TG Inter Exams 2025 : పరీక్షలంటే పిల్లలు భయపడుతున్నారా.. అయితే ఈ నంబర్‌కు కాల్ చేయండి!
TG Inter Exams 2025 : ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 5 నుంచి 25 వరకు పరీక్షలు జరగనున్నాయి. దీంతో చాలామంది విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నారు. టీచర్లు, తల్లిదండ్రుల అంచనాలను అందుకోవాలని టెన్షన్ పడుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల ఒత్తిడిని తగ్గించడానికి టెలి మానస్ కృషిచేస్తోంది.
పరీక్షల కాలం ప్రారంభం అవుతోంది. ముఖ్యంగా కొత్త సంవత్సరంలో తెలంగాణ ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. వీటికి సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. దీంతో విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నారు. మరికొందరు భయపడుతున్నారు. టీచర్లు, పేరెంట్స్ ఆశించిన స్థాయిలో మార్కులు రావేమోనని కొందరు, ఫెయిల్ అవుతాం కావొచ్చని మరికొందరు విద్యార్థులు భయాందోళన చెందుతున్నారు. అలాంటి విద్యార్థులకు టెలి మానస్ మనో ధైర్యాన్ని ఇస్తోంది.
10.ముఖ్యమైన అంశాలు..
1.టెలిమానస్ పేరుతో 24 గంటల పాటు సేవలను అందిస్తున్నారు.
2.విద్యార్థుల్లో ఒత్తిడి, భయం తొలగించుకోవడానికి, మానసిక ఆరోగ్య సమస్యలను పరిష్కరించుకోవడానికి, కెరీర్ గురించి తెలుసుకోవడానికి, ఆత్మవిశ్వాసం పెంపొందించు కునేందుకునేందుకు టెలి మానస్ సాయపడుతోంది.
3.సామాజిక మాధ్యమాలను ఎలా దూరం పెట్టాలి అనే అంశాలపై టెలిమానస్ టోల్ ఫ్రీ నెంబరు ద్వారా నిపుణులు సలహాలు సూచనలు ఇస్తున్నారు.
4.టెలి మానస్ ప్రతినిధులు అన్ని సమస్యలను ఓపికగా విని సమాధానాలిస్తారు.
5.స్టడీ ప్లాన్, టైమ్ మేనేజ్‌మెంట్, ఒత్తిడి నియంత్రణ అంశాల్లో సాయం చేస్తారు.
6.విద్యార్థుల్లో ఒత్తిడి, భయాందోళన, నిద్రలేమి వంటి సమస్యలకు సత్వర సహాయం అందిస్తారు.
7.పోటీ పరీక్షల ప్రిపర్ అయ్యే వారిలోనూ మానసిక స్థిరత్వాన్ని పెంపొందిస్తారు. పరీక్షల ఫోబియాను దూరం చేసి ధైర్యాన్ని నింపుతారు.
8.విద్యార్థులకు ఎలాంటి మానసిక సమస్య ఉన్న టెలి మానస్ టోల్ ఫ్రీ నెంబరు.. 14416 కు కాల్ చేయొచ్చు.
9.పిల్లలు పరీక్షల్లో పాస్ అయినా.. ఫెయిల్ అయినా ఒకేలా ఉండాలని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మార్కుల విషయంలో ఇతర విద్యార్థులతో పొల్చొద్దని సూచిస్తున్నారు.
10.విద్యార్థులు చదివిన అంశాలను ఒకటికి రెండు, మూడు సార్లు రివిజన్ చేసుకోవాలి. గత పరీక్షల మాదిరి ప్రశ్నపత్రాల ఆధారంగా చదువుకోవాలి. మానసిక ఒత్తిడితో ఒంటరిగా ఉండే పిల్లలు తమ సమస్యను వెంటనే తల్లిదండ్రులకు, స్నేహితులకు చెప్పి ఒత్తిడిని దూరం చేసుకోవాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ఇలా..
ఫస్ట్ ఇయర్..
05-03-2025 - సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1
07-03-2025 - ఇంగ్లిష్ పేపర్-1
11-03-2025 - గణితం పేపర్-1ఏ; బోటనీ పేపర్-1; పొలిటికల్ సైన్స్ పేపర్-1
13-03-2025 - గణితం పేపర్ -2బి; జువాలజీ పేపర్-1; హిస్టరీ పేపర్-1
17-03-2025 - ఫిజిక్స్ పేపర్-1; ఎకనామిక్స్ పేపర్-1
19-03-2025 - కెమిస్ట్రీ పేపర్-1; కామర్స్ పేపర్-1
21-03-2025 - పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1; బ్రిడ్జ్ కోర్సు గణితం పేపర్-1 (బైపీసీ విద్యార్థులకు)
24-03-2025 - మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-1; జాగ్రఫీ పేపర్-1
సెకెండ్ ఇయర్..
06-03-2025 - సెంకడ్ లాంగ్వేజ్ పేపర్-2
10-03-2025 - ఇంగ్లిష్ పేపర్-2
12-03-2025 - గణితం పేపర్-2ఏ; బోటనీ పేపర్-2; పొలిటికల్ సైన్స్ పేపర్-2
15-03-2025 - గణితం పేపర్ -2బి; జువాలజీ పేపర్-2; హిస్టరీ పేపర్-2
18-03-2025 - ఫిజిక్స్ పేపర్-2; ఎకనామిక్స్ పేపర్-2
20-03-2025 - కెమిస్ట్రీ పేపర్-2; కామర్స్ పేపర్-2
22-03-2025 - పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-2; బ్రిడ్జ్ కోర్సు గణితం పేపర్-2 (బైపీసీ విద్యార్థులకు)
25-03-2025 - మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-2; జాగ్రఫీ పేపర్-2