Marriage: అబ్బాయి, అమ్మాయి ఒకే గోత్రం అయితే వివాహం చేసుకోకూడదా? ఒకవేళ వివాహం చేసుకుంటే ఏం అవుతుంది?సమస్యలు వస్తాయా?
Marriage: పేరు, జాబ్ వివరాలతో పాటుగా పుట్టిన తేదీ, ఎత్తు, రంగు ఇవన్నీ చూసుకోవడంతో పాటుగా గోత్రం కూడా చూస్తారు. ఎందుకు గోత్రం చూస్తారంటే.. ఒకే గోత్రం వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయకూడదని. పెళ్లిని ఒక్కో సాంప్రదాయంలో ఒక్కో రకంగా చేస్తారు.
పెళ్లి అనేది ఎంతో ప్రత్యేకమైనది. రెండు మనసులు పెళ్లితో దగ్గర అవుతాయి. రెండు కుటుంబాలు పెళ్లితో ఒకటవుతాయి. మన హిందూ మతంలో పెళ్ళికి ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకించి వివరించక్కర్లేదు. ప్రేమ పెళ్లిళ్లు అయితే అమ్మాయి, అబ్బాయి చూసుకుని.. ఇష్టపడి, కొంత కాలం ట్రావెల్ చేసిన తర్వాత ఆడంబరాలేమి లేకుండా పెళ్లి చేసుకోవడం లేదంటే పెద్దవాళ్ళని ఒప్పించి ఘనంగా పెళ్లి చేసుకోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి.
ఇది పక్కన పెడితే, పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళ విషయానికే వస్తే, పెద్దవాళ్లు ఒక అబ్బాయికి లేదా అమ్మాయికి పెళ్లి చేయాలంటే ఎన్నో చూస్తారు. అటు మూడు తరాలు ఇటు మూడు తరాలు చూసి పెళ్లి చేయాలని కూడా చాలా మంది చెప్తూ ఉంటారు. పైగా పెళ్లి చేయడానికి ముందు అబ్బాయి వాళ్ళు అమ్మాయి వివరాలని, అమ్మాయి వాళ్ళు అబ్బాయి వివరాలని అడిగి తెలుసుకుంటారు. ఆ వివరాలు నచ్చిన తర్వాత, ఫోటో నచ్చిన తర్వాత ఇంకో అడుగు ముందుకు వెళ్తారు.
గోత్రం ఎందుకు చూసుకోవాలి?
వివరాలని తెలుసుకునేటప్పుడు పేరు, జాబ్ వివరాలతో పాటుగా పుట్టిన తేదీ, ఎత్తు, రంగు ఇవన్నీ చూసుకోవడంతో పాటుగా గోత్రం కూడా చూస్తారు. ఎందుకు గోత్రం చూస్తారంటే.. ఒకే గోత్రం వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయకూడదని. పెళ్లిని ఒక్కో సాంప్రదాయంలో ఒక్కో రకంగా చేస్తారు. హిందువుల పెళ్లిల్లో అనేక తంతులు ఉంటాయి. జీలకర్ర బెల్లం, తాళి కట్టడం, తలంబ్రాలు ఇలా.
ఒకే గోత్రం వాళ్ళకి ఇచ్చి పెళ్ళి చేయకూడదా?
ఎవరైనా పెళ్లి చేయడానికి ముందు గోత్రాలు చూస్తారు. ఒకే గోత్రం పనికిరాదని చెప్తూ ఉంటారు. మీ పెద్దలు కూడా ఈ విషయాన్ని చెప్పడం మీరు వినే ఉంటారు. పెళ్లి చేయడానికి ముందు వారి గోత్రం ఏంటో కనుక్కొని అవి వేరు ఆయితే మాత్రమే అంగీకరిస్తారు. అలాగే జాతకాలు కూడా కలవాలని, ముందు జాతకాలని కూడా చూసుకుంటూ ఉంటారు.
గోత్రాలు సప్త ఋషుల వంశస్తుల రూపంలో ఉంటాయట. సప్త ఋషులు అంటే గౌతమ, కస్య, వశిష్ట, భరద్వాజ, అత్రి, అంగిరసుడు, భృగు. వేద కాలం నుంచి గోత్రాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంది. పెళ్లి చేయడానికి ముందు గోత్రం అడగడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రక్తసంబంధీకుల మధ్య పెళ్లి జరగకుండా ఉండాలని. అందుకనే పెళ్లికి ముందు కచ్చితంగా గోత్రం చూస్తారు. ఇరువురిది ఒకే గోత్రమైతే, ఇద్దరు కూడా సోదరులు, సోదరీమణులు సంబంధం కలిగి ఉంటారు. అలా ఉండడం మంచిది కాదని గోత్రం అడిగి తెలుసుకుని, ఒకే గోత్రం అయితే పెళ్ళి చేయరు.
ఒకే గోత్రం వారు వివాహం చేసుకుంటే సమస్యా?
ఒకే గోత్రం కలిగిన స్త్రీ, పురుషుడికి వివాహం జరిగిందంటే సంతానం పొందడానికి ఇబ్బందులు వస్తాయి. ఒకవేళ పుట్టినా ఆ పిల్లల్లో జన్యుపరమైన లోపాలు కలగవచ్చు. కొంతమందిలో మానసిక సమస్యలు కూడా వస్తాయట. ఇటువంటి సమస్యలు ఏమీ కలగకూడదని పెద్దలు గోత్రాన్ని చూసి పెళ్లి చేస్తారు. ఒకే గోత్రం వాళ్ళకు ఇచ్చి పెళ్ళి చేయరు. ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాలని పెళ్ళికి ముందే గోత్రం అడిగి తెలుసుకుంటారు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం