The Lion King Mufasa: ముఫాసాతో మహేష్ బాబుకి పోలిక తెచ్చిన సితార.. ప్రీక్వెల్‌పై పెరిగిపోతున్న అంచనాలు
The Lion King Mufasa: ముఫాసా: ది లయన్ కింగ్ మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబరు 20న విడుదలకి సిద్ధమవుతోంది. ఈ సినిమాలో ముఫాసాకి మహేష్ బాబు డబ్బింగ్ చెప్పగా..
ఐదేళ్ల క్రితం వచ్చిన ‘ది లయన్ కింగ్’ ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. ఇప్పుడు ఈ సినిమాకి ప్రీక్వెల్‌గా ‘ముఫాసా: ది లయన్ కింగ్’ రాబోతోంది. ప్రపంచవ్యాప్తంగా డిసెంబరు 20న థియేటర్లలోకి రాబోతున్న ఈ హాలీవుడ్ మూవీకి మహేష్ బాబు డబ్బింగ్ చెప్పడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.
జగపతి బాబు ప్లేస్‌లో సత్యదేవ్
2019లో వచ్చిన ‘ది లయన్ కింగ్’లో సింబాకి నాని డబ్బింగ్ చెప్పిన విషయం తెలిసిందే. బ్రహ్మానందం, అలీ డబ్బింగ్ బంధం ‘ముఫాసా: ది లయన్ కింగ్’లో కూడా కొనసాగనుండగా.. స్కార్‌కి జగపతి బాబు ప్లేస్‌లో సత్యదేవ్ డబ్బింగ్ చెప్పబోతున్నాడు.
ముఫాసాలానే నాన్న కూడా
ముఫాసా పాత్రకి మహేష్ బాబు డబ్బింగ్ చెప్పడంపై.. ఆయన కుమార్తె సితార స్పందించింది. ‘‘ముఫాసా పాత్రకి నాన్న డబ్బింగ్ చెప్పడం చాలా థ్రిల్లింగ్‌గా.. గర్వంగా ఉంది. ‘ముఫాసా: ది లయన్ కింగ్’కి నాన్న డబ్బింగ్ చెప్పబోతున్నాడని తెలియగానే చాలా హ్యాపీగా అనిపించింది. చాలా ప్రాక్టీస్ చేశారు.. ముఫాసా పాత్రకి నాన్న వాయిస్ బాగా మ్యాచ్ అయ్యింది. నిజజీవితంలోనూ పిల్లలపై కేరింగ్ విషయంలో ముఫాసాకి నాన్నకు దగ్గర పోలికలున్నాయి. ట్రైలర్ చూసినప్పటి నుంచి ఈ మూవీ ఎప్పుడొస్తుందా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అని సితార చెప్పుకొచ్చింది.
మహేష్ బాబు కంటే ముందే సితార
వాస్తవానికి మహేష్ బాబు కంటే ముందే డిస్నీ సంస్థతో సితార కలిసి పనిచేసింది. ప్రోజెన్ మూవీ కోసం సితార పనిచేయగా.. ఇప్పుడు ‘ముఫాసా: ది లయన్ కింగ్’ కోసం మహేష్ బాబు పనిచేశారు. దాంతో నీ కంటే ముందు నేనే డిస్నీతో కలిసి పనిచేశానని మహేష్ బాబుని సితార ఇంట్లో ఆటపట్టిస్తోందట. అయితే.. మూవీలో డబ్బింగ్ చెప్పినా ప్రమోషన్స్‌లో మాత్రం మహేష్ బాబు ఎక్కడా కనిపించడం లేదు. కానీ నమ్రత శిరోద్కర్ మాత్రం ఇటీవల ‘ముఫాసా’ ఈవెంట్‌లో సందడి చేసింది.
రాజమౌళి సినిమాతో బిజీ
ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో నటించేందుకు మహేష్ బాబు సిద్ధమవుతున్నారు. వచ్చే ఏడాది నుంచి ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ ఏడాది గుంటూరు కారంతో థియేటర్లలో సందడి చేసిన మహేష్ బాబు.. మళ్లీ 2-3 ఏళ్ల తర్వాతే థియేటర్లలో కనిపించే అవకాశం ఉంది. దాంతో ‘ముఫాసా: ది లయన్ కింగ్’లో మహేష్ బాబు కనిపించకపోయినా అతను డబ్బింగ్ అభిమానుల్ని అలరించనుంది.
టాపిక్