NCHM JEE 2025: హోటల్ మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశానికి జాతీయ స్థాయి ఎంట్రన్స్ టెస్ట్; ఇలా అప్లై చేసుకోండి
NCHM JEE 2025: ఎన్సీహెచ్ఎం జేఈఈ 2025 కోసం రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. ఆసక్తి , అర్హత ఉన్న అభ్యర్థులు ఎన్సీహెచ్ఎం జేఈఈ 2025 అధికారిక వెబ్ సైట్ nchm2025.ntaonline.in ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఈ పరీక్షను ఎన్టీఏ నిర్వహిస్తోంది.
NCHM JEE 2025: ఎన్సీహెచ్ఎం జేఈఈ 2025 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఈ నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (NCHM JEE 2025) కు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఎన్టీఏ పరీక్షల అధికారిక వెబ్సైట్ exams.nta.ac.in ద్వారా కానీ, nchm2025.ntaonline.in ద్వారా కానీ దరఖాస్తు చేసుకోవచ్చు.
ఫిబ్రవరి 15 వరకు..
2024 డిసెంబర్ 16 న రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తుకు చివరి తేదీ 2025 ఫిబ్రవరి 15. పేమెంట్ విండో కూడా 2025 ఫిబ్రవరి 15తో ముగుస్తుంది. అధికారిక ప్రకటన ప్రకారం కరెక్షన్ విండో ఫిబ్రవరి 17న ప్రారంభమై 2025 ఫిబ్రవరి 20న ముగుస్తుంది. నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (NCHM JEE 2025) 2025 ఏప్రిల్ 27న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సింగిల్ షిఫ్ట్ లో జరగనుంది. పరీక్ష పత్రంలో 200 ప్రశ్నలు ఉంటాయని, ప్రశ్నపత్రం మాధ్యమం ఇంగ్లిష్, హిందీలో మాత్రమే ఉంటుందని తెలిపారు.
ఈ విద్యార్థులు అర్హులు..
గుర్తింపు పొందిన ఎడ్యుకేషనల్ బోర్డ్ నుంచి 10+2 విధానంలో సీనియర్ సెకండరీ ఎగ్జామినేషన్ లేదా ఇంగ్లిష్ ఒక సబ్జెక్టుగా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అర్హత పరీక్షలో ఇంగ్లిష్ సబ్జెక్టుగా (కోర్/ఎలక్టివ్/ఫంక్షనల్) ఉత్తీర్ణులై ఉండాలి.
ఇలా అప్లై చేసుకోండి..
ఎన్సీహెచ్ఎం జేఈఈ-2025 కోసం ఆన్ లైన్ లో దరఖాస్తు విధానం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వండి.
- అధికారిక వెబ్సైట్ nchm2025.ntaonline.in ను సందర్శించండి.
- రిజిస్ట్రేషన్ లింక్ పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ వివరాలు ఎంటర్ చేయాలి.
- ఆ తరువాత అకౌంట్ లోకి లాగిన్ అవ్వాలి.
- అప్లికేషన్ ఫామ్ నింపి అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- సబ్మిట్ పై క్లిక్ చేసి పేజీని డౌన్ లోడ్ చేసుకోండి.
- తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని భద్రపరచండి.
దరఖాస్తు ఫీజు
సెంట్రల్ లిస్ట్ ప్రకారం జనరల్ (యూఆర్) / ఓబీసీ-(ఎన్సీఎల్)కు రూ.1000, జెనరల్-ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి రూ.700, ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు, థర్డ్ జెండర్లకు రూ.450 చెల్లించాలి. క్రెడిట్ కార్డు/ డెబిట్ కార్డు (మాస్టర్/వీసా కార్డు మినహా)/నెట్ బ్యాంకింగ్/యూపీఐ/వాలెట్ ద్వారా చెల్లించవచ్చు.