Nithiin Robinhood: రాబిన్‌హుడ్ రిలీజ్ డేట్ మారింది - సంక్రాంతికి కూడా నితిన్ రావడం అనుమానమే!
Nithiin Robinhood: నితిన్ రాబిన్‌హుడ్ క్రిస్మస్ రేసు నుంచి తప్పుకున్నది. డిసెంబర్ 25న రిలీజ్ కావాల్సిన ఈ మూవీని వాయిదా వేస్తోన్నట్లు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. రాబిన్‌హుడ్ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది.
Nithiin Robinhood: నితిన్ రాబిన్‌హుడ్ రిలీజ్ డేట్ మారింది. క్రిస్మర్ రేసు నుంచి ఈ మూవీ తప్పుకున్నది. ఈ సినిమా రిలీజ్ వాయిదాపడినట్లు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఆదివారం అఫీషియల్‌గా ప్రకటించింది. త్వరలో కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తామని వెల్లడించింది.
శ్రీలీల హీరోయిన్...
రాబిన్ హుడ్ సినిమాలో నితిన్‌కు జోడీగా శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తోన్నాడు. భీష్మ సక్సెస్ తర్వాత నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుముల కాంబోలో వస్తోన్న సెకండ్ మూవీ ఇది. రాబిన్‌హుడ్ మూవీని డిసెంబర్ 25న రిలీజ్ చేయబోతున్నట్లు చాలా రోజుల క్రితమే మేకర్స్ ప్రకటించారు.
అనుకున్న టైమ్‌కే రాబిన్ హుడ్ థియేటర్లలోకి వస్తోందని ఎదురుచూసిన ఫ్యాన్స్‌కు పోస్ట్‌పోన్ ప్రకటనతో మేకర్స్ ట్విస్ట్ ఇచ్చారు. షూటింగ్‌తో పాటు పోస్ట్‌ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతోనే ఈ సినిమా రిలీజ్ వాయిదాపడినట్లు ప్రచారం జరుగుతోంది.
మర్చిపోలేని ఎక్స్‌పీరియన్స్...
అనివార్య కారణాల వల్ల రాబిన్‌హుడ్‌ను వాయిదావేయాల్సివచ్చిందని మైత్రీ మూవీ మేకర్స్ వెల్లడించింది. ఎదురుచూపులకు ఏ మాత్రం తగ్గకుండా సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుందని, ఎప్పుడొచ్చిన ఆడియెన్స్‌కు మర్చిపోలేని థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను రాబిన్‌హుడ్ అందిస్తుందని మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు పేర్కొన్నారు.
సంక్రాంతికి డౌటే...
క్రిస్మస్ బదులుగా సంక్రాంతికి రాబిన్ హుడ్‌ను రిలీజ్ చేస్తే బాగుంటుందని నిర్మాతలను నితిన్ కోరినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే సంక్రాంతికి రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, బాలకృష్ణ డాకు మహారాజ్, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.
మూడు పెద్ద సినిమాలే కావడంతో థియేటర్ల సమస్య నెలకొనే అవకాశం ఉండటంతో నితిన్ నిర్ణయాన్ని నిర్మాతలు వ్యతిరేకిస్తోన్నట్లు ప్రచారం జరుగుతోంది. జనవరి నెలాఖరున లేదా ఫిబ్రవరి ప్రథమార్థంలో రాబిన్‌హుడ్‌ను రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
భీష్మ తర్వాత...
యాక్షన్ లవ్ ఎంటర్‌టైనర్‌గా రాబిన్‌హుడ్ మూవీ తెరకెక్కుతోంది. ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ తర్వాత నితిన్, శ్రీలీల ఈ మూవీలో మరోసారి జోడీగా కనిపించబోతున్నారు. నితిన్ హిట్టు అనే మాట విని చాలా కాలమైంది. భీష్మ తర్వాత అతడు నటించిన రంగ్ దే, చెక్, మాచర్ల నియోజకవర్గంతో పాటు ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలు డిజాస్టర్స్‌గా నిలిచాయి.
రాబిన్‌హుడ్‌తోనే మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని నితిన్ భావిస్తోన్నాడు. రాబిన్‌హుడ్ సినిమాలో ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నిర్ గెస్ట్ రోల్‌లో కనిపించబోతున్నాడు. రాబిన్‌హుడ్‌కు జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తోన్నాడు.