మరికొన్ని రోజుల్లో క్రిస్మస్, నూతన సంవత్సరం రాబోతున్నాయి. క్రిస్మన్, న్యూ ఇయర్ సందర్భంగా కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహోద్యోగులకు బహుమతులు ఇస్తుంటాం. రూ.500 బడ్జెట్ లో బెస్ట్ క్రిస్టమస్ గిఫ్ట్ ఐడియాలు తెలుసుకుందాం. 

pexels

By Bandaru Satyaprasad
Dec 18, 2024

Hindustan Times
Telugu

క్రిస్మస్, న్యూ ఇయర్ కు మీ జేబుపై భారం పడకుండా...మీ స్నేహితులు ఇష్టపడే మంచి బహుమతులు ఇవ్వడం ముఖ్యం. కాస్త ఆలోచిస్తే రూ.500 లోపు కొన్ని గొప్ప క్రిస్మస్ బహుమతులు అందుబాటులో ఉన్నాయి.   

pexels

క్యాండిల్ హోల్డర్- చాలా మంది క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా కొవ్వొత్తులను వెలిగిస్తారు. ఈ సమయంలో క్యాండిల్ హోల్డర్ కంటే మంచి బహుమతి ఏముంటుంది. ఆకర్షణీయ క్యాండిల్ హోల్టర్ లు మార్కెట్లో, ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి.   

pexels

పర్సనలైజ్డ్ గిఫ్ట్ - క్రిస్మస్, న్యూఇయర్ కు మీరు పర్సనలైడ్జ్ గిఫ్ట్ ను స్నేహితులు ఇవ్వొచ్చు. పెన్ డ్రైవ్‌లు, కాఫీ మగ్‌లు, వాల్ క్లాక్‌లు, పెన్నులు, డ్రెస్‌లు వంటి మీకు ఇష్టమైన వస్తువులను వారి ఫొటోలు ముద్రించి ఇవ్చొచ్చు.   

pexels

సుగంధ నూనె-పండుగ సమయంలో పని ఒత్తిడి కాస్త ఎక్కువగా ఉంటుంది. వారి అలసటను తగ్గించేందుకు పరిమళమైన ఆరోమాటిక్ ఆయిల్ ఎంతో ఉపయోగపడుతుంది. వీటి ఆహ్లాదకరమైన సువాసన అలసటను పోగొట్టి, తాజా అనుభూతిని కలిగిస్తుంది.  

pexels

రాగి దీపాలు- రాగి వస్తువులను చాలా పవిత్రంగా భావిస్తారు. రాగి దీపాలు లేదా ఇతర అలంకరణ వస్తువులు, పాత్రలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. వీటిల్లో రూ.500 లోపు చిన్న బహుమతులను ఎంచుకోవచ్చు. 

pexels

డ్రై ఫ్రూట్స్ సెట్- డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యకరం. క్రిస్మస్, న్యూఇయర్ కు స్వీట్ల స్థానంలో డ్రై ఫ్రూట్స్ మంచి బహుమతి. డ్రై ఫ్రూట్ సెట్లు మార్కెట్లో తక్కువ ధరకు లభిస్తున్నాయి.   

pexels

స్నేహితులు, బంధువుల పిల్లలకు గిఫ్ట్ లుగా DIY క్రాఫ్ట్ కిట్ అందించవచ్చు. ఈ కిట్ లు పిల్లల్లో సృజనాత్మకతను పెంచడానికి ఉపయోగపడతాయి.   

pexels

క్రిస్మస్ పైజామా- పిల్లలకు క్రిస్మస్ నేపథ్యంతో శాంటా పైజామా, రెయిన్ డీర్ లేదా స్నోమెన్ వంటి బహుమతులు మంచి ఆలోచన. మృదువైన సౌకర్యవంతమైన వీటిని ధరించడానికి పిల్లలు ఇష్టపడతాయి.   

pexels

వ్యాయామానికి ముందు తినొచ్చా..? ఈ విషయాలను తెలుసుకోండి

image credit to unsplash