తెలుగు న్యూస్ / ఫోటో /
AP Heavy Rains : బలపడుతున్న అల్పపీడనం, రానున్న 4 రోజులు ఏపీకి భారీ వర్ష సూచన-ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
AP Heavy Rains : నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీలో రానున్న నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. రాగల రెండు రోజుల్లో అల్పపీడనం మరింత బలపడి తమిళనాడు తీరానికి చేరుకుంటుందని ఐఎండీ అంచనా వేసింది.మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
(1 / 7)
ఏపీని వరుణుడు వదలడంలేదు. బంగాళాఖాతంలో వరుసగా అల్పపీడనాలు రైతులను పరుగులు పెట్టిస్తున్నాయి. పంటల కోతల సమయంలో కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
(2 / 7)
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీలో రానున్న నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
(3 / 7)
నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం క్రమంలో బలపడుతోంది. దీనికి అనుబంధంగా ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాగల రెండు రోజుల్లో అల్పపీడనం మరింత బలపడి తమిళనాడు తీరానికి చేరుకుంటుందని ఐఎండీ అంచనా వేసింది.
(4 / 7)
అలప్పీడనం ప్రభావతంతో రానున్న నాలుగు రోజులపాటు ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు నమోదవుతాయని ఐఎండీ తెలిపింది. నేడు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.
(5 / 7)
రానున్న రెండు రోజుల పాటు ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
(6 / 7)
శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, నెల్లూరు, కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
(7 / 7)
కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. కృష్ణ, బాపట్ల, ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. దక్షిణ కోస్తా జిల్లాల్లో మత్స్యకారులు వేట నిషేధించినట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఇతర గ్యాలరీలు