తెలుగు న్యూస్ / ఫోటో /
Baba Vanga: 2025 లో వినాశనం తప్పదా? .. బాబా వంగా జోస్యం నిజమవుతుందా?.. ఎవరీ బాబా వంగా?
- Baba Vanga: బాబా వంగా.. గత కొన్ని రోజులుగా ఈ పేరు మారుమోగిపోతోంది. గతంలో బాబా వంగా భవిష్యత్తు గురించి చెప్పిన పలు జోస్యాలు నిజమయ్యాయి. 2025 లో జరగబోయే అనర్థాల గురించి ఆయన చెప్పినవి వింటే వెన్నులో వణుకు రావడం ఖాయం.
- Baba Vanga: బాబా వంగా.. గత కొన్ని రోజులుగా ఈ పేరు మారుమోగిపోతోంది. గతంలో బాబా వంగా భవిష్యత్తు గురించి చెప్పిన పలు జోస్యాలు నిజమయ్యాయి. 2025 లో జరగబోయే అనర్థాల గురించి ఆయన చెప్పినవి వింటే వెన్నులో వణుకు రావడం ఖాయం.
(1 / 8)
మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం ప్రారంభం కాబోతోంది. ఎన్నో ఆశలతో 2025 కు స్వాగతం చెప్పబోతున్నాం. అయితే, మన ఆశలను నీరు కార్చేలా, మనల్ని భయభ్రాంతులకు గురి చేసేలా 2025 సంవత్సరం గురించి బాబా వంగ అంచనాలు ఉన్నాయి. గతంలో ఆయన అంచనాలు చాలా నిజమయ్యాయి. పలు వినాశనాలను ఆయన ముందే అంచనా వేయగలిగారు. ఇంతకీ ఎవరీ బాబా వంగా?
(2 / 8)
బాబా వంగా గతంలో చెప్పిన ఎన్నో అంచనాలు నిజమయ్యాయి. భవిష్యత్తులో జరుగుతాయని ఆయన చెప్పినవి నిజంగా జరిగాయి. 2025 సంవత్సరానికి సంబంధించి బాబా వంగా చెప్పిన అంచనాలపై ఇప్పుడు తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. 2025 సంవత్సరం ఎన్నో ప్రమాదాలతో నిండి ఉంటుందని ఆయన చెప్పారు.
(3 / 8)
బాబా వంగా 1911లో బల్గేరియాలో పాండేవా దిమిత్రోవా గా జన్మించాడు. 12 ఏళ్ల వయసులో పెద్ద తుఫానులో కంటిచూపు కోల్పోయాడు. పెళ్లి చేసుకుని చాలా కాలం కనిపించకుండా పోయాడు. చాన్నాళ్లు వెతికిన తరువాత అతని కుటుంబ సభ్యులు అతన్ని కనుగొన్నారు. తన మరణం సహా అతడు చెప్పినవి వివిధ సమయాల్లో నిజమని రుజువైంది. అతను 1996 లో మరణించాడు.
(4 / 8)
ఈ రోజుల్లో ప్రపంచమంతా డిజిటల్ కేంద్రంగా జీవిస్తోంది. కమ్యూనికేషన్ వ్యవస్థలు చాలా అవసరం. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ వ్యవస్థపై అనేక దాడులు జరుగుతాయని బాబా వంగ జోస్యం చెప్పారు. ఇంటర్నెట్ పై అతిపెద్ద యుద్ధం 2025 లో జరుగుతుందని ఆయన అంచనా వేశారు.
(5 / 8)
2025లో భూమికి చెందని గ్రహాంతర జీవులు భూమిపైకి వస్తాయని బాబా వంగ జోస్యం చెప్పారు. గ్రహాంతరవాసులు భూమిపైకి వచ్చి తమ ఉనికిని చాటుకునే పరిస్థితులు తలెత్తుతాయని అంచనా వేశారు.
(6 / 8)
2025 సంవత్సరానికి సంబంధించి బాబా వంగ అంచనాలో ఇదొక్కటే సానుకూలాంశం. 2025 నాటికి వైద్యరంగంలో భారీ పురోగతి ఉంటుందని, కృత్రిమంగా మానవ అవయవాలను తయారు చేయడం సాధ్యమవుతుందని బాబా వంగా అంచనా వేశారు. అవయవ మార్పిడి చాలా సులభమవుతుందన్నారు.
(7 / 8)
2025 నాటికి వాతావరణ మార్పుల ప్రభావం ఎక్కువ అవుతుందని, అధిక సంఖ్యలో ప్రకృతి విపత్తులు చోటు చేసుకుంటాయని బాబా వంగా జోస్యం చెప్పారు. శీతోష్ణస్థితిలో భారీ మార్పులు ఉండవచ్చని, మన భూమి కక్ష్యలో మార్పు వస్తుందని, ఇది పెద్ద విపత్తులకు దారితీస్తుందని బాబా వంగ అంచనా వేశారు.
ఇతర గ్యాలరీలు