Marriage Remedies: వచ్చిన సంబంధాలన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయా? ఈ మంత్రాలను జపించండి, వివాహం అవుతుంది
Marriage Remedies: కొంతమంది పెళ్లి చేసుకోవాలని అనుకున్నా.. మంచి ఉద్యోగం ఉన్నా సరే పెళ్లి ఘడియలు వెనక్కి వెళ్ళిపోతున్నాయి తప్ప పెళ్లి పీటలెక్కలేకపోతున్నారు. మీరు కూడా పెళ్లి అవ్వక ఇబ్బందులు పడుతున్నారా? అయితే ఈ మంత్రాలని పఠించండి.
పెళ్లితో రెండు కుటుంబాలు ఒకటి అవుతాయి. రెండు మనసులు దగ్గరవుతాయి. ప్రతి ఒక్కరికి పెళ్లి అంటే ఎన్నో ఆలోచనలు ఉంటాయి. పెళ్లి గురించి అనేక కలలు కంటూ ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోవాలంటే పలు వివాహ తంతులు ఉంటాయి. ఈరోజుల్లో చాలా మంది ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.
కొంతమంది పెళ్లి చేసుకోవాలని అనుకున్నా.. మంచి ఉద్యోగం ఉన్నా సరే పెళ్లి ఘడియలు వెనక్కి వెళ్ళిపోతున్నాయి తప్ప పెళ్లి పీటలెక్కలేకపోతున్నారు. మీరు కూడా పెళ్లి అవ్వక ఇబ్బందులు పడుతున్నారా? పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారా? వచ్చిన సంబంధాలుని వెనక్కి వెళ్ళిపోతున్నాయా? అయితే ఈ మంత్రాలని పఠించండి.
పెళ్ళి అవ్వాలంటే ఈ మంత్రాలని పఠించండి
శివ పార్వతి మంత్రం
‘ఓం హ్రీం యోగిని యోగిని యోగేశ్వరి యోగ భయంకరీ సకల స్థవర జంగమస్య ముఖ హృదయం మమ వాసం ఆకర్ష ఆకర్షాయ నమః’. శివ పార్వతి మంత్రం చాలా శక్తివంతమైనది, ఈ మంత్రాన్ని పఠించడం వలన కళ్యాణ ఘడియలు దగ్గర పడతాయి. కేవలం త్వరగా పెళ్లి అవ్వడానికి కాకుండా కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండడానికి, ప్రశాంతంగా ఉండడానికి కూడా ఈ మంత్రం అద్భుతంగా పనిచేస్తుంది. భక్తితో, శ్రద్ధతో 108 సార్లు ఈ మంత్రాన్ని జపించండి.
సూర్య మంత్రం
‘ఓం దేవేంద్రాని నమస్తుభ్యం దేవేంద్రప్రియ భామినీ వివాహం భాగ్యమారోగ్యం శీఘ్రాలాభం చ దేహి మే’. సూర్య మంత్రాన్ని జపిస్తే కూడా త్వరగా పెళ్లి అవుతుంది. పెళ్లి అవ్వక ఇబ్బంది పడుతున్న వాళ్ళు సూర్య మంత్రాన్ని 108 సార్లు 41 రోజులు పాటు జపిస్తే మంచిది. వైవాహిక జీవితం బాగుండడానికి కూడా ఈ మంత్రం బాగా పనిచేస్తుంది. ప్రశాంతంగా, సంతోషంగా కుటుంబ సభ్యులతో ఉండాలన్నా కూడా ఈ మంత్రాన్ని జపించండి.
గణేష్ మంత్రం
‘ఊమా శ్రీగణీశామ విధ్నీషామ వివాహాహార్థీ తాయే నామహా’. విఘ్నాలకు అధిపతి అయిన వినాయకుడుని ఆరాధించడం వలన అంతా మంచి జరుగుతుంది. కష్టాలన్నీ తీరిపోతాయి. వినాయకుని మంత్రాన్ని జపించడం వలన సంతోషకరమైన జీవితాన్ని గడపచ్చు. ప్రతికూల శక్తి తొలగిపోవడానికి కూడా వినాయకుని మంత్రాన్ని చదువుకోవడం మంచిది. ఈ మంత్రాన్ని పఠిస్తే సానుకూల శక్తి ప్రవహిస్తుంది. మంచి జీవిత భాగస్వామి జీవితంలోకి అడుగుపెడుతుంది. అభివృద్ధికి కూడా ఈ మంత్రం సహాయపడుతుంది.
కాత్యాయని మంత్రం
‘కాత్యాయనీ మహామాయే మహాయోగిన్యాధీశ్వరీ నందగోప్సుతాం దేవీపతిం మే కురు తే నమః’. మంచి జీవిత భాగస్వామిని జీవితంలోకి తీసుకురావడానికి కాత్యాయని మంత్రం బాగా ఉపయోగపడుతుంది. పెళ్లి అయిన వాళ్ళు మాత్రమే కాదు పెళ్ళి అయిన వారు కూడా ఈ మంత్రాన్ని చదవచ్చు. ఈ మంత్రాన్ని చదువుకుంటే సంతోషకరమైన జీవితాన్ని గడపొచ్చు. 108 సార్లు 41 రోజుల పాటు ఈ మంత్రాన్ని చదివితే మంచిది. శక్తిని కూడా ఈ మంత్రం అందిస్తుంది.
సంబంధిత కథనం