Andhra Pradesh News Live December 18, 2024: Eluru Crime : ఏలూరు జిల్లాలో ఘోరం, అనుమానంతో భార్యను గొంతు నులిమి హతమార్చిన భర్త
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Wed, 18 Dec 202403:31 PM IST
Eluru Crime : ఏలూరు జిల్లాలో ఘోరం జరిగింది. భార్యపై అనుమానంలో ఆమె గొంతు నులిమి హత్య చేశాడో భర్త. అనంతరం భార్య ఉరి వేసుకుని డ్రామా ఆడాడు. భార్య కుటుంబ సభ్యులు గట్టిగా నిలదీయడంతో అసలు నిజం చెప్పాడు.
Wed, 18 Dec 202401:26 PM IST
Paritala Ravi Murder Case : మాజీ మంత్రి, టీడీపీ దివంగత నేత పరిటాల రవి హత్య కేసులో ఐదుగురు నిందితులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. హత్య జరిగిన 18 ఏళ్ల తర్వాత ఈ కేసులో నిందితులకు బెయిల్ దక్కింది. 2005 జనవరి 24న పరిటాల రవి హత్యకు గురయ్యారు.
Wed, 18 Dec 202412:45 PM IST
AP Home Guards : హోంగార్డులకు ఏపీ హైకోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. కానిస్టేబుళ్ల భర్తీ ప్రక్రియలో హోంగార్డులను ప్రత్యేక కేటగిరీగా పరిగణించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Wed, 18 Dec 202411:37 AM IST
- ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ బోర్డు కానిస్టేబుల్ అభ్యర్థులకు శుభవార్త చెప్పింది.. .రాత పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి దేహదారుఢ్య పరీక్షల కోసం హాల్ టిక్కెట్లు విడుదలయ్యాయి. ఏపీలో 6100 కానిస్టేబుల్ ఉద్యోగాల నియామకం కోసం 2022లో నోటిఫికేషన్ విడుదలైంది.
Wed, 18 Dec 202410:54 AM IST
- AP Weather Update: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. రానున్న 24 గంటల్లో తమిళనాడు, ఏపీ తీరం వైపు వెళ్లే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.ఆ తర్వాత 24 గంటల్లో ఏపీ తీరం వెంబడి ఉత్తరదిశగా పయనించనుండటంతో కోస్తా జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన జారీ చేశారు.
Wed, 18 Dec 202410:24 AM IST
AP Farmers : పాడి, ఆక్వా రైతులు, మత్స్యకారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పశు కిసాన్ క్రెడిట్ కార్డులపై 3 శాతం వడ్డీ రాయితీతో రూ.2 లక్షల వరకు లోన్లు ఇవ్వాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. జనవరిలో మత్స్యకార భరోసా లబ్ధిదారులకు అందించాలన్నారు.
Wed, 18 Dec 202409:34 AM IST
- Tiruvuru Mla: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీకి తలనొప్పిగా తయారైన ఎమ్మెల్యేల్లో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఒకరు. పార్టీ నేతలతో వివాదాలు, కర్ర పెత్తనం, దూషణలతో తీరు మార్చుకోమని పార్టీ పెద్దలు పదేపదే చెబుతున్నా ఆయనలో మాత్రం మార్పు రావడం లేదు.
Wed, 18 Dec 202409:10 AM IST
- AP New Toll Charges: ఆంధ్రప్రదేశ్‌లో టోల్ ఫీజులు జనం జేబులకు చిల్లు పెడుతున్నాయి. కొత్త నిబంధనలు అమల్లోకి రావడంతో సింగల్ ఎంట్రీ ఫీజులను వసూలు చేస్తున్నారు. దీంతో జనంపై భారీగా భారం పడుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపె 65టోల్ గేట్లలో ఇదే రకమైన వసూళ్లు అమలవుతున్నాయి.
Wed, 18 Dec 202408:44 AM IST
- Kurnool Crime: కర్నూలు జిల్లాలో ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. ప్రేమ జంటపై వేట కొడవళ్లతో దాడి జరిగింది. ఈ ఘటనలో యువతి తప్పించుకోగా, దుండగులకు దొరికిన యువకుడిపై విచక్షణ రహితంగా దాడి చేశారు. దాడిలో యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
Wed, 18 Dec 202408:42 AM IST
Pawan Kalyan : కనీసం రోజుకి సగటు మనిషికి 55 లీటర్ల పరిశుభ్రమైన నీరు అందిచడమే జల్ జీవన్ మిషన్ లక్ష్యమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. కోటి కుటుంబాలకు సురక్షిత మంచినీరు అందించాలనే ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు.
