AP Liquor Bar Auctions : ఏపీలో 53 బార్ల వేలానికి నోటిఫికేషన్, నేటి నుంచి దరఖాస్తులు-ap liquor bar auction 53 stores online application process started premium stores process ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ap Liquor Bar Auctions : ఏపీలో 53 బార్ల వేలానికి నోటిఫికేషన్, నేటి నుంచి దరఖాస్తులు

AP Liquor Bar Auctions : ఏపీలో 53 బార్ల వేలానికి నోటిఫికేషన్, నేటి నుంచి దరఖాస్తులు

Dec 17, 2024, 03:30 PM IST Bandaru Satyaprasad
Dec 17, 2024, 03:01 PM , IST

AP Liquor Bar Auctions : ఏపీలో ప్రైవేట్ మద్యం పాలసీ అమల్లో ఉన్న విషయం తెలిసిందే. ఎక్సైజ్ శాఖ తాజాగా 53 బార్ల వేలం కోసం రీనోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి ఆఫ్ లైన్ లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. డిసెంబర్ 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఏపీలో ప్రైవేట్ మద్యం పాలసీ అమల్లో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవలె ప్రైవేట్ మద్యం దుకాణాలను లక్కీ డ్రా రూపంలో కేటాయించారు. నాణ్యమైన లిక్కర్ అందుబాటులోకి రావడంతో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఎక్సైజ్ శాఖ తాజాగా 53 బార్ల వేలం కోసం రీనోటిఫికేషన్ విడుదల చేసింది.

(1 / 6)

ఈ నోటిఫికేషన్ ప్రకారం రాష్ట్రంలోని 53 బార్లకు డిసెంబర్ 17 నుంచి ఆన్ లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. డిసెంబర్ 22 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది.  బార్ల వేలం కోసం వచ్చిన దరఖాస్తులను డిసెంబర్ 23న పరిశీలిస్తారు. 

(2 / 6)

డిసెంబర్ 24వ తేదీ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ వేలం నిర్వహిస్తారు. వేలంలో బార్ దక్కించుకున్న వారికి ఎక్సైజ్ అధికారులు లైసెన్సులు జారీ చేస్తారు. గతంలో ఒకసారి 53 బార్ల వేలం కోసం నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే ప్రభుత్వం గత నోటిఫికేషన్ ను రద్దు చేసి తాజాగా రీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 

(3 / 6)

ఈ బార్లకు లైసెన్స్‌ గడువు 2025 ఆగస్టు వరకు ఉంటుందని ఎక్సైజ్ శాఖ తెలిపింది. గత పాలసీ ప్రకారం ఈ బార్లకు సంబంధించి దరఖాస్తు ఫీజులు భారీగా ఉన్నాయి. 50,000 జనాభా వరకు ఉన్న ప్రాంతాలల్లో బార్ల దరఖాస్తు ఫీజు రూ.5 లక్షలు, 50,000 నుంచి 5 లక్షల మధ్య జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.7.5 లక్షలు, 5 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో అప్లికేషన్ ఫీజు రూ.10 లక్షలు. దరఖాస్తు ఫీజు నాన్ రిఫండబుల్. 

(4 / 6)

రాష్ట్రంలోని ప్రీమియం లిక్కర్ స్టోర్లకు సంబంధించి ప్రక్రియ కొనసాగుతుంది. ప్రీమియం స్టోర్ల ఏర్పాటుకు అనుమతిస్తూ  ఇటీవల ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 12 ప్రీమియం స్టోర్ల ఏర్పాటు చేయనున్నారు. 

(5 / 6)

ప్రీమియం స్టోర్లను మున్సిపల్‌ కార్పొరేషన్లు, ప్రధాన పట్టణాల్లో ఏర్పాటు చేస్తారు. వీటికి దరఖాస్తు ఫీజు రూ.15 లక్షలుగా నిర్ణయించారు. ఈ స్టోర్లకు దరఖాస్తులు ఆఫ్‌లైన్‌లో అందజేయాల్సి ఉంటుంది. ఈ ప్రీమియం స్టోర్ల లైసెన్స్‌ ఫీజు ఏడాదికి రూ.కోటి ఉంటుంది. ప్రతి ఏటా 10 శాతం చొప్పున ఫీజు పెంచుతారు.  ఈ స్టోర్లకు ఐదేళ్లకు ఒకేసారి లైసెన్సులు జారీ చేస్తారు.  

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు