Brahmamudi September 23rd Episode: కావ్యపై మర్డర్ అటెంప్ట్ - కళావతి తన భార్య కాదన్న రాజ్ - అపర్ణ ప్లాన్ సక్సెస్
Brahmamudi : బ్రహ్మముడి సెప్టెంబర్ 23 ఎపిసోడ్‌లో సైకిల్‌పై వెళుతున్న కావ్యను కారుతో గుద్దుతాడు రాజ్. ఇంటికి రమ్మంటే రానన్నాననే కోపంతో రాజ్ కావాలనే తనకు యాక్సిడెంట్ చేశాడని కావ్య రచ్చ చేస్తుంది. కావ్య మాటలను సహించని రాజ్ ఇంకోసారి మా ఇంటి వైపు కన్నెత్తిచూడటానికి వీలు లేదని అంటాడు.
Brahmamudi September 23rd Episode: వినాయకుడి విగ్రహం కోసం స్పెషల్ ఆర్డర్ రావడంతో అర్ధరాత్రి దాటినా కూడా కావ్య విగ్రహానికి రంగులు వేస్తుంటుంది. వినాయకుడి విగ్రహానికి రంగులు వేయడానికే నువ్వు మొదటిసారి దుగ్గిరాల ఇంటికి వెళ్లావని, ఈ వినాయకుడినే మళ్లీ నిన్ను, రాజ్‌ను కలుపుతాడు కావచ్చునని కూతురితో అంటాడు కృష్ణమూర్తి. తండ్రి మాటలతో రాజ్‌తో సంతోషంగా గడిపిన క్షణాలను గుర్తుచేసుకొని కావ్య ఎమోషనల్ అవుతుంది.
కావ్య వెళ్లిపోయిన దిగులు...
ఇంట్లో వాళ్లందరిని పిలుస్తారు సీతారామయ్య, ఇందిరాదేవి. వినాయకచవితి ఏర్పాట్లు ఎందుకు చేయడం లేదని అడుగుతారు. కావ్య ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని అందరూ దిగులుతో ఉన్నారని రుద్రాణి సెటైర్ వేస్తుంది. అపర్ణ ఆరోగ్యం బాగాలేదు...కోడలు ఇంట్లో నుంచి వెళ్లిపోయింది.
ఇలాంటి పరిస్థితుల్లో పండగ జరుపుకోవడం అవసరమా అని తండ్రితో అంటాడు సుభాష్. ఐశ్వర్య, సంతోషం ఉన్నప్పుడే మాత్రమే కాదు కష్టాలు వచ్చినప్పుడు కూడా భగవంతుడి కృప మనుకు కావాలని సీతారామయ్య చెబుతాడు. ఆనవాయితీగా వస్తోన్న వినాయకుడి పూజ జరగాల్సిందేనని ఆర్డర్ వేస్తాడు.
పూజ బాధ్యతలు రాజ్‌కు...
పొరపాట్లు చేసేవాళ్లు, అపార్థాలతో తమ కాపురాలు కూర్చుకునేవాళ్లు మనుషులు చెబితే మారేటట్లు లేరని రాజ్‌ను ఉద్దేశించి అంటుంది ఇందిరాదేవి. ఈ సారి వినాయకుడి పూజ ఏర్పాట్లు రాజ్ చేయలని అంటుంది. మంచి విగ్రహం తీసుకురావాల్సిన బాధ్యత నీదేనని రాజ్‌కు చెబుతుంది ఇందిరాదేవి.
వినాయకుడి విగ్రహాలు తయారుచేయడంలో మా కావ్యకు మించినవాళ్లు ఎవరూ లేరని స్వప్న అంటుంది. సిటీలో ఉన్న విగ్రహాలు మొత్తం నీ చెల్లెలు తయారు చేస్తుందంటూ రాజ్ వెటకారంగా స్వప్నకు బదులిస్తాడు.
కావ్యకు ఆత్మాభిమానం ఎక్కువ....
రాజ్ టెన్షన్‌గా కనిపిస్తాడు. వినాయకుడి పూజ నీ చేతుల మీదు జరిపిస్తే ఎక్కడ కావ్య ఇంటికి తిరిగివస్తుందోనని భయపడుతున్నావా అని కొడుకును అడుగుతుంది అపర్ణ. కావ్యకు ఆత్మాభిమానం ఎక్కువని, నీలా చెప్పుడు మాటలకు లొంగిపోయి... వ్యక్తిత్వం లేని వాళ్లకోసం ఆత్మాభిమానం చంపుకొని తిరిగిరాదని కొడుకుతో కోపంగా అంటుంది అపర్ణ.
అప్పు కష్టాలు...
తమ పెళ్లి తర్వాత వస్తోన్న తొలి వినాయకచవితిని కలిసి జరుపుకోవాలని అప్పు, కళ్యాణ్ అనుకుంటారు. కళ్యాణ్ విగ్రహం కొనడానికి బయలుదేరుతుంటే అతడికి అప్పు ఆపుతుంది. తానే స్వయంగా విగ్రహం తయారు చేస్తానని మట్టి కలుపుతుంది. కానీ విగ్రహం తయారుచేయడం రాక ఇబ్బందిపడుతుంది.
చూస్తే రాదని చేస్తే వస్తుందని అప్పుడే అక్కడికి వచ్చిన బంటి...అప్పుపై సెటైర్‌వేస్తాడు. నీ గురించి తెలిసే పెదనాన్న మీకోసం విగ్రహం పంపించాడని బంటి వినాయకుడి విగ్రహం చూపిస్తాడు. అయితే వినాయకుడి పూజ చేయడం అప్పు, కళ్యాణ్ ఇద్దరికి రాకపోవడంతో కంగారు పడతారు. తాను పూజ చేస్తానని బంటి వారితో అంటాడు.
కావ్య కళకు ఫిదా...
తాను తయారు చేసిన స్పెషల్ వినాయకుడికి ఆర్డర్ ఇచ్చిన అతడికి అందిస్తుంది కావ్య. ఆమె తయారు చేసిన విగ్రహం చూసి అతడు ఫిదా అయిపోతాడు. పెళ్లి తర్వాత కళను మర్చిపోయావని అనుకున్నా, కానీ ఇంత బాగా తయారుచేస్తావని అనుకోలేదని కావ్యను తెగ మెచ్చుకుంటాడు. ఆ విగ్రహం తయారుచేసిన తర్వాత తన మనసులోని బాధ మొత్తం తొలగిపోయినట్లుగా అనిపిస్తుందని కావ్య అనుకుంటుంది.
కావ్యకు యాక్సిడెంట్...
విగ్రహం ఇచ్చి తిరిగి సైకిల్‌పై ఇంటికొస్తున్న కావ్యను స్పీడుగా వచ్చి కారుతో గుద్దేస్తాడు రాజ్. సైకిల్‌పై కిందపడిన కావ్య బాధతో విలవిలలాడుతోంది. కోపం పట్టలేక కారును నడిపిన అతడిని తిట్టబోతుంది. కానీ రాజ్‌ను చూసి ఆగిపోతుంది. మరోవైపు రాజ్ కూడా కిందపడిన ఆమెను కాపాడుదామని దిగి కావ్యను చూసి షాకవుతాడు.
కావ్యపై హత్యాప్రయత్నం...
తనకు యాక్సిడెంట్ చేసిన రాజ్‌పై కావ్య ఫైర్ అవుతుంది. మీరు కావాలనే నాకు యాక్సిడెంట్ చేశారు. ఇది మర్డర్ అటెంప్ట్. నాపై హత్యప్రయత్నం చేశారని రాజ్‌పై కావ్య ఫైర్ అవుతుంది. చెక్ రాసిస్తే తీసుకోకుండా ఇంటికి రానన్నానని ఈ రకంగా కసి తీర్చుకోవాలని అనుకుంటున్నారా అంటూ దులిపేస్తుంది.
డబ్బుల కోసమే కావ్య ఈ డ్రామా ఆడుతుందని మరోసారి రాజ్ అపార్థం చేసుకుంటాడు. కావ్య, రాజ్ గొడవ చూసి కొందరు అక్కడికి వస్తారు. వారిని కావ్యనే అరెంజ్ చేసిందని రాజ్ అనుకుంటాడు. వీళ్లందరికి ఎంతిచ్చావని అంటాడు. ఎంతకు బేరం కుదిరిందని కావ్యతో వెటకారంగా మాట్లాడుతాడు.
డబ్బుందన్న పొగరు...
ఈ డబ్బుందన్న పొగరు చూపించినందుకు ఆ రోజు అంత గొడవైందని కావ్య కూడా రాజ్‌కు ధీటుగా సమాధానమిస్తుంది. మీకు బాగా డబ్బుంటే బ్యాంకులో దాచుకొండి. లేదంటే మీ ఇంట్లో తేరగా పడి తింటున్న రుద్రాణి, రాహుల్‌కు డబ్బులు ఇవ్వండి. ఆ విశ్వాసంతోనైనా కుట్రలు చేయడం మానేస్తారని రాజ్‌తో అంటుంది కావ్య. మా వాళ్లను అంటే ఊరుకునేది లేదని కావ్యపై రాజ్ ఫైర్ అవుతాడు. నన్ను అంటే నేను ఊరుకోనని కావ్య గట్టిగా అంటుంది.
భార్యాభర్తల గొడవ...
కట్టుకున్న పెళ్లాం కట్టుబట్టలతో బయటకు వెళుతుంటే చోద్యం చూస్తున్నవాళ్లు మీ వాళ్ల అంటూ దుగ్గిరాల ఫ్యామిలీని దులిపేస్తుంది కావ్య. భార్యాభర్తల గొడవ మధ్యలో తల దూర్చడం ఎందుకొని చూట్టూ నిలబడి చూస్తున్నవాళ్లు వెళ్లిపోబోతారు.
వారి మాటలు విన్న రాజ్...కావ్యతో తనకు ఏం సంబంధం లేదని అంటాడు. కావ్య మెడలో తాళికట్టింది నేనే ...కావ్య ఇప్పుడు నా భార్య కాదని అంటాడు. నేను మీకు ఏమి కానప్పుడు ఈ తాళి కట్టింది ఏ పుడింగి అని కావ్య కోపంగా అంటుంది. నాకు తాళి కట్టింది ఇతడే...కానీ నాకు ఇతడు ఏం కాదని చుట్టుపక్కల వారితో కావ్య చెబుతుంది.
రాజ్ బడాయిలు...
ఎప్పుడో జరిగిన గొడవ ఇప్పుడు తప్పుకుంటున్నారంటే ఖచ్చితంగా వీళ్లు భార్యభర్తలేనని చుట్టుపక్కల వారంగా వెళ్లిపోతారు. కావ్య నోటికి బయటపడే వాళ్లంతా వెళ్లిపోయారని కావ్యపై సెటైర్లు వేస్తాడు రాజ్. మీ నోరు కూడా పెద్దదిగానే ఉందని కావ్య కూడా అంతే ఆవేశంగా సమాధానమిస్తుంది. తాతాల కాలం నాటి సైకిల్ అంటూ కావ్య సైకిల్‌ను తంతాడు రాజ్. ఇది కూడా మీ తాత కొనిచ్చిన కారే కదా...ఎందుకు బడాయిలకు పోతున్నారని రాజ్ కారును తంతుంది కావ్య.
చెప్పుడు మాటలు విని...
మిమ్మల్ని ఎంత నమ్మాను..నా మొగుడు మారిపోయాడు. ప్రేమగా చూసుకుంటున్నారని ఎంతో సంతోషపడ్డానని కావ్య అంటుంది. కానీ చెప్పుడు మాటలు విని రెచ్చిపోయి కట్టుకున్నపెళ్లాన్ని వదిలేస్తారని తెలిస్తే ఎప్పుడో మీ ఇంట్లో నుంచి వెళ్లిపోయేదానిని అని కావ్య అంటుంది.
ఇప్పుడు బయట పడ్డవుగా దరిద్రం వదిలిపోయింది...ఇంక ఎప్పుడు మా ఇంట్లో కాలు పెట్టకు, ఇంటివైపు కన్నెత్తి చూడకు అని కావ్యతో కోపంగా అంటాడు రాజ్. భర్త మాటలను కావ్య బాధపడుతుంది.
కలిసి పూజ...
వినాయకుడి పూజకు అన్ని ఏర్పాట్లు చేస్తాడు రాజ్. కావ్యకు ఫోన్ చేయమని రాజ్‌తో అంటారు అపర్ణ, ఇందిరాదేవి. భార్య లేకుండా పూజ చేస్తే లోటు...లోటుగానే ఉంటుందని, ఈ పూజలో దంపతులు కలిసి కూర్చోవాలని అంటారు. ఆ తర్వాత కావ్య, రాజ్ కలిసి పూజ చేస్తారు. అది చూసి అపర్ణ సంతోషపడుతుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగిసింది.