. ఫైనల్‌గా తన ఏ వైపు టర్న్ తీసుకున్నాడు? అనేది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అమృత అయ్యర్ చాలా షటిల్‌గా పెర్ఫార్మ్ చేసింది. తన క్యారెక్టర్ కి మంచి పేరొస్తుంది. ఇందులో రావు రమేష్, అచ్యుత్ కుమార్, వైవాహర్ష, హరితేజ, రోహిణి క్యారెక్టర్స్ కథలో చాలా కీలకం.

మీ నుంచి కామెడీ సినిమాలు తగ్గుతున్నాయి కదా ?

కామెడీ నా స్ట్రెంత్. ఇండస్ట్రీలో ఇంత లాంగ్ కెరీర్ ఉందంటే దానికి కారణం కామెడీనే. అది నా హోమ్ గ్రౌండ్. కామెడీని వదలను. మధ్యమధ్యలో బ్యాలెన్స్ చేయడానికి ఇలాంటి సీరియస్ కంటెంట్ ఫిలిమ్స్ చేస్తాను. డిఫరెంట్ సినిమాలని చేయాలనేదే నా ప్రయత్నం.

సుడిగాడు 2 ఎంతవరకు వచ్చింది?

రైటింగ్ జరుగుతుంది. ఈసారి పాన్ ఇండియా వెళ్తున్నాం. కాబట్టి ఇంకాస్త టైం పడుతుంది.

Whats_app_banner