Samyuktha Trolls: పుష్ప 2లో అల్లు అర్జున్ నటనని అతిగా పొగడబోయి బుక్కైపోయిన తమిళ్ నటి.. నెటిజన్లు ఓ రేంజ్‌లో ట్రోలింగ్
Pushpa 2 The Rule: పుష్ప 2 మూవీలో అల్లు అర్జున్ నటనని పొగడబోయి సంయుక్త నెటిజన్లకి దొరికిపోయింది. దాంతో ఇంకా ఏ కాలంలో ఉన్నావ్ తల్లీ? అంటూ సెటైర్లు వేస్తున్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప2: ది రూల్ మూవీ జోరు గత 12 రోజుల నుంచి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ సినిమాను వీక్షిస్తున్న సెలెబ్రిటీలతో పాటు నెటిజన్లు కూడా సోషల్ మీడియాలో తమ స్పందనని తెలియజేస్తున్నారు.
రూ.1400 కోట్లు రాబట్టిన పుష్ప 2
పుష్ప2 మూవీ తెలుగు, తమిళ్, కన్నడ, బెంగాలీ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ అవగా.. హిందీ, తెలుగు, తమిళ్‌లో భారీగా వసూళ్లు రాబడుతోంది. ఇప్పటికే పుష్ప 2 మూవీ వరల్డ్‌వైడ్‌గా రూ.1400 కోట్లు కలెక్ట్ చేసింది.
పుష్ప 2లో అల్లు అర్జున్ నటనపై ఇప్పటికే పలువురు సెలెబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపించగా.. తాజాగా తమిళ్ నటి సంయుక్త కూడా జాతర సీన్‌లో బన్నీ నటనపై కితాబిచ్చింది. అయితే.. ఈ క్రమంలో సంయుక్త చేసిన ట్వీట్‌లోని ఒక పాయింట్‌ను పట్టుకున్న నెటిజన్లు.. ఆమెపై ఓ రేంజ్‌లో ట్రోలింగ్ చేస్తున్నారు.
జాతర సీన్‌లో మహిళకి పూనకాలు
ఫోనిక్స్ మాల్‌లో పుష్ప2 సినిమా చూస్తున్నప్పుడు జాతర సీన్ టైమ్‌లో తన పక్కన కూర్చొన్న ఓ మహిళ కూడా పూనకాలు వచ్చి ఊగిపోయిందట. ఆమె భర్త కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నా.. ఆమె వెనక్కి తగ్గకపోవడంతో భయం వేసి అక్కడి నుంచి లేచి పది రూపాయల టికెట్ వాళ్లు కూర్చొనే చోట కూర్చొన్నానని సంయుక్త రాసుకొచ్చింది. ఇక్కడే సంయుక్త నెటిజన్లకి దొరికిపోయింది.
రూ.10 టికెట్ ఎక్కడ?
ఫోనిక్స్ మాల్ ఏంది? రూ.10 టికెట్ ఏంది? ఇదేదీ నమ్మేలా లేదంటూ నెటిజన్లు ట్రోలింగ్ మొదలెట్టారు. అసలు ఏ థియేటర్‌లో రూ.10 టికెట్లు ఉన్నాయి? ఇంకా ఏ కాలంలో నువ్వు ఉన్నావ్ సంయుక్తా? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. పుష్ప 2 రిలీజ్‌కి ముందు టికెట్ రేట్లుపై భారీగా సోషల్ మీడియాలో చర్చ జరిగిన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో పుష్ప టికెట్ ధర రూ.800-1500 వరకూ పలికింది.