AP Mid DayMeal Menu: ఏపీ బడుల్లో మారిన మధ్యాహ్న భోజనం మెనూ, జోన్ల వారీగా వంటకాలు సిద్ధం
AP Mid DayMeal Menu: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం మెనూలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు అందించే ఆహారాన్ని జోన్ల వారీగా మార్చింది. రాష్ట్రంలో నాలుగు జోన్లలో నాలుగు మెనూలతో మిడ్ డే మీల్స్ అందిస్తారు.
AP Mid DayMeal Menu: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంలో కీలక మార్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పాఠశాల విద్యార్థులకు అందించే ఆహారాన్ని వారి స్థానిక ఆహార అలవాట్లకు అనుగుణంగా మార్పు చేసింది. ఇందుకోసం డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం పథకంలో కీలక మార్పులు చేసింది. అయా ప్రాంతాల్లో విద్యార్ధుల ఆహార అలవాట్లు, అభిరుచులకు అనుగుణంగా వంటకాల మెనూ రూపొందించారు.
మధ్యాహ్న భోజనం పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అందిస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పోషకాహారాన్ని అందించే కార్యక్రమాన్ని దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మధ్యాహ్న భోజనం అమలు తీరుపై సమగ్ర అధ్యాయనం తర్వాత విద్యార్ధుల అభిరుచులకు అనుగుణంగా సమగ్ర మార్పులు చేశారు. సంక్రాంతి పండుగ సెలవుల తర్వాత కొత్త మెనూ అమల్లోకి రానుంది. ప్రతి మంగళవారం మాత్రం విద్యార్థులు తమకు నచ్చిన ఆహారాన్ని ఎంచుకునే అవకాశం కల్పించారు.
- ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి జిల్లాలను నాలుగు జోన్లుగా విభజించి మెనూ రూపొందించారు. జోన్ 1లో ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉన్నాయి.
- జోన్ 2లో తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలు ఉన్నాయి.
- జోన్ 3లో గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు ఉన్నాయి.
- జోన్ 4లో చిత్తూరు,కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలు ఉన్నాయి.
- సోమవారం జోన్ 1లో అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, చిక్కీ, జోన్ 2లో అన్నం, ఆకుకూరతో పప్పు, గుడ్డు ఫ్రై, చిక్కీ అందిస్తారు. జోన్ 3లో అన్నం, సాంబారు, గుడ్డు ఫ్రై, చిక్కీ ఇస్తారు. జోన్ 4లో అన్నంతో కూరగాయల కూర ఉడికించిన గుడ్డు, చిక్కీ ఇస్తారు.
- మంగళవారం జోన్ 1లో అన్నంతో పాటు గుడ్డు కూర, పప్పు, రసం, రాగిజావ ఇస్తారు. జోన్ 2లో పులిహార, చట్నీ, ఉడికించిన గుడ్డు, రాగిజావ అందిస్తారు. జోన్3లో పులిహార, టామాటా లేదా పుదీన చట్నీ, గుడ్డు ఫ్రై, రాగిజావ అందిస్తారు,. జోన్ 4లో పులగం లేదా పులిహార, పల్లీ చట్నీ, కోడిగుడ్డు ఫ్రై, రాగిజావ అందిస్తారు.
- బుధవారం జోన్ 1లో వెజ్ పలావ్, బంగాళాదుంప కుర్మా, ఉడికించిన గుడ్డు, చిక్కీ, జోన్2లొ అన్నం, కూరగాయల కూర, గుడ్డు, చిక్కీ ఇస్తారు. జోన్ 3లో అన్నం, 4రకాల కూరగాయలతో కూర, గుడ్డు ఫ్రై, చిక్కీ అందిస్తారు. జోన్ 4లో అన్నం, సాంబారు, గుడ్డు, చిక్కీ అందిస్తారు.
- గురువారం జోన్ 1లో అన్నం, సాంబారు, గుడ్డు కూర, రాగిజావ, జోన్2లో వెజ్ రైస్, పులావ్, బంగాళాదుంప కుర్మా, ఉడికించిన గుడ్డు, రాగిజావ అందిస్తారు. జోన్3లో వెజిటేబుల్ రైస్, పలావ్, బంగాళాదుంప కుర్మా, ఉడికించిన గుడ్డు, రాగిజావ ఇస్తారు. జోన్ 4లో వెజిటేబుల్ రైస్, గుడ్డు కూర, రాగిజావ అందిస్తారు.
- శుక్రవారం జోన్1లో పులిహార, గోంగూర చట్నీ, లేదా కూరగాయలతో చట్నీ, గుడ్డు చిక్కీ అందిస్తారు. జోన్2లో అన్నం, ఆకుకూర పప్పు, గుడ్ ఫ్రై, చిక్కీ అందిస్తారు. జోన్ 3లో అన్నం, గుడ్డుకూర, చిక్కీ అందిస్తారు. జోన్4లో అన్నం, ఆకుకూరపప్పు, ఉడికించిన గుడ్డు, చిక్కీ అందిస్తారు.
- శనివారం జోన్1లో అన్నం, కూరగాయల కూర, రసం, రాగిజావ, స్వీట్ పొంగల్ అందిస్తారు. జోన్ 2లో అన్నం, ఆకుకూరలతో కూర, స్వీట్ పొంగల్, రాగిజావ ఇస్తారు. జోన్3లో అన్నం, టమాటా పప్పు, పప్పు చారు, బెల్లం పొంగలి, రాగిజావ అందిస్తారు. జోన్ 4లో అన్నం, కందిపప్పు చారు. బెల్లం పొంగలి, రాగిజావ అందిస్తారు.