Gotra: గోత్రం అంటే ఏంటి? హిందూ సంప్రదాయం ప్రకారం వాటికున్న విశిష్టత ఏంటి?-what is gotra according to the hindu tradition what is their specialty ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Gotra: గోత్రం అంటే ఏంటి? హిందూ సంప్రదాయం ప్రకారం వాటికున్న విశిష్టత ఏంటి?

Gotra: గోత్రం అంటే ఏంటి? హిందూ సంప్రదాయం ప్రకారం వాటికున్న విశిష్టత ఏంటి?

Gunti Soundarya HT Telugu
Jun 07, 2024 01:28 PM IST

Gotra: గోత్రం అంటే ఏంటి? ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి. గోత్ర నామం ఎలా నిర్ణయిస్తారు అనే విషయాలకు సంబంధించిన ఆసక్తి వివరాలు మీకోసం.

గోత్రం అంటే ఏంటి?
గోత్రం అంటే ఏంటి? (pinterest)

Gotra: గుడికి వెళ్లి పూజ చేయించుకునేటప్పుడు, వివాహం కోసం జాతాకాలు చూసేటప్పుడు తప్పనిసరిగా గోత్ర నామాలు చూస్తారు. వాటి ప్రకారమే పూజారి పూజలు చేస్తాడు. వివాహ సంబంధాలు నిశ్చయించుకుంటారు. ఇంట్లో తండ్రి గోత్రమే తమ గోత్రంగా పూజలు చేసుకుంటారు. అసలు ఏంటి గోత్రాలు? ఎలా వచ్చాయి? వాటికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం. 

గోత్రాలు ఎలా వచ్చాయి?

గోత్రాలు భారతీయ సంస్కృతిలో ముఖ్యంగా హిందూ సమాజంలో ఒక ముఖ్యమైన భాగం. అవి ఒక వ్యక్తికి చెందిన వంశాన్ని గుర్తించడానికి ఉపయోగపడుతుంది. ఈ వ్యవస్థను శతాబ్దాలుగా అనుసరిస్తూ వస్తున్నారు. గోత్రం అనేది ప్రాచీనకాలంలోని రుషులకు సంబంధించిన ఇంటి పేరుగా చెప్తారు. ప్రతి గోత్రానికి ఒక్కో రుషి పేరు ఉంటుంది. 

ఉదాహరణకు భరద్వాజ గోత్రానికి భరద్వాజ మహర్షి పేరు పెట్టారు. కశ్యప గోత్రానికి కశ్యప రుషి పేరు పెట్టారు. గోత్రాలు ఒకరు పూర్వీకులను అర్థం చేసుకోవడంలో సహాయపడతాయి. వివాహాలు, మతపరమైన వేడుకలు వంటి ముఖ్యమైన విషయాల్లో గోత్రాల గురించి తరచుగా ప్రస్తావిస్తారు. ఒకే గోత్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులు వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు అది ఎవరు అంగీకరించరు. గోత్రనామాలు అనేవి రక్తసంబంధం లేని వ్యక్తుల మధ్య వివాహాలు జరిగేలా చూసేందుకు ఉపయోగపడుతుంది. 

పురాణాలలో గోత్రాలకు సంబంధించి అనేక విషయాలు ప్రస్తావించారు. ప్రాచీన గ్రంథాల ప్రకారం ఏడు ప్రాథమిక గోత్రాలు సప్తరుషులతో ముడిపడి ఉన్నాయి. బ్రహ్మ సృష్టించిన ఏడుగురు గొప్ప రుషులు ద్వారా వంశాలు వృద్ధి చెందాయని చెబుతారు. 

ఏడుగురు రుషులు ఎవరంటే.. 

వశిష్ట

విశ్వామిత్రుడు

అత్రి 

జమదగ్ని 

గౌతముడు

భరద్వాజ

కశ్యప

ఈ రుషులలో ప్రతి ఒక్కరూ తమ వంశాలను స్థాపించారని చెబుతారు. ఇదే గోత్ర వ్యవస్థకు ఆధారమైంది. పౌరాణిక సంబంధం ప్రకారం గోత్రాల పవిత్రత పురాతన మూలాలను బలపరుస్తుంది.

గోత్రాల గురించి ఆసక్తికరమైన విషయాలు

హిందూ సమాజంలో 49కి పైగా విభిన్న గోత్రాలు ఉన్నాయి. ప్రతి ఒక్కదానికి ఒక రుషి పేరు పెట్టారు. గోత్రాలు సాధారణంగా పురుష రేఖ ద్వారా తెలుస్తాయి.  ఉదాహరణకు పిల్లవాడి తండ్రి గోత్రం వారసత్వంగా పొందుతాడు. 

ఇక స్త్రీల విషయానికి వస్తే వివాహమైన తర్వాత మహిళలు వారి భర్త గోత్రాన్ని స్వీకరిస్తారు. వివాహానికి ముందు వారి గోత్రాన్ని గోత్రకారిణి అని పిలుస్తారు .ఇది వారి తండ్రి వంశాన్ని సూచిస్తుంది. 

ఈ గోత్రాల గురించి ప్రాచీన వేద గ్రంధాలలో ప్రస్తావించారు. భారతీయ సంప్రదాయాల్లో దీని దీర్ఘకాల ప్రాముఖ్యత తెలియజేస్తుంది. ప్రధానంగా హిందూ సంప్రదాయం, జైన మతం, బౌద్ధ మతం వంటి కొన్ని భారతీయ మతాలు ఈ గోత్రాలను గుర్తిస్తాయి. 

గోత్రాలు ఏ ఒక్క ప్రాంతానికి లేదా భాషకు పరిమితం కాదు. వివిధ రాష్ట్రాలలో, అనేక భాషలు మాట్లాడే ప్రజలు గోత్రాలను నమ్ముతారు. ప్రాంతాల వారిగా గోత్రాల పేర్లలో స్వల్ప మార్పులు ఉంటాయి కానీ అంతర్లీనంగా వాటి వెనుక ఉన్న అర్థం మాత్రం ఒకటే అవుతుంది. తరచుగా కుటుంబ పెద్దల నుండి గోత్రాన్ని తెలుసుకుంటారు. ఇది తరతరాలుగా ఆచరిస్తున్న సంప్రదాయం. నేటికీ బిడ్డ పుట్టినప్పుడు వారి గోత్రాన్ని వారి పేరుతో పాటు ప్రకటిస్తారు. ఇది పూర్వీకులు వంశంతో ముడిపడి ఉంటుంది. 

గోత్రానికి ప్రత్యేకమైన సాంస్కృతిక, మతపరమైన ప్రాముఖ్యత ఉంది. ఇది వ్యక్తుల వారి పురాతన మూలాలను అనుసంధానం చేస్తుంది. వారి వంశ ప్రాముఖ్యతను చూపిస్తుంది. 

 

Whats_app_banner