RRR Behind and Beyond: ‘ఆర్‌ఆర్‌ఆర్: బిహైండ్ అండ్ బియాండ్’ డాక్యుమెంటరీ ట్రైలర్ రిలీజ్.. నమ్మలేని విధంగా సీన్స్
RRR Behind and Beyond: ఆర్ఆర్‌ఆర్ సినిమాతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి రాజమౌళి చాటిచెప్పాడు. ఈ మూవీ తెరపై అందర్నీ ఆకట్టుకునేలా రావడం వెనుక.. ఎంత కష్టం ఉందో ప్రేక్షకులకి చూపించడానికి ఒక డాక్యుమెంటరీ రాబోతోంది.
సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్: బిహైండ్ అండ్ బియాండ్’ డాక్యుమెంటరీ ట్రైలర్ మంగళవారం రిలీజ్ అయ్యింది. రాజమౌళి డైరెక్షన్‌లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన ‘ఆర్ఆర్ఆర్’ ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందింది.
డిసెంబరు 20న థియేటర్లలోకి
ఈ పీరియాడిక్ ఫిక్షన్ మూవీని ఎలా తెరకెక్కించారు? తెర వెనుక చిత్ర యూనిట్ పడిన కష్టాన్ని ‘ఆర్‌ఆర్‌ఆర్: బిహైండ్ అండ్ బియాండ్’ డాక్యుమెంటరీలో చూపించబోతున్నారు. డిసెంబరు 20న ఈ డాక్యుమెంటరీ థియేటర్లలో రిలీజ్‌కానుంది.
డీవీవీ ఎంటర్‌టైనమెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీలో.. జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌తో పాటు అలియా భట్, ఓలివియా మోరిస్, సముద్రఖని, అజయ్‌దేవ్‌గణ్, శ్రియ తదితరులు నటించారు. 2022 మార్చిలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలవడమే కాదు ఆస్కార్‌ను కూడా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
యాక్టర్లు ఏమన్నారంటే?
అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమాని నిలబెట్టిన ఆర్ఆర్‌ఆర్ మూవీ షూటింగ్‌లో టీమ్ ఎలా కష్టపడింది? యాక్షన్ సీన్స్ వెనుక టెక్నీషియన్ల కష్టాన్ని కూడా ఈ డాక్యుమెంటరీలో చూపించారు. అలానే జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో పాటు రాజమౌళి, అలియా భట్ ఈ సినిమాలో పనిచేస్తున్నప్పుడు తమ ఎక్స్‌పీరియన్స్‌ను షేర్ చేసుకున్నారు. వాటిని కూడా ఈ డాక్యుమెంటరీలో చూపించబోతున్నారు.
యాక్షన్ సీన్స్ వెనుక కష్టం
1920 నేపథ్యంలో సాగే కథగా ఆర్ఆర్‌ఆర్‌ను చూపించి రాజమౌళి.. అప్పట్లో బ్రిటీషర్ల అరాచకాల్ని గవర్నర్ స్కాట్ దొర ద్వారా కళ్లకి కట్టినట్లు చూపించారు. అలానే గోండు జాతికి చెందిన చిన్నారిని కాపాడుకోవడానికి శత్రుదుర్భేద్యమైన బ్రిటిష్ కోటని దాటుకుని భీమ్ వెళ్లడాన్ని చాలా ఇంట్రస్టింగ్‌గా చూపించారు. మరీ ముఖ్యంగా.. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య సన్నివేశాలు ప్రేక్షకుల్ని కట్టిపడేశాయి. ఇలా ప్రతి సీన్ వెనుక టెక్నీషియన్లు, యాక్టర్ల కష్టాన్ని ఈ డాక్యుమెంటరీలో చూపించబోతున్నారు.