Wed, 18 Dec 202408:16 AM IST
- AP AmrutaDhara: ఏపీలో ఇంటింటికి రక్షిత మంచినీటిని అందించే పథకాన్ని త్వరలోనే పూర్తి చేయనున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. కేంద్రం నిధులతో చేపట్టే జలజీవన్ మిషన్‌కు ఏపీలో అమృతధార ప్రాజెక్టుగా కొనసాగించనున్నామని ప్రతి ఒక్కరికి 55లీటర్ల మంచినీటిని ఇంటికే సరఫరా చేస్తామన్నారు.
Wed, 18 Dec 202408:00 AM IST
Amaravati Real Estate : అమరావతిపై తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి. ప్రస్తుతం ఏపీలో రియల్ ఎస్టేట్ పెట్టుబడులు పెరిగాయా? తగ్గాయా? వాస్తవ పరిస్థితులేంటి? అమరావతిలో రియల్ బూమ్ వాస్తవమేనా చూద్దాం.
Wed, 18 Dec 202407:59 AM IST
- AP Mid DayMeal Menu: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం మెనూలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు అందించే ఆహారాన్ని జోన్ల వారీగా మార్చింది. రాష్ట్రంలో నాలుగు జోన్లలో నాలుగు మెనూలతో మిడ్ డే మీల్స్ అందిస్తారు.
Wed, 18 Dec 202406:53 AM IST
- Amaravati Piped Gas: పైప్డ్ గ్యాస్ రాజధానిగా అమరావతి నగరాన్ని నిర్మాణంలో భాగస్వామ్యం వహించేందుకు ఐఓసీ ముందుకు వచ్చింది. గుజరాత్ గిఫ్ట్ సిటీ తరహాలో ప్రాజెక్టు ప్రతిపాదనలతో ఐఓసీ అధికారులు ముందుకు వచ్చారు.
Wed, 18 Dec 202405:43 AM IST
- IPS Marriage Dispute: కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కుమార్తె వివాహంలో కాంగ్రెస్ పార్టీ జెండాలతో హంగామా చేయడంతో ఆగ్రహానికి గురైన పెళ్లి కొడుకు.. పెళ్లిని రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించడం కలకం రేపింది. మంగళవారం రాత్రి గుంటూరులో ఈ ఘటన జరిగింది.
Wed, 18 Dec 202405:02 AM IST
- Minor Girl Pregnancy: విజయవాడలో ఓ మైనర్ బాలిక గర్భం దాల్చిన తీరు పోలీసుల్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.18ఏళ్లలోపు బాలికకు తరచూ జ్వరం వస్తుండటంతో తండ్రి వైద్య పరీక్షలు చేయించడంతో గర్భవతిగా తేలింది.అప్పటికే ఐదు నెలలు నిండటంతో బాలిక తండ్రి పోలీసుల్ని ఆశ్రయించాడు.ఈ ఘటన పోలీసుల్నే విస్తుబోయేలా చేసింది.
Wed, 18 Dec 202404:24 AM IST
- TTD Tamil Nadu Issue: టూరిజం కార్పొరేషన్లకు కేటాయించే శీఘ్రదర్శనం టిక్కెట్లను రద్దు చేయడం వల్ల తమిళప్రజలు ఇబ్బందులు పడుతుండటంతో వాటిని పునరుద్ధరించాలని తమిళనాడు ప్రభుత్వం ఏపీకి విజ్ఞప్తి చేసింది. కొత్త పాలకమండలి ఏర్పాటయ్యాక అన్ని టూరిజం కార్పొరేషన్లకు దర్శనం టిక్కెట్లను టీటీడీ రద్దు చేసింది.
Wed, 18 Dec 202403:53 AM IST
- Bapatla Crime: బాపట్ల జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. స్నేహానికి కళంకం తెచ్చేలా ఓ యువకుడు స్నేహితుడు భార్యపై అత్యాచార యత్నం చేశాడు. మద్యం మత్తులో స్నేహితుడు పడి ఉండగా అతని ఇంట్లోనే మిత్రుడి భార్యపై అత్యాచారానికి యత్నించాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.
Wed, 18 Dec 202411:52 PM IST
- బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడుతోంది. ఈ మేరకు వాతావరణశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ ప్రభావంతో ఈ రెండు రోజులు ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి.